Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశ్వవిద్యాలయాలు/ క‌ళాశాల‌లు మరియు కేంద్రం అందించే ఆర్థిక సహాయంతో నడిచే సాంకేతిక సంస్థ‌ల టీచర్లు, ఇంకా తత్సమాన‌మైన విద్యాసంబంధి సిబ్బందికి స‌వ‌రించిన పే స్కేల్స్ ను ఆమోదించిన మంత్రివర్గం


విశ్వవిద్యాలయాలు/ క‌ళాశాల‌లు మరియు కేంద్రం అందించే ఆర్థిక సహాయంతో నడిచే సాంకేతిక సంస్థ‌ల టీచర్లు, ఇంకా తత్సమాన‌మైన విద్యాసంబంధి సిబ్బందికి పే స్కేల్స్ లో సవరణకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర‌ మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలిపింది. ఉన్నత విద్యా సంస్థలలో పనిచేసే యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యుజిసి) పరిధిలో ఉన్నటువంటి ఉన్న‌త విద్యా సంస్థ‌లు మరియు కేంద్ర కేంద్రం అందించే ఆర్థిక సహాయంతో నడిచే సాంకేతిక సంస్థ‌ల టీచర్లు మరియు ఇతర తత్సమాన విద్యాసంబంధి సిబ్బంది దాదాపు 8 ల‌క్ష‌ల మందికి ఇది వ‌ర్తిస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల విషయంలో 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసులు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవడం జరిగింది.

ఈ నిర్ణ‌యం కార‌ణంగా యుజిసి/ ఎంహెచ్ ఆర్ డి నిధుల‌తో నడుస్తున్న 106 విశ్వ‌విద్యాల‌యాలు/ క‌ళాశాల‌ల్లో ప‌ని చేసే 7.58 ల‌క్ష‌ల మంది టీచర్లు మరియు తత్సమానమైన విద్యా సంబంధి సిబ్బందికి ల‌బ్ధి చేకూరుతుంది. అంతే కాదు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిధులు అందించే 329 విశ్వ‌విద్యాల‌యాలకు, వాటికి అనుబంధంగా ఉండే 12,912 ప్ర‌భుత్వ‌ మరియు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలకు అనుబంధమైన ప్రైవేట్ ఎయిడెడ్ క‌ళాశాల‌ల‌కు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

దీనికి తోడు కేంద్ర ప్ర‌భుత్వ నిధులను అందుకొనే సాంకేతిక రంగ విద్యాసంస్థ‌లైన ఐఐటీలు, ఐఐఎస్ సి, ఐఐఎంలు, ఐఐఎస్ ఇ ఆర్‌లు, ఐఐఐటీలు, ఎన్ ఐ టి ఐ ఇ.. మొద‌లైన‌వి కూడా స‌వ‌రించిన పే ప్యాకేజీ పరిధి లోకి వస్తాయి.

ఆమోదించినటువంటి పే స్కేల్స్ 1.1.2016 నుండి వర్తిస్తాయి. ఈ నిర్ణ‌యం కార‌ణంగా కేంద్ర‌ ప్ర‌భుత్వం పైన ఏటా పడే భారం సుమారు రూ. 9,800 కోట్లు ఉండగలదు.

ఈ పే రివిజన్ యొక్క అమలు ఫలితంగా టీచర్ల వేత‌నాలలో పెరుగుదల పరిధి అనేది.. 6వ కేంద్ర వేత‌న క‌మిష‌న్ ప్ర‌కారం ప్ర‌స్తుతం అమ‌లవుతున్న వేత‌నాలను బట్టి చూస్తే.. రూ.10,400 నుండి రూ.49800 వ‌రకు ఉంటుంది. ఈ స‌వ‌ర‌ణ ప్ర‌కారం ప్రారంభ‌ వేత‌న పెరుగుద‌ల 22 శాతాన్నుండి 28 శాతం వ‌ర‌కు ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అందిస్తున్న విద్యాసంస్థ‌ల‌కు స‌వ‌రించిన పే స్కేల్స్ వ‌ర్తించాలంటే ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు దీనిని ఆమోదించాల్సివుంటుంది. పే స్కేల్స్ స‌వ‌ర‌ణ కార‌ణంగా రాష్ట్రాల‌ మీద పడే అద‌న‌పు వ్యయ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భ‌రిస్తుంది. స‌వ‌రించిన వేత‌న స్వరూపంలో ప్రతిపాదించిన చ‌ర్య‌ల కారణంగా ఉన్న‌త విద్యారంగంలో నాణ్య‌త మెరుగుపడుతుందని, అంతే కాక ప్ర‌తిభ‌ గ‌ల‌ వారిని ఉన్నత విద్యాసంస్థ‌ల ఉద్యోగాలలోకి ఆకర్షించడంతో పాటు ఇప్ప‌టికే ఈ కొలువులలో ఉన్న‌ వారిని అట్టేపెట్టుకోవడానికి సైతం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.