వివిధ జాతీయ రహదారులు మరియు రహదారి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటు ఇంకా కొన్ని పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి తో పాటు మహారాష్ట్ర గవర్నరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రోజు న ఇక్కడ ‘‘ శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ కు, శ్రీ సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ కు శంకుస్థాపన చేయడమైందన్నారు. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ నిర్మాణాన్ని అయిదు దశల లో, సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీమార్గ్ నిర్మాణాన్ని మూడు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. పథకాలు ఆయా ప్రాంతాల లో మెరుగైన రాకపోకల కు తోడ్పడుతాయని ఆయన చెప్తూ, పథకాల కై భగవాన్ విఠల్ తో పాటు సాధువుల, భక్తుల ఆశీర్వాదాలు కావాలి అని కోరుకొంటూ వారికి నమస్కరించారు. చరిత్ర ఒడుదొడుకుల కు లోనైనప్పటికీ కూడాను భగవాన్ విఠలుని పట్ల విశ్వాసం అచంచలం గా ఉంటూ వచ్చింది, మరి ‘‘ రోజు కు కూడాను ఈ యాత్ర ప్రపంచం లో అతి ప్రాచీనమైనటువంటి ప్రజా యాత్రల లో ఒకటి గా ఉంది, అంతేకాక దీని ని పెద్ద సంఖ్య లో ప్రజలంతా కలిసికట్టు గా తరలివెళ్లేటటువంటి ఒక ప్రజా ఉద్యమం గా పరిగణిస్తున్నారు. దారులు వేరు వేరు కావచ్చు, పద్ధతులు, అభిప్రాయాలు విభిన్నం గా ఉంటే ఉండవచ్చు కానీ మనం లక్ష్యం ఒకటే అని యాత్ర మనకు బోధిస్తోంది. ఆఖరు కు అన్ని పంథ్ లు ‘భాగవత్ పంథ్’ లే అవుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు, ఇది భారతదేశం యొక్క శాశ్వత జ్ఞానాని కి ప్రతీకగా ఉంది, శాశ్వత జ్ఞానం మన ధర్మాన్ని బంధించదు, అది విముక్తం చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భగవాన్ విఠలుని దర్బారు ప్రతి ఒక్కరి కోసం సమానమైన విధం గా తెరచి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మరి నేను ఎప్పుడైతే సబ్ కా సాథ్- సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ అని అంటానో, అలా అన్నప్పుడు దాని వెనుక ఉండే భావన కూడా ఇదే అని ఆయన చెప్పారు. ఇదే భావన దేశాన్ని అభివృద్ధి పరచడానికి మనల ను ప్రేరితుల ను చేస్తుంది, అందరి ని కలుపుకొని పోతూ అందరి అభివృద్ధి లక్ష్య సాధన కై స్ఫూర్తి ని అందిస్తుంది అని ఆయన అన్నారు.
భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సమృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పంఢర్ పుర్ కు సేవ చేయడం అంటే అది ఆ శ్రీ నారాయణ హరి కి చేసే సేవే అవుతుందన్నారు. ఈ నేల భగవానుడు భక్తజనం కోసం ఈ నాటికి కూడాను ప్రత్యక్షం గా కొలువుదీరి ఉన్నటువంటి నేల అని ఆయన అన్నారు. ఈ జగత్తు ఆవిర్భవించక ముందు నుంచి పంఢర్ పుర్ ఉనికి లో ఉంది అని సంత్ నామ్ దేవ్ జీ మహారాజ్ పేర్కొన్న ప్రదేశం ఇది అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం యొక్క విశిష్టత ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, దేశాని కి దిశ ను చూపడం కోసం ఎప్పటికప్పుడు వేరు వేరు ప్రాంతాల లో మహనీయులు ఆవిర్భవిస్తూ వచ్చారన్నారు. దక్షిణ దేశం లో శ్రీయుతులు మధ్వాచార్య, నిమ్బార్కాచార్య, వల్లభాచార్య, రామానుజాచార్య ల వంటి వారు, పశ్చిమాన శ్రీయుతులు నర్ సీ మెహతా, ధీరో భగత్, భోజా భగత్, ప్రీతమ్ లు, ఇంకా మీరా బాయి ల వంటి వారు జన్మించారు అని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశం లో శ్రీయుతులు రామానంద, కబీర్ దాస్, గోస్వామి తులసీదాస్, సూర్ దాస్, గురు నానక్ దేవ్, సంత్ రై దాస్ లు వచ్చారన్నారు. దేశ తూర్పు ప్రాంతం లో చైతన్య మహాప్రభు, ఇంకా శంకర్ దేవ్ ల వంటి సాధువుల దార్శనికత దేశాన్ని సంపన్నం చేసిందన్నారు.
వార్ కరీ ఉద్యమాని కి ఉన్న సామాజిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, పురుషుల తో పాటు మహిళ లు అడుగులో అడుగు వేస్తూ సమధికోత్సాహం తో పాలుపంచుకోవడం అనేది వార్ కరీ ఉద్యమం తాలూకు మరొక ప్రత్యేకత అన్నారు. ఇది దేశం లో స్త్రీశక్తి కి అద్దం పడుతోందన్నారు. ‘పంఢరీ కీ వారీ’ అనేది సమాన అవకాశాల కు ఒక చిహ్నం గా ఉంది అని ఆయన అన్నారు. వార్ కరీ ఉద్యమం భేద భావన ను అమంగళకరమైందిగా చూస్తుంది, మరి ఇదే ఈ ఉద్యమం తాలూకు విశిష్ట ధర్మ సూత్రం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
వార్ కరీ లో పాలుపంచుకొనే సోదరీమణులు మరియు సోదరుల విషయం లో ప్రధాన మంత్రి వారి ఆశీర్వాదాల రూపం లో మూడు విషయాల ను గురించి అపేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కి తన పట్ల ఉన్న అపార స్నేహం ఉండింది అని ఆయన అన్నారు. పాల్ ఖీ మార్గ్ లో మొక్కల ను నాటవలసింది గా భక్తుల ను ఆయన కోరారు. ఈ నడక దారి పొడవు ని తాగునీటి కి తగిన ఏర్పాటుల ను చేయాలని, ఈ మార్గాల లో చాలా చోట్ల తాగునీటి కడవల ను అందుబాటు లో ఉంచాలని ఆయన అభ్యర్థించారు. రాబోయే కాలం లో భారతదేశం లో అత్యంత స్వచ్ఛమైనటువంటి తీర్థయాత్ర స్థలాల లో ఒక తీర్థయాత్రస్థలం గా పంఢర్ పుర్ ను చూడాలని ఉందని ఆయన అభిలషించారు. ప్రజల భాగస్వామ్యం తో ఈ కార్యాన్ని సాధించవచ్చు, ఎప్పుడైతే స్థానికులు స్వచ్ఛత ఉద్యమం తాలూకు పగ్గాల ను వారి చేతుల లోకి తీసుకొంటారో అప్పుడు మనం ఈ కల ను పండించుకోగలుగుతాం అని ఆయన అన్నారు.
వార్ కరీల లో చాలా మంది రైతు సముదాయాని కి చెందిన వారే అయి ఉంటారు. ఈ ‘భూమి పుత్రులు’ భారతదేశం సాంప్రదాయాన్ని, సంస్కృతి ని చైతన్యవంతం గా ఉంచారని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక నిజమైన ‘అన్నదాత’ సంఘాన్ని జోడిస్తాడు. మరి అతడు సమాజాని కి ప్రాణం పోస్తాడు.. సమాజం కోసం జీవిస్తాడు. మీతోనే సమాజం ప్రగతి చెందుతుంది, మరి మీరే సమాజం ప్రగతి కి ప్రతిబింబం కూడా’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ లోని దివే ఘాట్ మొదలుకొని మొహోల్ వరకు ఉన్నటువంటి సుమారు 221 కిలో మీటర్ల భాగాన్ని, సంత్ తుకారాం మహారాజ్ పాల్ ఖీ మార్గ్ లోని ఫతస్ మొదలుకొని టోందలే-బోందలే వరకు ఉన్నటువంటి దాదాపు 130 కిలో మీటర్ల పొడవైన భాగాన్ని నాలుగు దోవ లు కలిగి ఉండే విధం గా నిర్మించడం జరుగుతుంది. ఈ రెండు మార్గాల కు ఇరు పక్కల ‘పాల్ ఖీ’ కోసమే ప్రత్యేకించినటువంటి నడక దారులు ఉంటాయి. వాటి అంచనా వ్యయం వరస గా 6,690 కోట్ల రూపాయలకు పైచిలుకు గాను మరియు దాదాపు గా 4,400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
పంఢర్ పుర్ నుంచి రాక పోకల ను పెంచడం కోసం వివిధ జాతీయ రహదారుల లో 223 కి.మీ. కి పైగా నిర్మాణం పూర్తి అయినటువంటి మరియు ఉన్నతీకరించినటువంటి గల రహదారి పథకాల ను ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ పథకాల అంచనా వ్యయం 1,180 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ప్రాజెక్టుల లో మ్హస్వాద్-పీలివ్-పంఢర్ పుర్ (ఎన్ హెచ్-548ఇ), కుర్దువాడీ-పంఢర్ పుర్ (ఎన్ హెచ్-965సి); పంఢర్ పుర్- సంగోలా (ఎన్ హెచ్-965సి); ఎన్ హెచ్ 561 ఎ లోని తెమ్భుర్ నీ-పంఢర్ పుర్ సెక్శన్ తో పాటు ఎన్ హెచ్-561ఎ లోని పంఢర్ పుర్- మంగళ్ వేధా-ఉమాదీ సెక్శన్ లు కూడా ఉన్నాయి.
Watch LIVE https://t.co/xc5PeunXEc
— PMO India (@PMOIndia) November 8, 2021
आज यहां श्रीसंत ज्ञानेश्वर महाराज पालखी मार्ग और संत तुकाराम महाराज पालखी मार्ग का शिलान्यास हुआ है।
— PMO India (@PMOIndia) November 8, 2021
श्रीसंत ज्ञानेश्वर महाराज पालखी मार्ग का निर्माण पांच चरणों में होगा और संत तुकाराम महाराज पालखी मार्ग का निर्माण तीन चरणों में पूरा किया जाएगा: PM @narendramodi
अतीत में हमारे भारत पर कितने ही हमले हुये! सैकड़ों साल की गुलामी में ये देश जकड़ा गया।
— PMO India (@PMOIndia) November 8, 2021
प्राकृतिक आपदाएँ आईं, चुनौतियाँ आईं, कठिनाइयाँ आईं, लेकिन भगवान विट्ठल देव में हमारी आस्था, हमारी दिंडी वैसे ही अनवरत चलती रही: PM @narendramodi
आज भी ये यात्रा दुनिया की सबसे प्राचीन और सबसे बड़ी जन-यात्राओं के रूप में, people मूवमेंट के रूप में देखी जाती है।
— PMO India (@PMOIndia) November 8, 2021
‘आषाढ एकादशी’ पर पंढरपुर यात्रा का विहंगम दृश्य कौन भूल सकता है।
हजारों-लाखों श्रद्धालु, बस खिंचे चले आते हैं: PM @narendramodi
ये यात्राएं अलग अलग पालखी मार्गों से चलती हैं, लेकिन सबका गंतव्य एक ही होता है।
— PMO India (@PMOIndia) November 8, 2021
ये भारत की उस शाश्वत शिक्षा का प्रतीक है जो हमारी आस्था को बांधती नहीं, बल्कि मुक्त करती है: PM @narendramodi
जो हमें सिखाती है कि मार्ग अलग अलग हो सकते हैं, पद्धतियाँ और विचार अलग अलग हो सकते हैं, लेकिन हमारा लक्ष्य एक होता है।
— PMO India (@PMOIndia) November 8, 2021
अंत में सभी पंथ ‘भागवत पंथ’ ही हैं: PM @narendramodi
भगवान विट्ठल का दरबार हर किसी के लिए समान रूप से खुला है।
— PMO India (@PMOIndia) November 8, 2021
और जब मैं सबका साथ-सबका विकास-सबका विश्वास कहता हूं, तो उसके पीछे भी तो यही भावना है।
यही भावना हमें देश के विकास के लिए प्रेरित करती है, सबको साथ लेकर, सबके विकास के लिए प्रेरित करती है: PM @narendramodi
पंढरपुर की सेवा मेरे लिए साक्षात् श्री नारायण हरि की सेवा है।
— PMO India (@PMOIndia) November 8, 2021
ये वो भूमि है, जहां भक्तों के लिए भगवान आज भी प्रत्यक्ष विराजते हैं।
ये वो भूमि है, जिसके बारे में संत नामदेव जी महाराज ने कहा है कि पंढरपुर तबसे है जब संसार की भी सृष्टि नहीं हुई थी: PM @narendramodi
भारत भूमि की ये विशेषता है कि समय-समय पर, अलग-अलग क्षेत्रों में, ऐसी महान विभूतियां अवतरित होती रहीं, देश को दिशा दिखाती रहीं।
— PMO India (@PMOIndia) November 8, 2021
दक्षिण में मध्वाचार्य, निम्बार्काचार्य, वल्लभचार्य, रामानुजाचार्य हुए,
पश्चिम में नरसी मेहता, मीराबाई, धीरो भगत, भोजा भगत, प्रीतम हुए: PM @narendramodi
उत्तर में रामानंद, कबीरदास, गोस्वामी तुलसीदास, सूरदास, गुरु नानकदेव, संत रैदास हुए,
— PMO India (@PMOIndia) November 8, 2021
पूर्व में चैतन्य महाप्रभु, और शंकर देव जैसे संतों के विचारों ने देश को समृद्ध किया: PM @narendramodi
वारकरी आंदोलन की और एक विशेषता रही और वह है पुरुषों के कदम से कदम मिलाकर वारी में चलने वाली हमारी बहनें, देश की स्त्री शक्ति!
— PMO India (@PMOIndia) November 8, 2021
पंढरी की वारी, अवसरों की समानता का प्रतीक हैं।
वारकरी आंदोलन का ध्येय वाक्य हैं, ‘भेदाभेद अमंगळ’: PM @narendramodi
आज जब मैं अपने वारकरी भाई-बहनों से बात कर रहा हूं, तो आपसे आशीर्वाद स्वरूप तीन चीजें मांगना चाहता हूं।
— PMO India (@PMOIndia) November 8, 2021
आपका हमेशा मुझ पर इतना स्नेह रहा है, कि मैं खुद को रोक नहीं पा रहा: PM @narendramodi
पहला आशीर्वाद ये कि जो श्रीसंत ज्ञानेश्वर महाराज पालखी मार्ग का निर्माण होगा, जिस संत तुकाराम महाराज पालखी मार्ग का निर्माण होगा, उसके किनारे जो विशेष पैदल मार्ग बन रहा है, उसके दोनों तरफ हर कुछ मीटर पर छायादार वृक्ष जरूर लगाए जाएं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 8, 2021
दूसरा आशीर्वाद मुझे ये चाहिए कि इस पैदल मार्ग पर हर कुछ दूरी पर पीने के पानी की व्यवस्था भी की जाए, इन मार्गों पर अनेकों प्याऊ बनाए जाएं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 8, 2021
तीसरा आशीर्वाद जो मुझे चाहिए, वो पंढरपुर के लिए है।
— PMO India (@PMOIndia) November 8, 2021
मैं भविष्य में पंढरपुर को भारत के सबसे स्वच्छ तीर्थ स्थलों में देखना चाहता हूं।
ये काम भी जनभागीदारी से ही होगा, जब स्थानीय लोग स्वच्छता के आंदोलन का नेतृत्व अपनी कमान में लेंगे, तभी हम इस सपने को साकार कर पाएंगे: PM
भारत की संस्कृति को, भारत के आदर्शों को सदियों से यहाँ का धरती पुत्र ही जीवित बनाए हुये है।
— PMO India (@PMOIndia) November 8, 2021
एक सच्चा अन्नदाता समाज को जोड़ता है, समाज को जीता है, समाज के लिए जीता है।
आपसे ही समाज की प्रगति है, और आपकी ही प्रगति में समाज की प्रगति है: PM @narendramodi
पंढरपुर यात्रा भारत की उस शाश्वत शिक्षा का प्रतीक है, जो हमारी आस्था को बांधती नहीं, बल्कि मुक्त करती है।
— Narendra Modi (@narendramodi) November 8, 2021
यह हमें सिखाती है कि मार्ग अलग-अलग हो सकते हैं, पद्धतियां और विचार अलग-अलग हो सकते हैं, लेकिन हमारा लक्ष्य एक होता है। pic.twitter.com/LPpX8koxs3
पंढरपुर की आभा, अनुभूति और अभिव्यक्ति सब कुछ अलौकिक है। यहां से मेरे दो और भी बहुत खास रिश्ते हैं… pic.twitter.com/bzdVV62P15
— Narendra Modi (@narendramodi) November 8, 2021
मैं अपने वारकरी भाई-बहनों से आशीर्वाद स्वरूप तीन चीजें मांगना चाहता हूं... pic.twitter.com/Bvn0kytV0B
— Narendra Modi (@narendramodi) November 8, 2021
जब पंढरपुर जैसे तीर्थों का विकास होता है, तो सांस्कृतिक प्रगति ही नहीं होती, पूरे क्षेत्र के विकास को बल मिलता है। pic.twitter.com/wXOrOGDcHT
— Narendra Modi (@narendramodi) November 8, 2021