Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వియత్నామ్ ప్ర‌ధాని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


  1. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వియ‌త్నామ్ సామ్య‌వాద గ‌ణ‌తంత్రం ప్ర‌ధాని, శ్రేష్ఠుడు శ్రీ ఎన్గుయెన్ శువాన్ ఫుక్ తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 4వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఇండియా-ఆసియాన్ సమిట్ మరియు ఈస్ట్ ఏశియా స‌మిట్ లు జరిగిన సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

 

  1. ఉభ‌య దేశాల మ‌ధ్య చరిత్రాత్మ‌క‌ మ‌రియు సాంప్ర‌దాయిక‌ మైత్రీ సంబంధాలు నెలకొన్నాయని ను నేత‌లు ఇరువురూ ఈ సంద‌ర్భం గా పున‌రుద్ఘాటించారు. భార‌త‌దేశం-వియ‌త్నామ్ సంబంధాలు సాంస్కృతిక ప‌ర‌మైన మ‌రియు నాగ‌ర‌క‌త ప‌ర‌మైన లంకెల యొక్క గ‌ట్టి పునాది మీద నిర్మిత‌మైన‌వ‌ని, అంతే కాకుండా ఇవి ప‌ర‌స్ప‌ర విశ్వాసం, ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న, ప్రాంతీయ వేదిక‌ల లో మ‌రియు అంత‌ర్జాతీయ వేదిక‌ల లో శ‌క్తిమంత‌మైన‌టువంటి స‌హ‌కారం ప్రాతిప‌దిక‌లు గా ఏర్ప‌డ్డాయని నేత‌ లు స్ప‌ష్టం చేశారు.

 

  1. ఉభ‌య దేశాల మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన ఉన్న‌త స్థాయి బృందాల రాక‌ పోక‌ లు అనేక రంగాల లో ప‌టిష్ట‌మైన‌టువంటి స‌హ‌కారాని కి దారితీశాయ‌ని, అంతేకాకుండా, ర‌క్ష‌ణ మ‌రియు భ‌ద్ర‌త సంబంధాల విస్త‌ర‌ణ కు ఆర్థిక మ‌రియు వాణిజ్య సంబంధ‌మైన స‌న్నిహిత లంకెల‌ ను ఏర్ప‌ర‌చాయ‌ని, ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య బంధాన్ని ప్ర‌గాఢం చేశాయ‌ని స‌మావేశం లో ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించ‌డమైంది.

 

  1. ర‌క్ష‌ణ మ‌రియు భ‌ద్ర‌త రంగాల లో ఇతోధిక బంధం ఏర్ప‌డిన సంగ‌తి ని ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొని, స‌ముద్ర రంగం లో కూడాను స‌హ‌కారాన్ని పెంపొందింప చేసుకోవాల‌ని ఇరు ప‌క్షాలు అంగీక‌రించాయి. ఉగ్ర‌వాదం మ‌రియు తీవ్ర‌వాదం రువ్వుతున్న బెద‌రింపు ల గురించి నేత‌ లు ఇరువురూ చ‌ర్చించి, ఈ భూతం తో క‌ల‌సికట్టుగా పోరాడాల‌ని అంగీక‌రించారు.

 

  1. ఇండో-ప‌సిఫిక్ ప్రాంతం లో శాంతి ని, భ‌ద్ర‌త ను మ‌రియు స‌మృద్ధి ని ప్రోత్స‌హించాలన్న కోసం త‌మ అభిలాష ను ఇరు ప‌క్షాలు మరో మారు నొక్కి పలికాయి. యునైటెడ్ నేశన్స్ కన్ వెన్శన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యుఎన్ సిఎల్ఒసి) సహా అంత‌ర్జాతీయ చ‌ట్టం ప‌ట్ల గౌర‌వం ప్రాతిప‌దిక గా నియ‌మాల పై ఆధార‌ప‌డిన క్ర‌మాన్ని ప‌రిర‌క్షించాల‌ని నేత‌లు ఇరువురూ వారి యొక్క వచనబ‌ద్ధ‌త ను వ్య‌క్తం చేశారు.  ఈ ప్ర‌క్రియ సౌత్ చైనా సీ   ప్రాంతం లో నియ‌మాల ప్రాతిప‌దికన సాగే వ్యాపారం, స‌ముద్ర‌యాన నిర్వ‌హ‌ణ ల‌లో స్వాతంత్య్రం ప‌రిర‌క్ష‌ణ కు దోహ‌దపడుతుంద‌ని పేర్కొన్నారు.

  

  1. 2020వ సంవ‌త్స‌రం లో ఆసియాన్ అధ్య‌క్ష ప‌ద‌వి ని చేప‌ట్ట‌బోతున్న వియ‌త్నామ్ తో స‌న్నిహితం గా ప‌ని చేసేందుకు, ఈ స‌హ‌కారాన్ని 2020-2021 మ‌ధ్య కాలం లో యుఎన్ఎస్‌సి లో శాశ్వ‌తేతర స‌భ్య‌త్వ దేశం గా వియ‌త్నామ్ వ్య‌వ‌హ‌రించేటపుడు సైతం కొన‌సాగించ‌డానికి భార‌త‌దేశం స‌న్న‌ద్ధం గా ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వెల్ల‌డించారు.