Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వివాటెక్ 5 వ ఎడిషన్‌ లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి

వివాటెక్ 5 వ ఎడిషన్‌ లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వివాటెక్ 5వ ఎడిషన్‌లో, దృశ్య మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు.   ఐరోపాలో అతిపెద్ద డిజిటల్ మరియు అంకురసంస్థల కార్యక్రమాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న, వివాటెక్-2021 లో కీలకోపన్యాసం చేయడానికి ప్రధానమంత్రి ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. 2016 నుండి ప్రతి సంవత్సరం పారిస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలు విస్తృత విషయాలపై నిశితంగా పనిచేస్తున్నాయని చెప్పారు.  వీటిలో, సాంకేతికత మరియు డిజిటల్ అంశాలు ఈ సహకారం లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా ఉన్నాయి.  ఇలాంటి సహకారం మరింత పెరగాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది.  ఇది మన దేశాలకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ దేశాలకు కూడా పెద్దగా సహాయపడుతుందని, ఆయన పేర్కొన్నారు.  అటోస్, క్యాప్ జెమినీ వంటి ఫ్రెంచ్ కంపెనీ ల సహకారం తో ఇన్ఫోసిస్ సంస్థ, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీల కు సాంకేతిక సహాయం అందించిందనీ, అదేవిధంగా,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు మరియు పౌరులకు సేవలందిస్తున్న రెండు దేశాల ఐ.టి. ప్రతిభకు భారతదేశ టి.సి.ఎస్. మరియు విప్రో సంస్థలు కూడా ఉదాహరణలుగా నిలిచాయని, శ్రీ మోదీ, వివరించారు. 

సంప్రదాయం విఫలమైన చోట, ఆవిష్కరణ సహాయపడుతుందని ప్రధానమంత్రి, అభిప్రాయపడ్డారు.  మహమ్మారి సమయంలో, డిజిటల్ టెక్నాలజీ మాకు ఎదుర్కోవటానికి, కనెక్ట్ చేయడానికి, సౌకర్యం మరియు కన్సోల్ చేయడానికి సహాయపడింది.  మహమ్మారి సమయంలో మనం భరించటానికి, అనుసంధానం కావడానికి, సౌకర్యలు పొందడానికి, ఓదార్పు పొందడానికి, డిజిటల్ సాంకేతికత సహాయపడిందని, ప్రధానమంత్రి చెప్పారు.  భారతదేశ సార్వత్రిక, ప్రత్యేకమైన బయో మెట్రిక్ డిజిటల్ గుర్తింపు వ్యవస్థ – ఆధార్ – పేదలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడానికి సహాయపడిందని, ఆయన తెలియజేశారు.  “మేము 800 మిలియన్ల ప్రజలకు ఉచిత ఆహారాన్ని సరఫరా చేయగలిగాము. అదేవిధంగా అనేక కుటుంబాలకు వంట-గ్యాస్ రాయితీలను అందించగలిగాము.  భారతదేశంలో మేము విద్యార్థులకు సహాయపడటానికి – స్వయం మరియు దీక్ష – అనే రెండు ప్రభుత్వ డిజిటల్ విద్యా కార్యక్రమాలను, చాలా తక్కువ సమయంలో అమలు చేయగలిగాము.”, అని ప్రధానమంత్రి చెప్పారు. 

మహమ్మారి సవాలును ఎదుర్కోవడంలో అంకుర సంస్థల రంగం నిర్వహించిన పాత్ర ను ప్రధానమంత్రి ప్రశంసించారు.  పి.పి.ఇ.ఈ. కిట్లు, మాస్కులు, పరీక్షలు చేయడానికి వినియోగించే వస్తు సామగ్రి కొరత ను తీర్చడంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించింది.  కొన్ని కోవిడ్ మరియు కోవిడ్ కాని ఇతర సమస్యలను దృశ్య మాధ్యమం ద్వారా పరిష్కరించడానికి వైద్యులు టెలి-మెడిసిన్‌ విధానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించారు.  భారతదేశంలో రెండు టీకాలు తయారు చేయడం జరిగింది. మరిన్ని టీకాలు, అభివృద్ధి లేదా పరీక్ష దశలో ఉన్నాయి. స్వదేశీ ఐ.టి. యాప్, “ఆరోగ్య-సేతు”  కాంటాక్ట్-ట్రేసింగ్‌ ను సమర్థవంతంగా ప్రారంభించిందని, ప్రధానమంత్రి, తెలియజేశారు.  అదేవిధంగా, “కోవిన్” యాప్ కూడా ఇప్పటికే లక్షలాది మందికి టీకా సమాచారం అందించడంలో, నమోదు చేయడంలో సహాయపడుతోంది. 

 

ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలలో భారతదేశం ఒకటి అని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో అనేక ప్రత్యేకమైన (యునికార్న్) సంస్థలు ప్రారంభమయ్యాయి.  ఆవిష్కర్తలు మరియు పెట్టుబడిదారులకు అవసరమైన వాటిని భారతదేశం అందిస్తోంది.  ప్రతిభ, మార్కెట్, మూలధనం, పర్యావరణ వ్యవస్థ, బహిరంగ సంస్కృతి అనే ఐదు స్తంభాల ఆధారంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని, ఆయన, ఈ సందర్భంగా, ప్రపంచ దేశాలను ఆహ్వానించారు.  భారతీయ ప్రతిభా పాటవాలు, మొబైల్ ఫోన్ల వినియోగం, ఏడు వందల డెబ్బై ఐదు మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు, ప్రపంచంలో అత్యధిక మరియు చౌకైన డేటా వినియోగంతో పాటు, సామాజిక మాధ్యమాన్ని అత్యధికంగా ఉపయోగించడం వంటి అంశాలు, పెట్టుబడిదారులను భారతదేశానికి ఆహ్వానించడానికి  దోహదపడతాయని కూడా, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

ప్రజలకు అందుబాటులో అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఐదు వందల ఇరవై మూడు వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్, లక్షా యాభై ఆరు వేల గ్రామ స్థాయి మండళ్ళు, దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో వై-ఫై నెట్‌వర్క్‌ వంటి అనేక కార్యక్రమాల గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు.  ఆవిష్కరణల సంస్కృతి ని పెంపొందించే ప్రయత్నాలను కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు.  అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం కింద ఏడు వేల ఐదు వందల పాఠశాలల్లో అత్యాధునిక ఇన్నోవేషన్ ప్రయోగశాల లు ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.

గత ఏడాది, వివిధ రంగాలలో జరిగిన అంతరాయం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, అంతరాయం అంటే నిరాశ అని అర్థం చేసుకోకూడదని, అందుకు బదులుగా, మరమ్మత్తు మరియు సన్నద్ధత అనే జంట పునాదులపై మనం దృష్టి పెట్టాలని, వివరించారు.  “గత ఏడాది, ఈ సమయానికి, ప్రపంచం ఇంకా టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితిలో ఉంది. ఈ రోజు, మనకు చాలా టీకాలు అందుబాటులోకి వచ్చాయి.  అదేవిధంగా, ఆరోగ్య మౌలిక సదుపాయాల తో పాటు మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం కొనసాగించాలి.  గనుల తవ్వకం, అంతరిక్షం, బ్యాంకింగ్ వ్యవహారాలూ, అణుశక్తి వంటి ఎన్నో రంగాలలో మేము భారతదేశంలో భారీ సంస్కరణలు అమలు చేసాం.  మహమ్మారి సమయంలో కూడా, భారతదేశం ఒక దేశంగా, అనువర్తన యోగ్యమైనది మరియు చురుకైనదిగా నిలవడానికి ఇది సహకరించింది.” అని శ్రీ మోదీ వివరించారు. 

తదుపరి దశ మహమ్మారికి వ్యతిరేకంగా మన భూగోళాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పర్యావరణ క్షీణతను నిలువరించే, స్థిరమైన జీవన శైలి పై మేము దృష్టి సారించాము. ఆవిష్కరణలతో పాటు పరిశోధనల్లో కూడా సహకారాన్ని బలోపేతం చేస్తున్నాము.  ఈ సవాళ్ళను సమిష్టి స్ఫూర్తి తో మరియు మానవ కేంద్రీకృత విధానంతో అధిగమించడానికి, అంకురసంస్థల సమాజం నాయకత్వం వహించి పనిచేయాలని, ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.  “అంకుర సంస్థల వ్యవస్థ యువత ఆధిపత్యంలో ఉంది. వీరు గత భారం నుండి విముక్తి పొందిన వ్యక్తులు. ప్రపంచ పరివర్తనకు అవసరమైన శక్తిని పెంపొందించడానికి వీరు చేసే కృషి చాలా ఉత్తమమైనది.  ఆరోగ్య సంరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, వ్యవసాయం, నేర్చుకునే కొత్త యుగ సాధనాలు సహా పర్యావరణ అనుకూల సాంకేతికత, వంటి వాటిని, మన అంకుర సంస్థలు తప్పనిసరిగా అన్వేషించాలి”, అని ప్రధానమంత్రి సూచించారు. 

భారతదేశ ముఖ్య భాగస్వాములలో ఫ్రాన్స్ మరియు యూరప్ ఉన్నాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  మే నెలలో పోర్టో లో జరిగిన ఈ.యు. నాయకులతో జరిగిన శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు మాక్రాన్‌ తో తాను జరిపిన సంభాషణలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ,  అంకుర సంస్థల నుండి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు డిజిటల్ భాగస్వామ్యం, ఒక ముఖ్య ప్రాధాన్యతగా ఉద్భవించిందని, పేర్కొన్నారు.   “కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో నాయకత్వం ఆర్థిక బలం, ఉద్యోగాలు, శ్రేయస్సును నడిపిస్తున్న విషయాన్ని చరిత్ర రుజువు చేసింది.   అయితే, మన భాగస్వామ్యం కూడా, మానవత్వ సేవలో ఒక పెద్ద ప్రయోజనానికి ఉపయోగపడాలి.  ఈ మహమ్మారి మన స్థితిస్థాపకత కు మాత్రమే కాదు, మన ఊహ కి కూడా ఒక పరీక్ష.  అందరికీ మరింత సమగ్రమైన, శ్రద్ధతో కూడిన స్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోడానికి ఇది ఒక అవకాశం”, అని పేర్కొంటూ, ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.

*****