Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీర్ బాల్ దివస్ సందర్భంగా డిసెంబర్ 26,2022న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి.


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,    2022 డిసెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే  చరిత్రాత్మక వీర్ బాల్దివస్ లో పాల్గొంటారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి షాబాద్ కీర్తన్కు హాజరవుతారు. 300 మంది బాలలు కీర్తనలు ఆలపిస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఢిల్లీలో 3 వేల మంది పిల్లలు పాల్గొనే మార్చ్ పాస్ట్ను జెండా ఊపి ప్రారంభిస్తారు.
సాహిబ్జాదెస్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు సంబంధించిన కథలను పిల్లలు,యువత, పౌరులకు తెలిపేందుకు ముఖాముఖి  కార్యక్రమాలు,  స్వచ్ఛందంగా వివిధ వర్గాల వారు పాల్గొనే కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ఇందులో భాగంగా వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, ఇతర కార్యక్రమాలను దేశవ్యాప్తంగా గల పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తారు. పబ్లిక్ ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, పెట్రోలు పంపులు, విమానాశ్రయాలు వంటి వాటి వద్ద డిజిటల్ ఎగ్జిబిషన్లు
ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాలలో పాల్గొనే ప్రముఖులు షాహిబ్ జాడెస్ త్యాగాలు, వారి జీవితం గురించి వివరిస్తారు.

 2022 జనవరి 9 వ తేదీన శ్రీ గురుగోవింద్ సింగ్ జీ ప్రకాష్ పూరబ్ రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, డిసెంబర్ 26 వ తేదీని వీర్ బాల్ దివస్ గా పరిగణించనున్నట్టు ప్రకటించారు. శ్రీ గురుగోవింద్ సింగ్
కుమారులు షాహిబ్ జాదాస్ బాబా జోరావర్ సింగ్ జి,  బాబా ఫతే సింగ్ జీల అమరత్వానికి గుర్తుగా వీర్ బాల్ దివస్ జరుపుకుంటారు.