నాయకులు తమ స్పందన తెలిపారు, విధానపరంగా తీసుకోవలసిన సూచనలు చేశారు.లాక్ డౌన్ గురించి , ఈ విషయంలో ముందుకు పోయే మార్గం గురించి చర్చిందారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్లమెంటులోని వివిధ రాజకీయపార్టీల ఫ్లోర్ లీడర్ల తో సమావేశమయ్యారు.
ప్రస్తుతం ప్రపంచం కోవిడ్ -19 కు సంబంధించి పెను సవాలును ఎదుర్కొంటున్నదని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుత పరిస్థితి మానవ జాతి చరిత్ర గతిని మార్చేదిగా ఉందని, మనం దీని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మనం సిద్దం కావాలని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొవడంలో రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలసి సమష్టిగా సాగిస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సంఘటితంగా ముందుకు రావడం ద్వారా దేశం నిర్మాణాత్మక, సానుకూల రాజకీయాలను చూసిందని ఆయన అన్నారు.
ఈ ప్రయత్నంలో ప్రతి పౌరుడు , అది సామాజిక దూరం కానివ్వండి లేదా జనతా కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ ఇలా ఏదైనా సరే సహకరిస్తున్న తీరు, చూపుతున్న క్రమశిక్షణ, ప్రదర్శిస్తున్న అంకితభావం , నిబద్ధత లను ప్రధానమంత్రి ప్రశంసించారు,
వనరుల పరిమితుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల ప్రభావాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. అయినప్పటికీ, వైరస్ వ్యాప్తి తీవ్రతను నియంత్రించగల అతికొద్ది దేశాలలో భారతదేశం ఇప్పటివరకూ ఉందన్నారు. అయతే పరిస్థితి నిరంతరం మారుతూ ఉంటుందని, అన్ని సమయాల్లో అప్రమత్తతతో ఉండాలని ఆయన హెచ్చరించారు.
దేశంలోని పరిస్థితి సామాజిక ఎమర్జెన్సీలా ఉందని అన్నారు. దేశం కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని , ఇక ముందుకూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పలు రాష్ట్రప్రభుత్వాలు, జిల్లా పాలనా యంత్రాంగాలు, నిపుణులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారని ఆయన చెప్పారు. ప్రస్తుత మారుతున్న పరిస్థితులలో దేశం తన పని సంస్కృతి, పని విధానాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించవలసి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రతి ఒక్రరి ప్రాణాలు కాపాడడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధానమంత్రి అన్నారు. కోవిడ్ -19 ఫలితంగా దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి చెప్పారు.
పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రయోజనాల పంపిణీ స్థితిగతులతో సహా, ప్రభుత్వం ముందున్న సవాళ్లను ఎదుర్కోవటానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో వివరణాత్మక ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు రాజకీయ పార్టీల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.. సరైన సమయంలో ప్రధానమంత్రి తీసుకున్న చర్యలనను వారు అభినందించారు. ఈ సంక్షోభ సమయంలో దేశం యావత్తూ తన వెనుక నిలబడి ఉన్నట్టు వీరు తెలిపారు.
ఆరోగ్య సేవల పెంపు, ఆరోగ్య కార్యకర్తల మనోదైర్యాన్ని పెంపొందించడం, వైరస్ పరీక్షా కేంద్రాల పెంపు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాయం అందించాల్సిన అవసరం, పౌష్టికాహార లోపం, ఆకలి వంటి సవాళ్లపై వారు చర్చించారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో దేశ సామర్ద్యాన్ని పెంచేందుకు తీసుకోవలసిన ఆర్థిక, విధానపరమైన చర్యలుపై వారు మాట్లాడారు.
లాక్ డౌన్ కొనసాగింపుపైన, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత దశలవారీ ఎగ్జిట్ గురించి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు సూచనలు చేశారు.
నిర్మాణాత్మక సూచనలు , తమ స్పందన తెలిపినందుకు ప్రధానమంత్రి ఈ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రభుత్వానికి సహాయపడాలన్న వారి నిబద్ధత, దేశ ప్రజాస్వామ్య పునాదులను , సహకార స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తోందని ప్రధానమంత్రి అన్నారు .
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు,దేశవ్యాప్తంగా గల పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
****
Had an in-depth interaction with leaders of various political parties earlier today. Leaders shared their views on tackling COVID-19 and the way ahead. https://t.co/XoDKj52MoW
— Narendra Modi (@narendramodi) April 8, 2020