Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశిష్ట‌ పార్ల‌మెంటేరియ‌న్ పురస్కారాల వేడుక‌ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

విశిష్ట‌ పార్ల‌మెంటేరియ‌న్ పురస్కారాల వేడుక‌ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

విశిష్ట‌ పార్ల‌మెంటేరియ‌న్ పురస్కారాల వేడుక‌ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో ఇండియ‌న్ పార్ల‌మెంట‌రీ గ్రూపు ఈ రోజు నిర్వ‌హించిన విశిష్ట పార్ల‌మెంటేరియ‌న్ పుర‌స్కారాల వేడుక‌ కు హాజ‌ర‌య్యారు. గౌర‌వ‌నీయులైన భార‌త‌ రాష్ట్రప‌తి శ్రీ రామ్‌ నాథ్ కోవింద్‌ విశిష్ట పార్ల‌మెంటేరియ‌న్ పుర‌స్కారాల‌ను పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాలు లో ప్ర‌దానం చేశారు. ఉప రాష్ట్రప‌తి శ్రీ ఎం. వెంక‌య్య నాయుడు, లోక్ స‌భ స్పీక‌ర్ శ్రీ‌మ‌తి సుమిత్ర మ‌హాజ‌న్ లు కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

పుర‌స్కార విజేత‌ల‌కు ప్ర‌దాన మంత్రి అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ, దేశానికి మ‌రియు పార్ల‌మెంటు కు వారు అందించిన తోడ్పాటు సదా స్మర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. ఈ విశిష్ట పార్ల‌మెంటేరియ‌న్ ల‌తో క‌ల‌సి ప‌ని చేయడం, వారి వ‌ద్ద నుంచి నేర్చుకోవడం ఒక గౌర‌వం అని ఆయ‌న అన్నారు.

125 కోట్ల మంది భార‌తీయుల స్వ‌ప్నాల‌కు పార్ల‌మెంటు ప్రాతినిధ్యం వ‌హిస్తోంద‌ని, అది వారి యొక్క వాణి అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. పార్ల‌మెంటు లో ఆడిన ప్రతి మాట‌కు కూడా ఎంతో విలువ ఉంటుంద‌ని, అంతేకాకుండా ముఖ్య‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు విధాన రూప‌క‌ర్త‌ల‌కు, ప్ర‌భుత్వానికి పార్ల‌మెంటు ఒక అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

పార్ల‌మెంటు లో అంత‌రాయం ఏర్ప‌డితే దాని ప్ర‌భావం సామాన్య మాన‌వుడి పైన, వారికి ప్రాతినిధ్యం వ‌హించే పార్ల‌మెంటేరియ‌న్ ల పైన ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ విధ‌మైన అంత‌రాయాలు ప్ర‌భుత్వాని క‌న్నా దేశ ప్ర‌జ‌ల‌కే న‌ష్టదాయకమని ఆయ‌న అన్నారు.

పార్ల‌మెంటు సాఫీగా సాగేటట్టు చూడ‌డం పార్ల‌మెంటు స‌భ్యుల బాధ్యత అని, పార్ల‌మెంటు సాఫీగా సాగితే పార్ల‌మెంట్ లో స‌భ్యులు అందరికీ మాట్లాడే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని, త‌ద్వారా చ‌రిత్ర లో ఒక భాగం కావ‌చ్చని ప్ర‌ధాన మంత్రి వివరించారు.