విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగం లో సహకారం కోసం భారత గణతంత్రాని కి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డిఎమ్ఎ)కు మరియు ఇటలీ గణతంత్రాని కి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ప్రొటెక్శన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) కుదిరిన సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది.
ప్రయోజనాలు:
విపత్తు నష్ట భయం తగ్గింపు మరియు నిర్వహణ రంగం లో సహకారం కోసం ఎమ్ఒయు పై భారత గణతంత్రాని కి చెందిన ఎన్ డిఎమ్ఎ, ఇటలీ గణతంత్రాని కి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ప్రొటెక్శన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంతకాలు చేశాయి.
ఈ ఎమ్ఒయు ప్రకారం ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయడానికి వీలు ఏర్పడుతుంది. సదరు వ్యవస్థ వల్ల ఇటు భారతదేశం, అటు ఇటలీ.. ఈ రెండు దేశాలు పరస్పరం విపత్తు నిర్వహణ యంత్రాంగాల తాలూకు ప్రయోజనాల ను పొందగలుగుతాయి. అంతేకాదు, విపత్తు నిర్వహణ రంగం లో సన్నాహక చర్య లు, ప్రతిస్పందన మరియు సామర్ధ్యాల పెంపుదల రంగాల ను పటిష్ట పరచడం లో సాయం అందుతుంది.
విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగం లో సహకారానికి సంబంధించిన ఎమ్ఒయు పై భారత గణతంత్రాని కి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్ డిఎమ్ఎ)కు మరియు ఇటలీ గణతంత్రాని కి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ప్రొటెక్శన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కు మధ్య2021 జూన్ లో సంతకాలు అయ్యాయి.
***