Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీజా ఏర్పాట్ల‌ కు మార్గాన్ని సుగ‌మం చేసే అంశం పై భార‌త‌దేశాని కి, మాల్‌దీవ్స్ కు మ‌ధ్య ఒక ఒప్పందాని కి జరిగిన సంతకాల కు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


వీజా ఏర్పాట్ల‌ కు మార్గాన్ని సుగ‌మం చేసే అంశం పై భార‌త‌దేశాని కి మ‌రియు మాల్‌దీవ్స్ కు మ‌ధ్య ఒక ఒప్పందాని కి 2018వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో జరిగినటువంటి సంత‌కాల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
 
మాల్‌దీవ్స్ ప్రెసిడెంటు భార‌త‌దేశాని కి విచ్చేసిన సంద‌ర్భం గా వీజా ఫెసిలిటేశన్ అగ్రిమెంటు పైన సంత‌కాలు జ‌రిగాయి.  రెండు దేశాల మ‌ధ్య ప్ర‌జ‌లు అటు ఇటు జ‌రిపే రాక‌ పోక‌ల‌ ను మ‌రింత గా విస్త‌రించ‌డం ఈ ఒప్పందం ధ్యేయం గా ఉంది.  దీనితో ఉభ‌య దేశాల పౌరులు ప‌ర్య‌ట‌న‌, వైద్య చికిత్స‌, విద్య, వ్యాపారం మ‌రియు ఉద్యోగాల కోసం అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ప్ర‌యాణించ‌టం  సుల‌భ‌త‌రం అవుతుంది.  ఈ ఒప్పందం వీజా అక్క‌ర లేకుండా 90 రోజుల పాటు ప్రయాణించేందుకు వీలు క‌ల్పించడం తో పాటు ఆ త‌ర‌హా వీజా ద్వారా రెండు దేశాల వారు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు స్వేచ్ఛ‌ గా ప్ర‌వేశించి, ఆ త‌రువాత దానిని ఇరు దేశాల లోను మెడిక‌ల్ వీజా గానే కాక‌ విద్యార్థుల యొక్క మరియు ఉద్యోగ అన్వేష‌ణ లో ఉన్న వారి యొక్క డిపెండెంట్ ల వీజాలు గా కూడా  ఇట్టే మార్చుకొనేందుకు సైతం అవ‌కాశాన్ని కల్పిస్తుంది.

పూర్వ‌రంగం:

భార‌త‌దేశం మరియు మాల్‌దీవ్స్ కాల పరీక్ష కు తట్టుకొని నిలచిన బంధాన్ని, చిర కాలం గా మైత్రీబంధాన్ని కొనసాగిస్తున్నాయి.  రెండు దేశాల లో ప్ర‌జ‌ల‌ కు, ప్రజలకు మ‌ధ్య చ‌క్క‌ని సంబంధాలు ఇరు ప‌క్షాల న‌డుమ ప్ర‌త్యేక సంబంధాల‌ కు పునాది గా నిలచాయి.   2018వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ లో మాల్‌దీవ్స్ నూత‌న అధ్య‌క్షుని గా ఎన్నికైన శ్రీ‌ ఇబ్రాహిమ్ మొహ‌మద్ సోలిహ్ ప‌ద‌వీప్రమాణస్వీకారానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీమాలె ను సంద‌ర్శించ‌టం, త‌ద‌నంత‌రం 2018వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ లో భార‌త‌దేశాన్ని మాల్‌దీవ్స్ అధ్య‌క్షుడు సంద‌ర్శించ‌టం తో ద్వైపాక్షిక సంబంధాలు ఒక స‌కారాత్మ‌క‌మైన వేగ గ‌తి ని అందుకొన్నాయి.

**