ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి బుధవారం నాడు సమావేశమై, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డి ఐ) విధానంలో సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూన్ 20వ తేదీన పలు విభాగాల్లో ఎఫ్ డి ఐ నిబంధనలను సరళీకరిస్తూ ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ఈ చర్యల వల్ల దేశంలోకి ఎఫ్ డి ఐ ల రాక పెరగనుంది. పెట్టుబడులు పెరగడంతో, ఆదాయాలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి :
దేశంలో తయారయ్యే ఆహార ఉత్పత్తుల వాణిజ్యం, ఇ- కామర్స్ విభాగాలలో ఆటోమేటిక్ రూట్ లో 100 శాతం ఎఫ్ డి ఐ లను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
గతంలో రక్షణ రంగంలోని కంపెనీలలో ఆటోమేటిక్ రూట్ లో 49 శాతం ఎఫ్ డి ఐ ని అనుమతించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు వచ్చే పక్షంలో కేసుల వారీగా 49 శాతానికి పైబడిన ఎఫ్ డి ఐ లను ప్రభుత్వ అనుమతితో ఆహ్వానించేందుకు తాజాగా ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించింది. అందుకు ఈ దిగువ మార్పులను ప్రవేశపెట్టారు.
బ్రాడ్ కాస్టింగ్ కారేజ్ సర్వీసులలో ఎఫ్ డి ఐ విధానాన్ని కూడా సవరించారు. రంగాల వారీగా కొత్త పరిమితులు, ప్రవేశ మార్గాలు ఇలా ఉన్నాయి:
5.2.7.1.1
(1) టెలీపోర్టులు (అనుసంధాన హబ్ లు/ టెలీపోర్టుల ఏర్పాటు) (2) డైరెక్ట్ టు హోమ్ (డి టి హెచ్) (3) కేబుల్ నెట్ వర్క్ లు (జాతీయ, రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎమ్ ఎస్ ఒ), నెట్ వర్క్ డిజిటలైజేషన్) (4) మొబైల్ టివి (5) హెడ్ ఎండ్ ఇన్ ద స్కై బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ (హెచ్ ఐ టి ఎస్) |
ఈ విభాగాలన్నింటిలోనూ 100 శాతం ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ గా అనుమతిస్తున్నారు. |
5.2.7.1.2
కేబుల్ నెట్ వర్క్ లు (డిజిటలైజేషన్ పనులేవీ చేపట్టని ఇతర ఎంఎస్ ఓలు , స్థానిక కేబుల్ ఆపరేటర్లు (ఎల్ సి ఒ) |
|
ఈ విభాగాల్లో 49 శాతానికి పైబడి విదేశీ పెట్టుబడిని అనుమతిస్తారు. యాజమాన్య ధోరణిలో మార్పు, ప్రస్తుత ఇన్వెస్టర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ కు వాటాల బదిలీ ఎఫ్ ఐ పి బి అనుమతి రూట్ లో ఆమోదిస్తారు. | రంగం/ కార్యకలాపం | కొత్త పరిమితి |
---|
పాత విధానం కింద కొత్త ఫార్మా యూనిట్లలో ఆటోమేటిక్ రూట్ లో నూరు శాతం ఎఫ్ డిఐని, పాత యూనిట్ల విస్తరణ విభాగాల్లో ప్రభుత్వ అనుమతితో నూరు శాతం ఎఫ్ డిఐని అనుమతిస్తున్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో పాత యూనిట్ల విస్తరణలో 74 శాతం పైబడిన ఎఫ్ డిఐని ప్రభుత్వ అనుమతి మార్గంలో ఆమోదిస్తారు.
(i) విమానయానంలో ఎఫ్ డిఐ విషయంలో పాత విధానం కింద కొత్త ప్రాజెక్టుల్లో ఆటోమేటిక్ రూట్ లో నూరు శాతం ఎఫ్ డిఐ, పాత ప్రాజెక్టుల విస్తరణలో 74 శాతం ఎఫ్ డిఐ ఆటోమేటిక్ రూట్ లో అనుమతించేవారు. విస్తరణ కార్యకలాపాల్లో 74 శాతానికి పైబడిన ఎఫ్ డిఐని ప్రభుత్వ అనుమతి రూట్ లో ఆమోదంచేవారు.
(ii) ప్రస్తుతం పని చేస్తున్నవిమానాశ్రయాల ఆధునికీకరణ, వాటిపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పాత ఎయిర్ పోర్టు విస్తరణ ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తారు.
(iii) షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు, దేశీయ షెడ్యూల్డ్ పాసింజర్ విమాన సర్వీసుల్లో పాత పాలసీ కింద 49 శాతం ఎఫ్ డి ఐ ని ఆమోదించే వారు. ఇప్పుడు ఈ విభాగాల్లోకి 100 శాతం ఎఫ్ డి ఐ ని అనుమతిస్తారు. 49 శాతం ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లోను, ఆ పైబడిన ఎఫ్ డి ఐ ని ప్రభుత్వ అనుమతికి లోబడి ఆమోదిస్తారు. ఎన్ ఆర్ ఐ పెట్టుబడుల విషయంలో 100 శాతం ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తారు. ఇక దేశీయ విమానయానంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఎయిర్ లైన్స్ ఆయా కంపెనీల పెయిడప్ కేపిటల్ లో 49 శాతం పెట్టుబడులు పెట్టే విధానాన్ని కొనసాగిస్తారు.
పాత ఎఫ్ డి ఐ విధానం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలలో 49 శాతం ఎఫ్ డి ఐ ని అనుమతుల రూట్ లో ఆమోదించింది. కానీ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు కార్యకలాపాలు నిర్వహించడానికి పి ఎస్ ఎ ఆర్ చట్టం 2005 కింద లైసెన్సు పొందాల్సి ఉంది. ఈ నిబంధన ఇప్పటికే ఉండగా ఎఫ్ డి ఐ కోసం మరో అనుమతి అవసరం లేదని గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధనను తొలగించింది. అందుకే ఇప్పుడు 49 శాతం ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లోను, ఆ పైబడి 74 శాతం వరకు ఎఫ్ డి ఐ ని అనుమతి రూట్ లోను ఆమోదించాలని కేంద్రం నిర్ణయించింది.
దేశంలో రక్షణ, టెలికాం, ప్రైవేటు సెక్యూరిటీ, సమాచార/ప్రసార విభాగాలలో వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు ఇక్కడ బ్రాంచి కార్యాలయం, లయజన్ కార్యాలయం, ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేయడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు/ రెగ్యులేటర్ల అనుమతి పొంది ఉన్నా, ఎఫ్ ఐ పి బి అనుమతి పొంది ఉన్నా ఇక ఆర్ బిఐ అనుమతిని పొందాల్సిన అవసరం లేకుండా ఆ నిబంధనను తొలగించారు.
కొత్త ఎఫ్ డి ఐ విధానం కింద పశుసంవర్థకం (శునకాల బ్రీడింగ్ తో సహా), చేపల పెంపకం, ఆక్వాకల్చర్, తేనెటీగల పెంపకం వంటి విభాగాలలో ఆటోమేటిక్ రూట్ లో 100 శాతం ఎఫ్ డి ఐ ని అనుమతిస్తారు. ఆయా రంగాలలో ఎఫ్ డి ఐ లకు నియంత్రిత షరతులను తొలగించారు.
సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేయాలనుకునే సంస్థలో విడి భాగాలను స్థానికంగానే సేకరించుకోవాలన్న నిబంధనను 3 సంవత్సరాల పాటు సడలించారు. అంటే అలాంటి సంస్థలు దేశంలో తొలి రిటైల్ స్టోర్ ప్రారంభించిన నాటి నుండి 3 సంవత్సరాల పాటు ఈ నిబంధనకు కట్టుబడాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఈ స్థానిక సోర్సింగ్ నిబంధన వర్తిస్తుంది.
పూర్వ రంగం:
గత రెండేళ్ళుగా ప్రభుత్వం రక్షణ, నిర్మాణం, బీమా, పింఛను, బ్రాడ్ కాస్టింగ్, తేయాకు, కాఫీ, రబ్బరు, ఏలకులు, పామాయిల్ పెంపకం, ఆలివ్ ఆయిల్ తోటల పెంపకం, సింగిల్ బ్రాండ్ రిటైల్, తయారీ, లిమిటెడ్ లయబిలిటీ భాగస్వామ్యాలు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలకు సంబంధించి ఎఫ్ డి ఐ విధానాలలో పెను సంస్కరణలు చేసింది. ఈ సంస్కరణ ల ఫలితంగా 2015-16లో ఎఫ్ డి ఐ ల రాక 55.46 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీగా ఎఫ్ డి ఐ లు రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. 2013-14లో ఎఫ్ డి ఐ రాక 36.04 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. దేశానికి మరింత ఎఫ్ డి ఐ లు ఆకర్షించగల సామర్థ్యం ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు మరింత సరళీకరణ, సడలింపు అవసరమని భావించింది.
ఇందుకు అనుగుణంగానే 2016 జూన్ 20వ తేదీన ప్రభుత్వం ఉపాధి రంగానికి కొత్త ఉత్తేజం నింపడం లక్ష్యంగా ఎఫ్ డి ఐ విధానాలలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 2015 నవంబర్ లో ప్రకటించిన భారీ సంస్కరణల తరువాత చేపట్టిన మరో విప్లవాత్మక సంస్కరణల కార్యక్రమం ఇది. దేశాన్ని విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ సరళీకరణ లక్ష్యం. తాజా మార్పులతో స్వల్ప నెగెటివ్ జాబితా తప్ప పలు రంగాలు ఇప్పుడు ఎఫ్ డి ఐ లను ఆటోమేటిక్ రూట్ లో అనుమతించగలుగుతాయి.ఈ సవరణలతో భారత్ ఎఫ్ డి ఐ లకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ దేశంగా మారింది.
***