నమస్కారం,
“హే విధాతా, దావో దావో మోదేర్ గౌరబ్ దావో” (ఓ సృష్టి కర్త ! కీర్తిని మాకు ప్రసాదించనివ్వండి) – గురుదేవ్ ఒకప్పుడు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ విధంగా ప్రార్థించారు. ఈ రోజు, విశ్వ భారతి విశ్వవిద్యాలయం అద్భుతమైన 100 వ వార్షికోత్సవం సందర్భంగా, నాతో పాటు ఈ గొప్ప సంస్థ కోసం దేశం మొత్తం అదే ప్రార్థిస్తోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు , కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిద్యూత్ చక్రవర్తి గారు, ప్రొఫెసర్లు, రిజిస్ట్రార్లు, విశ్వభారతి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్! విశ్వ భారతి 100 వ వార్షికోత్సవం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం. ఈ రోజున ఈ ‘తపోభూమి’ని స్మరించుకునే అవకాశం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది.
మిత్రులారా,
విశ్వభారతి 100 ఏళ్ల ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. దేశం గురించి గురుదేవ్ ఆలోచనా ధోరణి, తత్వశాస్త్రం, శ్రద్ధకు నిజమైన ప్రతిరూపం విశ్వభారతి. భారతదేశం కోసం గురుదేవ్ చూసిన కలను సాకారం చేసుకోవడానికి దేశానికి స్థిరమైన శక్తిని అందించడానికి ఇది ఒక విధమైన పూజ్యమైన ప్రదేశం. ప్రపంచ ప్రఖ్యాత గీత రచయితలు-సంగీతకారులు, కళాకారులు-సాహిత్యవేత్త, ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మరియు ఆర్థిక నిపుణులను ఉత్పత్తి చేస్తున్న విశ్వ భారతి నవ భారతాన్ని నిర్మించడానికి కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థను ఇంత ఎత్తుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. విశ్వభారతి, శ్రీనికేతన్, శాంతినికేతన్ లు గురుదేవ్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. విశ్వభారతి అనేక గ్రామాల్లో చేస్తోన్న అభివృద్ధి పనులు ఎప్పుడూ ప్రశంసనీయమే. 2015లో మీరు ప్రారంభించిన యోగా విభాగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీ విశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రకృతితో సంబంధం కలిగి ఉన్న అధ్యయనం, జీవితం రెండింటికి ఓ ఉదాహరణ. విశ్వభారతి నుంచి మన దేశం ఈ సందేశాన్ని ప్రపంచానికి చేరవేయడం చూసి మీరు కూడా సంతోషిస్తారు. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ నేడు ప్రపంచంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. పారిస్ ఒప్పందం యొక్క పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి సరైన మార్గంలో వేగంగా వెళ్తున్న ప్రపంచంలోని ఏకైక ప్రధాన దేశం నేడు భారతదేశం.
మిత్రులారా,
ఈ రోజు, విశ్వభారతి విశ్వవిద్యాలయం 100 వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు, దాని స్థాపనకు ఆధారమైన పరిస్థితిని గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితి బ్రిటిష్ వారి బానిసత్వం నుండి మాత్రమే తలెత్తలేదు. దీని తరువాత వందల సంవత్సరాల అనుభవం ఉంది. ఇది వందల సంవత్సరాలుగా కొనసాగిన ఒక ఉద్యమం యొక్క నేపథ్యం. ఈ రోజు, మీలాంటి పండితుల సమక్షంలో, నేను దీనిని ప్రత్యేకంగా చర్చిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా అరుదుగా చర్చించబడింది. చాలా తక్కువ శ్రద్ధ చూపబడింది. ఈ చర్చ కూడా అవసరం ఎందుకంటే ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమంతో, విశ్వ భారతి లక్ష్యాలతో నేరుగా ముడిపడి ఉంది.
మిత్రులారా,
మనం స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడినప్పుడు, 19వ మరియు 20వ శతాబ్దపు చిత్రం మన మదిలో మెదులుతుంది. అయితే ఈ ఉద్యమాలకు పునాది ఎప్పుడో పడిన మాట కూడా వాస్తవం. శతాబ్దాల నుంచి జరుగుతున్న వివిధ ఉద్యమాల నుంచి భారత స్వాతంత్ర్యోద్యమం లో శక్తి వచ్చింది. భక్తి ఉద్యమం భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేసింది. భక్తి శకంలో మన మహామహులు, మహంత్ లు, ఆచార్యులు, భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి దిశలోనూ, తూర్పు-పశ్చిమ-ఉత్తర దక్షిణాలు దేశం చైతన్యాన్ని జాగృతం చేయడానికి నిరంతర ప్రయత్నం చేశారు. అలా దక్షిణం నుంచి మధ్వాచార్యులు, నింభర్కాచార్యులు, వల్లభాచార్య, రామానుజాచార్య, పశ్చిమం నుంచి మీరాబాయి, ఏక్ నాథ్, తుకారాం, రాందాస్, నర్సి మెహతా, ఉత్తరాది నుంచి సంత్ రామానంద్, కబీర్ దాస్, గోస్వామి తులసీదాస్, సుర్దాస్, గురు నానక్ దేవ్, సెయింట్ రైదాస్ వంటి అసంఖ్యాక మహాపురుషుల ఆలోచనలు, తూర్పు నుంచి చైతన్య మహాప్రభు, శ్రీమంత శంకర్ దేవ్ వంటి అసంఖ్యాకమైన మహనీయుల, సాధువుల ఆలోచనలు సమాజాన్ని శక్తివంతం చేశాయి. అదే భక్తి కాలంలో రాస్ఖాన్, సూర్దాస్, మాలిక్ మహమ్మద్ జయసి, కేశవదాస్, విద్యాపతి వంటి గొప్ప వ్యక్తులు తమ రచనద్వారా సమాజాన్ని సంస్కరించి, అభివృద్ధి చేయడానికి మార్గం చూపారు. భక్తి శకంలో ఈ పుణ్యాత్ములు ప్రజలలో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించారు. ఫలితంగా ఈ ఉద్యమం ప్రతి సరిహద్దును దాటి భారతదేశం నలుమూలలకు చేరుకుంది. ప్రతి మతానికి చెందిన ప్రజలు, ప్రతి వర్గం, ప్రతి కులానికి చెందిన ప్రజలు భక్తి స్థాపనపై ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలబడ్డారు. శతాబ్దాలుగా కష్టపడుతున్న భారతదేశాన్ని సమష్టి చైతన్యం, విశ్వాసంతో నింపిన ద్వారం భక్తి ఉద్యమం.
మిత్రులారా,
కాళీ దేవి మహా భక్తుడైన శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చర్చించేవరకు ఈ భక్తి అంశం ముందుకు సాగదు. ఆయన గొప్ప సాధువు, ఎందుకంటే భారతదేశం స్వామి వివేకానందను పొందింది. స్వామి వివేకానంద భక్తి, జ్ఞాన, కర్మలకు ప్రతిరూపం. భక్తి పరిధిని విస్తరింపచేస్తూ ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని చూడటం ప్రారంభించాడు. కర్మకు ఒక వ్యక్తీకరణ కూడా ఇచ్చాడు, ఒక వ్యక్తి సంస్థ అభివృద్ధి గురించి నొక్కి చెప్పాడు, ప్రోత్సహించాడు.
మిత్రులారా,
వందల సంవత్సరాల భక్తి ఉద్యమంతో పాటు, కర్మ ఉద్యమం కూడా దేశంలో జరిగింది. శతాబ్దాలుగా, భారత ప్రజలు బానిసత్వం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినా, మహారాణా ప్రతాప్ అయినా, ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి లేదా కిట్టూరుకు చెందిన రాణి చెన్నమ్మ లేదా లార్డ్ బిర్సా ముండా సాయుధ పోరాటం అయినా, అన్యాయం, దోపిడీలకు వ్యతిరేకంగా సాధారణ పౌరుల కఠోర శ్రమ, పట్టుదల, త్యాగం దాని శిఖరాగ్రంలో ఉన్నాయి. ఇది తరువాతి కాలంలో మన స్వాతంత్ర్య పోరాటానికి ప్రధాన ప్రేరణగా మారింది.
మిత్రులారా,
భక్తి మరియు కర్మ యొక్క సిద్ధాంతాలు పొంగిపొర్లుతున్నప్పుడు, జ్ఞాన స్రవంతికి చెందిన వినూత్న త్రివేణి సంగమం స్వాతంత్ర్యోద్యమ చైతన్యంగా మారింది. స్వేచ్ఛ కోసం ఆరాటంలో, భక్తికి చాలా ప్రేరణ ఉంది. స్వాతంత్ర్యోద్యమంలో భక్తికి ప్రేరణ పుష్కలంగా ఉండేది. జ్ఞాన స్థాపనపై స్వాతంత్ర్య సమరం లో విజయం సాధించడానికి సైద్ధాంతిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఉజ్వల భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించడానికి ఒక కొత్త తరాన్ని సృష్టించడమే కాక, ఆ సమయంలో స్థాపించబడిన అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇందులో చాలా పెద్ద పాత్ర పోషించాయి. విశ్వభారతి విశ్వవిద్యాలయం కావచ్చు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కావచ్చు,, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, ప్రస్తుతం లాహోర్ లో ఉన్న నేషనల్ కాలేజ్, తిరుచ్చి నేషనల్ కాలేజ్, మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్, గుజరాత్ విద్యాపీఠ్, విలింగ్డన్ కాలేజ్, జామియా మిలియా ఇస్లామియా, లక్నో విశ్వవిద్యాలయం, పాట్నా విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం వంటి అనేక సంస్థలు దేశంలో ఇదే కాలంలో స్థాపించబడ్డాయి. భారతదేశంలోని ఈ విశ్వవిద్యాలయాలలో పూర్తిగా కొత్త పండితుల సమూహం అభివృద్ధి చెందింది. ఈ విద్యాసంస్థలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న సైద్ధాంతిక ఉద్యమానికి కొత్త శక్తిని, కొత్త దిశను, కొత్త ఎత్తును ఇచ్చాయి. మనం భక్తి ఉద్యమం ద్వారా ఐక్యమయ్యాము; జ్ఞాన ఉద్యమం మేధోశక్తిని ఇచ్చింది కర్మ ఉద్యమం మన హక్కుల కోసం పోరాడటానికి ధైర్యాన్ని ఇచ్చింది. వందల సంవత్సరాల పాటు కొనసాగిన ఈ ఉద్యమాలు త్యాగానికి, తపస్సుకు, అంకితభావానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచాయి. ఈ ఉద్యమాల ప్రభావంతో వేలాది మంది స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చారు.
మిత్రులారా,
ఈ జ్ఞాన ఉద్యమానికి గురుదేవ్ స్థాపించిన విశ్వ భారతీ విశ్వవిద్యాలయం కొత్త ప్రేరణ ఇచ్చింది. గురుదేవ్ భారతీయ సంస్కృతిని తన స్వంత సంప్రదాయాలతో మిళితం చేసి, విశ్వ భారతికి ఆకృతిని ఇచ్చిన విధానం దేశానికి జాతీయత యొక్క బలమైన భావాన్ని తెచ్చిపెట్టింది. అదే సమయంలో ప్రపంచ సౌభ్రాతృత్వానికి ఆయన అంతే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
మిత్రులారా,
వేదం నుంచి వివేకానందుని వరకు భారత భావజాల స్రవంతి కూడా జాతీయవాదం పై గురుదేవ్ ఆలోచనలో వ్యక్తమైంది. ఈ ప్రవాహము అంతర్ముఖం కాదు; ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారత్ ను వేరు చేసి ఉంచబోమని స్పష్టం చేసింది. ఆయన ఆలోచన ఏమిటంటే, భారతదేశంలో ఉత్తమమైన వాటి నుండి ప్రపంచం ప్రయోజనం పొందాలి, మరియు ప్రపంచంలో ఉత్తమమైన వాటి నుండి భారతదేశం నేర్చుకోవాలి, మీ విశ్వవిద్యాలయం పేరును చూడండి. విశ్వభారతి అనే మీ విశ్వవిద్యాలయం పేరు చూస్తే అది భారత మాతకు, విశ్వ లోకానికి ఉన్న సంబంధం. గురుదేవ్ సర్వవ్యాపి, సహజీవనము, సహకారం ద్వారా మానవ సంక్షేమానికి గొప్ప లక్ష్యం వైపు అడుగులు వేశారు. విశ్వభారతి గురించి గురుదేవ్ ఆలోచన కూడా స్వావలంబన భారతదేశం యొక్క సారాంశం. యావత్ ప్రపంచ సంక్షేమానికి భారత్ సంక్షేమానికి కూడా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మార్గం. ఈ ప్రచారం భారతదేశం సాధికారత కోసం ఒక ప్రచారం; భారతదేశం యొక్క సౌభాగ్యంతో ప్రపంచవ్యాప్తంగా సంవృద్ధిని తీసుకురావడానికి ఇది ఒక ప్రచారం. బలమైన, స్వావలంబన కలిగిన భారతదేశం ప్రపంచ మంతటికీ ఎల్లప్పుడూ ప్రయోజనం చేకూర్చినదన్న దానికి చరిత్ర సాక్ష్యం. మన అభివృద్ధి అనేది వ్యక్తిగతం కాదు, విశ్వవ్యాప్తం , సమగ్రమైనది . పైగా, మన రక్తంలో నే ”సర్వే భవంతు సుఖినః” (అందరికీ మంచి జరగాలి) అని ఉంది. భారతికీ, ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం మీకంటే బాగా ఎవరికి తెలుసు? గురుదేవ్ మనకు ‘స్వదేశీ సమాజ్’ తీర్మానం ఇచ్చారు. మన పల్లెలు, వ్యవసాయం స్వయం సమృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాపార,, వాణిజ్య రంగాలలో స్వయం సమృద్ధిని చూడాలని ఆయన కోరుకున్నాడు. కళ, సాహిత్యం స్వాభిమానిగా చూడాలనుకున్నాడు. స్వావలంబన అనే లక్ష్యాన్ని సాధించటానికి ఆయన ‘స్వయంశక్తి’ గురించి మాట్లాడారు. దేశ నిర్మాణం గురించి ఆయన చెప్పిన విషయాలు కూడా నేడు కూడా అంతే ముఖ్యం. ఆయన ఇలా అన్నాడు- ‘దేశ నిర్మాణం ఒక విధంగా మోక్షాన్ని సాధించే విస్తరణ. మీ ఆలోచనల ద్వారా, మీ చర్యల ద్వారా, మీ విధులను నిర్వర్తించడం ద్వారా మీరు ఒక దేశాన్ని నిర్మించినప్పుడు, అప్పుడు మీరు మీ ఆత్మను దేశం యొక్క ఆత్మలోనే చూడటం ప్రారంభిస్తారు.
మిత్రులారా,
భారతదేశ ఆత్మ, భారతదేశ స్వావలంబన భారతదేశ ఆత్మగౌరవం పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. భారతదేశ ఆత్మగౌరవం రక్షణ కోసం, బెంగాల్ తరాలవారు తమను తాము త్యాగం చేశారు. ఖుదీరాం బోస్ 18 ఏళ్ల వయసులో ఉరితీయబడ్డాడని గుర్తుంచుకోండి. ప్రఫుల్ చకి 19 సంవత్సరాల వయస్సులో అమరుడైనాడు. బెంగాల్ కు చెందిన అగ్నికన్యగా పేరొందిన బీనా దాస్ 21 ఏళ్ల వయసులో జైలుకు పంపారు. ప్రీతిలాత వడ్డేర్ తన 21 వ ఏట తన జీవితాన్ని త్యాగం చేసింది. చరిత్రలో పేర్లు నమోదు చేయని లెక్కలేనన్ని మంది ఉన్నారు. వీరంతా దేశ ఆత్మగౌరవం కోసం చిరునవ్వుతో మరణాన్ని స్వీకరించారు. ఈ రోజు, దీని నుండి ప్రేరణ పొంది, స్వావలంబన భారతదేశం కోసం జీవించాలనే మన సంకల్పం నెరవేర్చాలని కోరుకుంటున్నాము.
మిత్రులారా,
భారతదేశాన్ని బలంగా మరియు స్వయం సమృద్ధిగా మార్చడంలో మీ సహకారం మొత్తం ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా చేస్తుంది. 2022 సంవత్సరం దేశ స్వాతంత్య్రం 75 వ వార్షికోత్సవం. విశ్వ భారతి స్థాపించిన 27 సంవత్సరాల తరువాత భారతదేశం స్వతంత్రమైంది. ఇప్పటి నుండి ఇరవై ఏడు సంవత్సరాలు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 100 వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. మనం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, కొత్త శక్తిని సంపాదించాలి, మన ప్రయాణాన్ని కొత్త మార్గంలో ప్రారంభించాలి. ఈ ప్రయాణంలో మనకు గురుదేవ్, ఆయన ఆలోచనలు తప్ప మరెవరూ మార్గనిర్దేశం చేయరు. ప్రేరణ మరియు అంకితభావం ఉన్నప్పుడు, లక్ష్యాలు కూడా స్వయంచాలకంగా తీర్చబడతాయి. విశ్వ భారతి గురించి మాట్లాడుతూ, మహమ్మారి కారణం గా చారిత్రాత్మక పౌష్ మేళాను ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించలేక పోయాం . 100 సంవత్సరాలలో ఇది మూడవసారి. ఈ మహమ్మారి దాని విలువను మనకు వివరించింది. ఈ మంత్రం ఎల్లప్పుడూ వోకల్ ఫర్ లోకల్, పౌష్ మేళాతో ముడిపడి ఉంది. అంటువ్యాధి కారణంగా ఈ మేళాకు వచ్చే కళాకారులు, హస్తకళాకారులు రాలేరు. మనం ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నప్పుడు, స్వావలంబన గురించి మాట్లాడుతున్నప్పుడు, మొదట, నా కోరికను మన్నించి, మీరు అందరూ నాకు సహాయం చేయండి. విశ్వ భారతి విద్యార్థులు, పౌష్ మేళాకి వచ్చే కళాకారులను సంప్రదించి, వారి ఉత్పత్తుల గురించి సమాచారాన్ని సేకరించి, ఈ పేద కళాకారుల కళను ఆన్‌లైన్‌లో ఎలా విక్రయించవచ్చో చూడండి, సోషల్ మీడియా నుండి ఏ సహాయం తీసుకోవచ్చు , దానిపై పని చేయండి. ఇది మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా స్థానిక కళాకారులు, హస్తకళలు తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లగలిగే విధంగా నేర్పించాలి మరియు వారికి కూడా మార్గం చూపాలి. అలాంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది, గురుదేవ్ కలలను నెరవేర్చగలుగుతాము. గురుదేవ్ యొక్క అత్యంత ఉత్తేజకరమైన మంత్రాన్ని కూడా మీరు గుర్తుంచుకుంటారు – ‘జోడి టోర్ డాక్ షునే కీ నా అషే తోబే ఎక్లా చలో రే’ . ఎవరూ వెంట రాకపోతే, మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఒంటరిగా నడవవలసి వస్తే, ఖచ్చితంగా వెళ్ళండి.
మిత్రులారా,
గురుదేవ్ ఇలా అన్నారు- సంగీతం మరియు కళ లేకుండా, దేశం తన నిజమైన వ్యక్తీకరణ శక్తిని కోల్పోతుంది మరియు దాని పౌరుల ఔన్నత్యం బయటకు రాదు’ అని. గురుదేవ్ మన ఘనమైన సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, పెంపకం మరియు విస్తరణ చాలా ముఖ్యమైనదిగా పరిగణించాడు. ఆ నాటి బెంగాల్ ను చూస్తే మరో అద్భుత విషయం కనిపిస్తుంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో అన్నిచోట్లా కల్లోలం చోటు చేసుకున్నప్పుడు, బెంగాల్ ఆ ఉద్యమానికి ఒక దిశను ఇవ్వడమే కాకుండా సంస్కృతిని పెంపొందించే ఒక వ్యక్తిగా నిలబడింది. బెంగాల్ లో సంస్కృతి, సాహిత్యం, సంగీతం కూడా ఒక విధంగా స్వాతంత్ర్య ఉద్యమానికి బలం చేకూర్చాయి.
మిత్రులారా,
గురుదేవ్ దశాబ్దాల క్రితం జోస్యం చెప్పాడు-మరియు ఆయన చెప్పిన ప్రవచనం ఏమిటి, ఓరే నోటున్ జుగర్ భోరే, ఎషో గ్యాని ఎషో కొర్మి నాషో భరోటో -లాజో హే, బిరో ధోర్మే పున్నోకోర్మే బిశ్వో హృదోయే రాజో హే…. గురుదేవ్ బోధనలను అర్థం చేసుకోవడం, నిజం చేయడం మన అందరి బాధ్యత.
మిత్రులారా,
గురుదేవ్ విశ్వ భారతిని మాత్రమే అభ్యాస కేంద్రంగా స్థాపించలేదు. వారు దానిని నేర్చుకోవడానికి పవిత్ర స్థలంగా చూశారు. బోధన మరియు అభ్యాసం మధ్య వ్యత్యాసాన్ని గురుదేవ్ యొక్క ఒక వాక్యంలోనే అర్థం చేసుకోవచ్చు. అతను ఇలా అన్నాడు – ‘నాకు నేర్పించినది నాకు గుర్తు లేదు. నేను నేర్చుకున్నది మాత్రమే నాకు గుర్తుంది. ‘ దీనిని మరింత వివరంగా వివరిస్తూ గురుదేవ్ ఠాగూర్ ఇలా అన్నారు – ‘గొప్ప విద్య ఏమిటంటే అది మాకు తెలియజేయడమే కాక అందరితో కలిసి జీవించమని నేర్పుతుంది. “ప్రపంచానికి ఆయన సందేశం ఏమిటంటే, జ్ఞానాన్ని ప్రాంతాలకు, సరిహద్దులకు పరిమితం చేయడానికి మనం ప్రయత్నించకూడదు. ఆయన యజుర్వేదం యొక్క మంత్రాన్ని విశ్వ భారతి యొక్క మంత్రంగా చేసాడు, అనగా ‘यत्र विश्वम भवत्येक नीड़म’ ‘ప్రపంచం మొత్తం గూడుగా మారిన చోట ’. కొత్త పరిశోధన చేయాల్సిన ప్రదేశం, అందరూ కలిసి ముందుకు సాగాల్సిన ప్రదేశం, మన విద్యామంత్రి ఇప్పుడు వివరణ ఇచ్చే, గురుదేవ్ ఇలా అన్నారు- ‘చిత్తో జేతా భోయ్ షనో, ఉఛో జేతా షిర్, జ్ఞాన్ జేతా ముక్తో’ అంటే మన మనస్సులో భయం లేని చోట మనం ఒక స్థలాన్ని సృష్టించుకోవాలి, మన తల ఎత్తు గా ఉంటుంది, మరియు జ్ఞానం సంకెళ్ళ నుంచి విముక్తి.
కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు దేశం ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కూడా ప్రయత్నిస్తోంది. ఈ విద్యా విధానాన్ని అమలు చేయడంలో విశ్వభారతి ప్రధాన పాత్ర పోషిస్తోంది. మీకు 100 సంవత్సరాల అనుభవం, అంకితభావం, దిశానిర్దేశం, తత్వశాస్త్రం, అలాగే గురుదేవ్ ఆశీస్సులు ఉన్నాయి. ఈ విషయమై విశ్వభారతి ఇతర విద్యాసంస్థలతో ఎంత ఎక్కువ చర్చ చేస్తే అంత ఎక్కువగా ఆ విద్యాసంస్థలకు అవగాహన పెరుగుతుంది.
మిత్రులారా,
గురుదేవ్ గురించి నేను మాట్లాడినప్పుడు, నేను ఒక విషయం గురించి మాట్లాడటాన్ని ఆపలేను. చివరిసారిగా నేను ఇక్కడ ఉన్నప్పుడు, నేను దాని గురించి కొద్దిగా ప్రస్తావించాను. గురుదేవ్, గుజరాత్ ల సాన్నిహిత్యాన్ని నేను మళ్లీ గుర్తు చేస్తున్నాను. దీని గురించి పదే పదే మాట్లాడటం కూడా ముఖ్యం ఎందుకంటే అది ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని నింపుతుంది. వివిధ భాషలు, మాండలికాలు, ఆహారం, దుస్తులు మన దేశానికి ఎంత మేరకు సంబంధం ఉందో ఇది తెలియజేస్తుంది. భిన్నత్వంతో నిండిన మన దేశం, ఐక్యంగా, ఒకరి నుంచి ఒకరు ఎంతో నేర్చుకుంటున్నారని ఇది తెలియజేస్తుంది.
మిత్రులారా,
గురుదేవ్ అన్న సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఐసిఎస్ లో ఉన్నప్పుడు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూడా నియమితులయ్యారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తరచూ గుజరాత్ కు వెళ్లేవాడు. అహ్మదాబాద్‌లో నివసిస్తున్నప్పుడు, అతను తన రెండు ప్రసిద్ధ బెంగాలీ కవితలు ‘బాండి ఓ అమర్’ మరియు ‘నిరోబ్ రజనీ దేఖో’ రాశారు. అతను తన గుజరాత్ పర్యటనలో తన ప్రసిద్ధ కూర్పు ‘క్షుడిట్ పషన్’ లో కొంత భాగాన్ని కూడా రాశాడు. అంతేకాదు గుజరాత్ కు చెందిన కుమార్తె శ్రీమతి హతిసింగ్ కూడా గురుదేవ్ ఇంటికి కొడలిగా వచ్చింది. మన మహిళా సాధికారత సంస్థలు అధ్యయనం చేయాల్సిన మరో వాస్తవం కూడా ఉంది. సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానందిని దేవి గారు అహ్మదాబాద్లో నివసించినప్పుడు, స్థానిక మహిళలు తన చీర పల్లును కుడి భుజంపై ఉంచడాన్ని ఆమె గమనించింది. ఇప్పుడు పల్లు కుడి భుజంపై ఉంది, కాబట్టి మహిళలకు కూడా పని చేయడంలో కొంత ఇబ్బంది ఉంది. ఇది చూసిన జ్ఞానందిని దేవి ఎడమ భుజంపై చీర పల్లు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకున్నాడు. ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు కాని ఎడమ భుజంపై ఉన్న చీర పల్లు తమదేనని వారు అంటున్నారు.సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానందిని దేవి అహ్మదాబాద్ లో నివసిస్తూ ఉండగా స్థానిక మహిళలు తమ చీరలోని పల్లును కుడి భుజానికి వేసుకుని ఉండటాన్ని ఆమె గమనించారు. ఇప్పుడు కుడి భుజంమీద ఒక పల్లూ ఉంది, అందువల్ల మహిళలు పనిచేయడానికి కొంత ఇబ్బంది పడ్డారు. ఇది చూసిన జ్ఞానందిని దేవి చీరలోని పాలూను ఎడమ భుజం మీద ఎందుకు తీయాలో ఆలోచన చేసింది. ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ వారు ఎడమ భుజం పై ఉన్న చీర యొక్క పాలు వారి స్వంతఅని చెప్పారు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, ఒకరితో ఒకరు ఆనందంగా జీవించడం, కుటుంబంలా జీవించడం ద్వారా దేశంలోని గొప్ప వ్యక్తులు చూసిన కలలను సాకారం చేసుకోవచ్చు. అదే సంస్కారాలను గురుదేవ్ విశ్వభారతికి కూడా ఇచ్చారు. ఈ సంస్కారాలను మనందరం కలిపి బలోపేతం చేయాలి.
మిత్రులారా,
ఎక్కడికి వెళ్లినా, ఏ రంగానికి వెళ్లినా మీ కష్టార్జితంతో కొత్త భారతదేశాన్ని నిర్మించాల్సి ఉంటుంది. గురుదేవ్ పంక్తులతో నేను ముగిస్తాను, గురుదేవ్ ఇలా అన్నాడు, “ ఓరే గృహో-బషి ఖోల్ ధోర్ ఖోల్, లగ్లో జె దోల్, స్థోలే, జోలే, మోబోతోలే లాగ్ లో జే డోల్, దార్ ఖోల్, దార్ ఖోల్! ” దేశంలో కొత్త అవకాశాల తలుపులు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. మీరంతా విజయం సాధిస్తారు, ముందుకు సాగుతూ, దేశం యొక్క కలలను సాకారం చేయండి.
ఈ శుభాకాంక్షలతో మరలా మీ అందరికీ ధన్యవాదాలు మరియు ఈ శతాబ్ది సంవత్సరాన్ని మీ తదుపరి ప్రయాణానికి బలమైన మైలురాయిగా మార్చండి, మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళి, విశ్వభారతికి జన్మనిచ్చిన కలలను సాకారం చేసుకుంటూ ప్రపంచ సంక్షేమానికి మార్గం సుగమం చేయడానికి భారత సంక్షేమ మార్గాన్ని బలోపేతం చేస్తూ ముందుకు సాగండి. మీ అందరికీ శుభం కలుగుతుంది మీకు చాలా కృతజ్ఞతలు.
ధన్యవాదాలు..
विश्वभारती की सौ वर्ष यात्रा बहुत विशेष है।
— PMO India (@PMOIndia) December 24, 2020
विश्वभारती, माँ भारती के लिए गुरुदेव के चिंतन, दर्शन और परिश्रम का एक साकार अवतार है।
भारत के लिए गुरुदेव ने जो स्वप्न देखा था, उस स्वप्न को मूर्त रूप देने के लिए देश को निरंतर ऊर्जा देने वाला ये एक तरह से आराध्य स्थल है: PM
हमारा देश, विश्व भारती से निकले संदेश को पूरे विश्व तक पहुंचा रहा है।
— PMO India (@PMOIndia) December 24, 2020
भारत आज international solar alliance के माध्यम से पर्यावरण संरक्षण में विश्व का नेतृत्व कर रहा है।
भारत आज इकलौता बड़ा देश है जो Paris Accord के पर्यावरण के लक्ष्यों को प्राप्त करने के सही मार्ग पर है: PM
जब हम स्वतंत्रता संग्राम की बात करते हैं तो हमारे मन में सीधे 19-20वीं सदी का विचार आता है।
— PMO India (@PMOIndia) December 24, 2020
लेकिन ये भी एक तथ्य है कि इन आंदोलनों की नींव बहुत पहले रखी गई थी।
भारत की आजादी के आंदोलन को सदियों पहले से चले आ रहे अनेक आंदोलनों से ऊर्जा मिली थी: PM
भारत की आध्यात्मिक और सांस्कृतिक एकता को भक्ति आंदोलन ने मजबूत करने का काम किया था।
— PMO India (@PMOIndia) December 24, 2020
भक्ति युग में,
हिंदुस्तान के हर क्षेत्र,
हर इलाके, पूर्व-पश्चिम-उत्तर-दक्षिण,
हर दिशा में हमारे संतों ने,
महंतों ने,
आचार्यों ने देश की चेतना को जागृत रखने का प्रयास किया: PM
भक्ति आंदोलन वो डोर थी जिसने सदियों से संघर्षरत भारत को सामूहिक चेतना और आत्मविश्वास से भर दिया: PM
— PMO India (@PMOIndia) December 24, 2020
भक्ति का ये विषय तब तक आगे नहीं बढ़ सकता जब तक महान काली भक्त श्रीरामकृष्ण परमहंस की चर्चा ना हो।
— PMO India (@PMOIndia) December 24, 2020
वो महान संत, जिनके कारण भारत को स्वामी विवेकानंद मिले।
स्वामी विवेकानंद भक्ति, ज्ञान और कर्म, तीनों को अपने में समाए हुए थे: PM
उन्होंने भक्ति का दायरा बढ़ाते हुए हर व्यक्ति में दिव्यता को देखना शुरु किया।
— PMO India (@PMOIndia) December 24, 2020
उन्होंने व्यक्ति और संस्थान के निर्माण पर बल देते हुए कर्म को भी अभिव्यक्ति दी, प्रेरणा दी: PM
भक्ति आंदोलन के सैकड़ों वर्षों के कालखंड के साथ-साथ देश में कर्म आंदोलन भी चला।
— PMO India (@PMOIndia) December 24, 2020
भारत के लोग गुलामी और साम्राज्यवाद से लड़ रहे थे।
चाहे वो छत्रपति शिवाजी हों, महाराणा प्रताप हों, रानी लक्ष्मीबाई हों, कित्तूर की रानी चेनम्मा हों, भगवान बिरसा मुंडा का सशस्त्र संग्राम हो: PM
अन्याय और शोषण के विरुद्ध सामान्य नागरिकों के तप-त्याग और तर्पण की कर्म-कठोर साधना अपने चरम पर थी।
— PMO India (@PMOIndia) December 24, 2020
ये भविष्य में हमारे स्वतंत्रता संग्राम की बहुत बड़ी प्रेरणा बनी: PM
जब भक्ति और कर्म की धाराएं पुरबहार थी तो उसके साथ-साथ ज्ञान की सरिता का ये नूतन त्रिवेणी संगम, आजादी के आंदोलन की चेतना बन गया था।
— PMO India (@PMOIndia) December 24, 2020
आजादी की ललक में भाव भक्ति की प्रेरणा भरपूर थी: PM
समय की मांग थी कि ज्ञान के अधिष्ठान पर आजादी की जंग जीतने के लिए वैचारिक आंदोलन भी खड़ा किया जाए और साथ ही उज्ज्वल भावी भारत के निर्माण के लिए नई पीढ़ी को तैयार भी किया जाए।
— PMO India (@PMOIndia) December 24, 2020
और इसमें बहुत बड़ी भूमिका निभाई, कई प्रतिष्ठित शिक्षण संस्थानों ने, विश्वविद्यालयों ने: PM
इन शिक्षण संस्थाओं ने भारत की आज़ादी के लिए चल रहे वैचारिक आंदोलन को नई ऊर्जा दी, नई दिशा दी, नई ऊंचाई दी।
— PMO India (@PMOIndia) December 24, 2020
भक्ति आंदोलन से हम एकजुट हुए,
ज्ञान आंदोलन ने बौद्धिक मज़बूती दी और
कर्म आंदोलन ने हमें अपने हक के लिए लड़ाई का हौसला और साहस दिया: PM
सैकड़ों वर्षों के कालखंड में चले ये आंदोलन त्याग, तपस्या और तर्पण की अनूठी मिसाल बन गए थे।
— PMO India (@PMOIndia) December 24, 2020
इन आंदोलनों से प्रभावित होकर हज़ारों लोग आजादी की लड़ाई में बलिदान देने के लिए आगे आए: PM
वेद से विवेकानंद तक भारत के चिंतन की धारा गुरुदेव के राष्ट्रवाद के चिंतन में भी मुखर थी।
— PMO India (@PMOIndia) December 24, 2020
और ये धारा अंतर्मुखी नहीं थी।
वो भारत को विश्व के अन्य देशों से अलग रखने वाली नहीं थी: PM
उनका विजन था कि जो भारत में सर्वश्रेष्ठ है, उससे विश्व को लाभ हो और जो दुनिया में अच्छा है, भारत उससे भी सीखे।
— PMO India (@PMOIndia) December 24, 2020
आपके विश्वविद्यालय का नाम ही देखिए: विश्व-भारती।
मां भारती और विश्व के साथ समन्वय: PM
विश्व भारती के लिए गुरुदेव का विजन आत्मनिर्भर भारत का भी सार है।
— PMO India (@PMOIndia) December 24, 2020
आत्मनिर्भर भारत अभियान भी विश्व कल्याण के लिए भारत के कल्याण का मार्ग है।
ये अभियान, भारत को सशक्त करने का अभियान है, भारत की समृद्धि से विश्व में समृद्धि लाने का अभियान है: PM
Speaking at #VisvaBharati University. Here is my speech. https://t.co/YH17s5BAll
— Narendra Modi (@narendramodi) December 24, 2020
विश्व भारती की सौ वर्ष की यात्रा बहुत विशेष है।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
मुझे खुशी है कि विश्व भारती, श्रीनिकेतन और शांतिनिकेतन निरंतर उन लक्ष्यों की प्राप्ति का प्रयास कर रहे हैं, जो गुरुदेव ने तय किए थे।
हमारा देश विश्व भारती से निकले संदेश को पूरे विश्व तक पहुंचा रहा है। pic.twitter.com/j9nhrzv0WL
जब हम स्वतंत्रता संग्राम की बात करते हैं तो हमारे मन में सीधे 19वीं और 20वीं सदी का विचार आता है।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
लेकिन इन आंदोलनों की नींव बहुत पहले रखी गई थी। भक्ति आंदोलन से हम एकजुट हुए, ज्ञान आंदोलन ने बौद्धिक मजबूती दी और कर्म आंदोलन ने लड़ने का हौसला दिया। pic.twitter.com/tjKTpaFKKF
गुरुदेव सर्वसमावेशी, सर्वस्पर्शी, सह-अस्तित्व और सहयोग के माध्यम से मानव कल्याण के बृहद लक्ष्य को लेकर चल रहे थे।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
विश्व भारती के लिए गुरुदेव का यही विजन आत्मनिर्भर भारत का भी सार है। pic.twitter.com/zel7VOHWoC
विश्व भारती की स्थापना के 27 वर्ष बाद भारत आजाद हो गया था।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
अब से 27 वर्ष बाद भारत अपनी आजादी के 100 वर्ष का पर्व मनाएगा।
हमें नए लक्ष्य गढ़ने होंगे, नई ऊर्जा जुटानी होगी, नए तरीके से अपनी यात्रा शुरू करनी होगी। इसमें हमारा मार्गदर्शन गुरुदेव के ही विचार करेंगे। pic.twitter.com/nTha5OJlwx
गुरुदेव ने विश्व भारती की स्थापना सिर्फ पढ़ाई के एक केंद्र के रूप में नहीं की थी। वे इसे ‘Seat of Learning’, सीखने के एक पवित्र स्थान के तौर पर देखते थे।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
ऐसे में, नई राष्ट्रीय शिक्षा नीति को लागू करने में विश्व भारती की बड़ी भूमिका है। pic.twitter.com/dwMGTZfKxQ
गुरुदेव का जीवन हमें एक भारत-श्रेष्ठ भारत की भावना से भरता है।
— Narendra Modi (@narendramodi) December 24, 2020
यह दिखाता है कि कैसे विभिन्नताओं से भरा हमारा देश एक है, एक-दूसरे से कितना सीखता रहा है।
यही संस्कार गुरुदेव ने भी विश्वभारती को दिए हैं। इन्हीं संस्कारों को हमें मिलकर निरंतर मजबूत करना है। pic.twitter.com/MGZ8OLI56A