Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశ్వ ఉమియాధామ్ భ‌వన స‌ముదాయాని కి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

విశ్వ ఉమియాధామ్ భ‌వన స‌ముదాయాని కి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

విశ్వ ఉమియాధామ్ భ‌వన స‌ముదాయాని కి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

విశ్వ ఉమియాధామ్ భ‌వన స‌ముదాయాని కి శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు అహమదాబాద్ లోని జ‌స్ పుర్ లో విశ్వ ఉమియాధామ్ భ‌వ‌న స‌ముదాయాని కి పునాది రాయిని వేశారు.

ఈ సంద‌ర్భం గా త‌ర‌లి వ‌చ్చిన జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ, మ‌న స‌మాజాన్ని బ‌లోపేతం చేయ‌డం లో సాధువులు మ‌రియు స‌న్యాసుల భూమిక ను ఏ ఒక్క‌రూ మ‌రువ జాల‌ర‌ని పేర్కొన్నారు. వారు మ‌న‌కు అమూల్య‌మైన ప్ర‌బోధాల‌ ను అందించార‌ని ఆయ‌న చెప్పారు. వారు చెడు పైన మ‌రియు అణ‌చివేత పైన పోరాడేందుకు మ‌న‌కు బ‌లాన్ని ఇచ్చార‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

మ‌న భూత కాలం లోని మంచి ని ఇముడ్చుకోవ‌డాన్ని గురించి కూడా సాధువులు, సంతులు మ‌న‌కు బోధించార‌ని, అదే స‌మ‌యం లో ముందుకు చూడ‌టం మ‌రియు మారుతున్న కాలం తో పాటే మారాల‌ని వారు నేర్పార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌జ‌ల కు ల‌బ్ది ని చేకూర్చేట‌టువంటి కార్య‌క్ర‌మాల ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, చిన్నదైన స్థాయి లో ఏమైనా చేయ‌డం అనేది కేంద్ర ప్ర‌భుత్వాని కి ఆమోద యోగ్యం కాద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం యొక్క కృషి ఎల్ల‌ప్పుడూ పెద్ద ఎత్తున ఉంటుంద‌ని, స‌మాజం లో అన్ని వ‌ర్గాల‌ కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

స‌ముదాయం స్థాయి లో చూసిన‌ప్పుడు యువ‌జ‌నుల కు అగ్ర‌గామి నాణ్య‌త తో కూడిన విద్య ను అందించ‌డం ముఖ్య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశరు.

ఉమియా మాత ప‌ట్ల విశ్వాసాన్ని క‌లిగి ఉండేవారు, ఆడ భ్రూణ హ‌త్య ల‌ను ఎన్న‌టికీ స‌మ‌ర్ధించ‌బోర‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి వ‌క్కాణించారు.

లైంగిక‌త పై ఆధార‌ప‌డే ఎటువంటి వివ‌క్ష‌త‌ కు తావు ఇవ్వ‌ని స‌మాజాన్ని ఆవిష్క‌రించ‌డం కోసం తోడ్ప‌డండి.. అంటూ ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.