‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనేవి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వ కీలక అంశాలుగా ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకదానిని నెరవేరుస్తూ , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రకేబినెట్ , ముస్లిం మహిళల( వివాహ హక్కుల రక్షణ) రెండవ ఆర్డినెన్స్ 2019 ( ఆర్డినెన్స్ 4 ఆఫ్ 2019) స్థానంలో ముస్లిం మహిళల( వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2019ను ప్రవేశపెట్టేందుకు ఆమోదించింది.
ప్రభావం …
ఈ బిల్లు ముస్లిం మహిళలకు స్త్రీ ,పురష సమానత్వం, స్త్రీ పురుష సమాన న్యాయాన్ని కల్పిస్తుంది. ఈ బిల్లు వివాహితులైన ముస్లిం మహిళల హక్కులను రక్షించేందుకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే తలాక్- ఎ- బిద్దత్ పద్ధతి ప్రకారం భార్యనుంచి, భర్త విడాకులు పొందడాన్నిఇది నిరొధిస్తుంది. ఈ బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టనున్నారు.
ఫలితాలు….
• ఈ బిల్లు ట్రిపుల్ తలాక్ పద్ధతి చెల్లనేరనిదిగా, చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ప్రతిపాదిస్తున్నది
• దీనిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. ఇందుకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
• వివాహిత ముస్లిం మహిళలు, వారిపై ఆధారపడిన పిల్లలకు సబ్సిస్టెన్స్ అలవెన్సునుకూడా బిల్లు ప్రతిపాదిస్తున్నది.
• తన భర్త తన పట్ల తలాక్ చెప్పి నేరానికి పాల్పడిన దానికి సంబంధించిన సమాచారాన్ని వివాహిత మహిళ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అధికారికి అందజేసినా లేక ఆమె రక్తసంబంధీకులు లేదా వివాహ సంబంధంగా బంధువులైన వారు ఎవరైనా సమాచారం అందించినా ఆ నేరాన్ని కాగ్నయిజబుల్ నేరంగా పరిగణిస్తూ బిల్లు ప్రతిపాదిస్తున్నది.
• తలాక్ కు గురైన మహిళ విషయంలో జరిగిన నేరానికి సంబంధించి ,ఈ నేరాన్ని మేజిస్ట్రేట్ అనుమతితో కాంపౌండబుల్ నేరంగా పరిగణిస్తారు.
• నిందితుడిని మేజిస్ట్రేట్ బెయిల్పై విడుదల చేయడానికి ముందు , తలాక్ కు గురైన ముస్లిం వివాహిత మహిళ వాదనను వినేందుకు కూడా బిల్లు వీలు కల్పిస్తున్నది.
ముస్లిం మహిళ( వివాహ హక్కులరక్షణ) బిల్లు 2019, ముస్లిం మహిళ(వివాహ హక్కుల రక్షణ ) రెండో ఆర్డినెన్స్ 2019 కి అనుగుణంగానే ఉంది.