మహాశయులార,
భారతదేశంలో, మేము విపత్తు ప్రమాదాన్ని తగ్గించే సమస్యలకు అధిక ప్రాముఖ్యతనిస్తాము; ఇది కేంద్ర ప్రభుత్వ ప్రజా విధాన సమస్య.
మేము విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి కేటాయించిన నిధులను గణనీయంగా పెంచాము. విపత్తు ప్రమాద యాజమాన్య అవసరాలైన విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం, సంసిద్ధత, ప్రతిస్పందన, పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం తో సహా మొత్తం సమగ్ర విధానానికి మద్దతు ఇవ్వడానికిమేము మా ఆర్థిక చట్రం లో కీలక మార్పులను తీసుకువచ్చాము. మా రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలలో (2021-2025) విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి సుమారు $6 బిలియన్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇది సంసిద్ధత, ప్రతిస్పందన మరియు పునరుద్ధరణ కోసం ఉద్దేశించిన $23 బిలియన్ల వనరులకు అదనం.
కేవలం ఒక దశాబ్దంలో, మేము తుఫానుల నుండి ప్రాణనష్టాన్ని 2% కంటే తక్కువకు తగ్గించగలిగాము. కొండచరియలు విరిగిపడటం, హిమనదీయ సరస్సు విస్ఫోటనం వరదలు, భూకంపాలు, అటవీ మంటలు, వేడి తరంగాలు మరియు మెరుపులు వంటి అన్ని ప్రమాదాల నుండి నష్టాలను తగ్గించడానికి మేము ఇప్పుడు ప్రతిష్టాత్మక ఉపశమన కార్యక్రమాలను అభివృద్ధి చేస్తున్నాము.
ముందస్తు హెచ్చరిక సమాచార వ్యవస్థ ను మెరుగుపరచడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. మేము సాధారణ హెచ్చరిక ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నాము, ఇది విపత్తు నిర్వాహకులు మరియు టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లతో హెచ్చరిక సమాచారం ఏజెన్సీలను ఏకీకృతం చేస్తుంది. ఇది దేశంలోని 1.3 బిలియన్ పౌరులలో ప్రతి ఒక్కరికి చేరుకోవడానికి ప్రాంతీయ భాషలలో ప్రాదేశికత లక్ష్యంగా హెచ్చరికల వ్యాప్తిని నిర్ధారిస్తుంది. ‘2027 నాటికి అందరికీ ముందస్తు హెచ్చరిక’పై యూ ఎన్ సెక్రటరీ జనరల్ చొరవను మేము అభినందిస్తున్నాము. ఈ సమయానుకూలమైన ప్రపంచ చొరవ ద్వారా నిర్దేశించబడిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మా ప్రయత్నాలు దోహదపడతాయి.
మహాశయులార,
భారత్ జీ 20 అధ్యక్ష హోదా సందర్భంగా, సభ్యులు విపత్తు ప్రమాద తగ్గింపుపై వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. జీ 20 వర్కింగ్ గ్రూప్ గుర్తించిన ఐదు ప్రాధాన్యతలు – అందరికీ ముందస్తు హెచ్చరిక, సుస్థిరంగా ఉండే మౌలిక సదుపాయాలు, డీ ఆర్ ఆర్ యొక్క మెరుగైన చౌక రుణాలు, వ్యవస్థలు మరియు ప్రతిస్పందన సామర్థ్యాలు మరియు ‘మెరుగైన పునర్నిర్మాణం’ మరియు డీ ఆర్ ఆర్ కి పర్యావరణ-వ్యవస్థ ఆధారిత విధానాలు – ఇవి ప్రపంచవ్యాప్తంగా సెండాయ్ లక్ష్యాలను సాధించడం లో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి.
అదనంగా, ప్రస్తుతం భారతదేశం మరియు అమెరికా సహ-నాయకత్వం వహించే కూటమి 21వ శతాబ్దంలో విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలను మేము ప్రణాళికాబద్ధంగా, రూపకల్పన చేసే, నిర్మించే మరియు నిర్వహించే విధానంలో పరివర్తనను తీసుకువస్తోంది. మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు దీర్ఘకాలిక పెట్టుబడులు. సరైన విపత్తు ప్రమాద అంచనాల ద్వారా సమాచారం అందించబడి, మెరుగైన ప్రమాద యాజమాన్య పాలనకు కు ఆధారం అయితే, ఈ మౌలిక సదుపాయాల పెట్టుబడులు దీర్ఘకాలిక సుస్థిరతను పెంచుతాయి.
మహాశయులార, ఈ ఉదయం, టర్కీయేలో ఇటీవల సంభవించిన విషాద భూకంపం నుండి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి యొక్క హృదయాలను కదిలించే స్వంత అనుభవాన్ని మేము విన్నాము.
భారత్ తన దార్శనిక మార్గమైన వసుధైవకుటుంబకం స్ఫూర్తితో ప్రపంచాన్ని ఒక పెద్ద అంతర్-అనుసంధానిత కుటుంబంగా భావించి, భారత ప్రభుత్వం టర్కియే మరియు సిరియా నుండి మన సోదరులు మరియు సోదరీమణులకు ఫీల్డ్ హాస్పిటల్‌లు మరియు అన్వేషణ మరియూ సహాయ బృందాలను పంపడం ద్వారా తక్షణ సహాయాన్ని అందించింది. ఈ ఉపశమన సహాయం మానవ కేంద్రీకృత ప్రపంచ అభివృద్ధి విధానానికి నిజమైన నిదర్శనం!
మహాశయులార, ఎస్ డీ జీ ల స్ఫూర్తితో దేశంలో అలాగే మొత్తం భూమి పై ప్రతిచోటా విపత్తు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నాలకు మేము అండగా ఉండటానకి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తున్నాను: “ఎవరినీ వెనుకకు వదిలివేయవద్దు, ఏ స్థలాన్ని వదిలివేయవద్దు మరియు పర్యావరణ వ్యవస్థను వెనుకకుర్ వదిలివేయవద్దు. .”
****