నైపుణ్యాభివృద్ది రంగం లోని సంస్థలైన నేశనల్ కౌన్సిల్ ఫర్ వొకేశనల్ ట్రైనింగ్ (ఎన్‌సివిటి) ని మరియు నేశనల్ స్కిల్ డివెలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ ఎస్‌డిఎ)ని విలీనం చేసి వాటి స్థానం లో నేశనల్ కౌన్సిల్ ఫర్ వొకేశనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సివిఇటి)ని నెలకొల్పేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వివరాలు:
ఎన్‌సివిఇటి వృత్తి విద్య శిక్షణ రంగం లో నియంత్రణ విధి ని స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా నిర్వర్తిస్తుంది. అలాగే ఈ సంస్థ లు వాటి కార్యకలాపాలను నిర్వహించడం లో కనీస ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఆయా వృత్తి విద్య,నైపుణ్యాభివృద్ధి సంస్థ ల గుర్తింపు , నియంత్రణ ఎన్ సివిఇటి ప్రధాన బాధ్యత లలో భాగం గా ఉన్నాయి. సర్టిఫికెట్లను మంజూరు చేసే సంస్థలు, సెక్టర్ స్కిల్ కౌన్సిళ్లు (ఎస్‌ఎస్‌సి స్) ఇచ్చే అర్హత ధ్రువపత్రాల కు ఆమోదం తెలపడం. సర్టిఫికెట్లు మంజూరు చేసే సంస్థ లు అసెస్‌మెంట్ ఏజెన్సీ ల ద్వారా ద్వారా పరోక్ష నియంత్రణ, పరిశోధన, సమాచార వితరణ, ఫిర్యాదుల పరిష్కారం వంటి వాటిని ఇది చేపడుతుంది.
ఈ మండలి కి చైర్‌పర్సన్ నాయకత్వం వహిస్తారు. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు. ఎన్ సివిఇటి స్థాపన అనేది రెండు సంస్థ ల విలీనం ద్వారా తటస్థిస్తున్నందున ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, వనరులను దాదాపు గా వినియోగించుకోవడం జరుగుతుంది. దీని కి తోడు, సంస్థ సజావు గా నడవడానికి మరి కొన్ని పదవుల ను సృష్టిస్తారు. నియంత్రణదారు సంస్థ, నియంత్రణ ప్రక్రియ లోని ఉత్తమ ప్రక్రియ లను వాడుతారు. ఇది సంస్థ మరింత వృత్తిపరమైన నిబద్ధత తో దీనికి సంబంధించిన చట్టాల పరిధి లో సమర్ధంగా పని చేయడానికి వీలు కలుగుతుంది.
ప్రయోజనాలు:
సంస్ధాపరంగా జరుగుతున్న ఈ సంస్కరణ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కార్యక్రమాల నాణ్యత పెరగడానికి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దడానికి, వృత్తి విద్య, శిక్షణ లకు ఒక విశ్వసనీయత ఏర్పడడానికి వీలు ఉంటుంది. నైపుణ్య శిక్షణ రంగం లో ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు యాజమాన్యాలను మరింతగా ప్రోత్సహించడానికి ఆస్కారం కలుగుతుంది. రెండు లక్ష్యాలు నెరవేరడానికి ఇది ఉపకరిస్తుంది. వాటిలో ఒకటోది వృత్తి విద్య విలువ పెరగడం, రెండోది నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత పెరగడం. ఇది భారతదేశాన్ని ప్రపంచం లోనే నైపుణ్య రాజధాని గా చేయడానికి ఉద్దేశించిన ప్రధాన మంత్రి సంకల్పాన్ని నెరవేర్చేది గా ఉంది.
భారతదేశ నైపుణ్య రంగానికి నియంత్రణదారు సంస్థ గా ఎస్ సివిఇటి వృత్తి విద్య, శిక్షణ రంగం లోని ప్రతి ఒక్కరి పైన సానుకూల ప్రభావాన్ని ప్రసరించగలదు. నైపుణ్యం తో కూడిన విద్య ను ఇక ముందు స్ఫూర్తిదాయక దృష్టి తో చూడడం జరుగుతుంది. ఇది నైపుణ్యాధారిత కోర్సులు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఇది పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి అవసరమైన నైపుణ్యం గల వారి ని, శిక్షణ పొందిన వారి ని అందుబాటు లోకి తీసుకురావడం వల్ల సులభతర వాణిజ్యానికి సైతం వీలు కల్పించనుంది.
పూర్వరంగం:
భారతదేశ జనాభా వల్ల కలిగే ప్రయోజనాలను సంపూర్ణం గా వినియోగించుకోవడానికి, దేశ శ్రామికులను ఉపాధి అనుగుణ్య నైపుణ్యాలతో పరిపుష్టం చేయవలసి ఉంది. దీని తో వారు దేశ ఆర్థిక ప్రగతి కి మెరుగైన రీతి లో ఉపయోగపడగలుగుతారు.
గతంలో, దేశానికి అవసరమైన నైపుణ్య శిక్షణ చాలావరకు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ)లు ఆఫర్ చేసే కోర్సుల ద్వారా, అలాగే. ఎన్ సివిటి నియంత్రిత మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కీము (ఎంఇఎస్) ద్వారా తీరేవి. అయితే దేశం లో నానాటికీ పెరుగుతున్న నైపుణ్యం గల సిబ్బంది అవసరాలకు ఈ మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం తో నైపుణ్యాల అభివృద్ధి కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ చర్యల కారణంగా భారీ శిక్షణ కార్యకలాపాల మౌలిక సదుపాయాలను, మరీ ముఖ్యం గా ప్రైవేటు రంగం లో విస్తరించడం జరిగింది. ప్రస్తుతం ప్రైవేటు రంగ శిక్షణ సంస్థ లతో కలసి 20 మంత్రిత్వ శాఖలు, విభాగాలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ తగిన నియంత్రణ వ్యవస్థ లేనందు వల్ల ఎన్నో సంస్థ లు వివిధ ప్రమాణాల తో శిక్షణ ను అందిస్తున్నాయి. అలాగే ఎన్నో రకాల అసెస్‌మెంట్ వ్యవస్థ లు, సర్టిఫికేషన్ వ్యవస్థ లు.. వీటి ని పోల్చడానికి లేకుండా ఉంది. ఇది వృత్తి విద్య శిక్షణ వ్యవస్థపైన యువత ఉపాధి అవకాశాలపైన పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా తగిన నియంత్రణ వ్యవస్థ ను తీసుకువచ్చేందుకు నేశనల్ స్కిల్ డివెలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఎస్ డిఎ)ని తీసుకు వచ్చేందుకు 2013 లో ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల లో నైపుణ్య శిక్షణ ప్రయత్నాలను సమన్వయం చేసే ఉద్దేశం తో ఈ ప్రయత్నం జరిగింది. ఎన్‌ఎస్ డిఎ ప్రధాన పాత్ర, నేశనల్ స్కిల్స్ క్వాలిఫికేశన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఎస్ క్యుఎఫ్)ను కార్యరూపం దాల్చేలా చేయడం. అలాగే ఆయా రంగాల అవసరాల రీత్యా నాణ్యత, ప్రమాణాలను పాటించేలా చూడడం.
మొత్తం మీద, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కు సంబంధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక అంశాలను పరిశీలించడానికి ఒక నియంత్రణదారు వ్యవస్థ అనేది ఉండవలసిన అవసరాన్ని గుర్తించడమైంది. తత్ఫలితంగా, ఎన్ సి విఇటి ఆలోచన వచ్చింది. ఇది ఎన్ సివిటి కి, ఎన్‌ఎస్ డిఎ కి అప్పగించిన నియంత్రణ సంబంధి కార్యకలాపాలను చేపడుతుంది. రెగ్యులేటరీ కార్యకలాపాలు ప్రస్తుతం నేశనల్ స్కిల్ డివెలప్‌మెంట్ కార్పొరేశన్ (ఎన్‌ఎస్ డిసి) చేపడుతోంది. ఇది సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ ద్వారా జరుగుతోంది. ఇది కూడా ఎన్ సివిఇటి లోనే ఉంటుంది.
**