Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వినేశ్, మీరు చాంపియన్ లలో చాంపియన్: ప్రధాన మంత్రి


 పారిస్ ఒలింపిక్స్ లో తన ఆఖరి కుస్తీ పోటీలో పాల్గొనడాని కన్నా ముందే భారతీయ కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురి అయిన సందర్భంగా దేశ ప్రజలకు కలిగిన మానసిక క్షోభను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా తానే వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

 

‘‘వినేశ్, మీరు చాంపియన్ లలో చాంపియన్.  మీరు భారతదేశానికి గర్వకారణం, మీరు భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ప్రేరణ. 

ఈ రోజు ఎదురైన అసఫలత దు:ఖదాయకం.  నా లోలోపలి నిరాశాభరిత భావనను నా ఈ మాటలు స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతున్నాయో లేదో అని నాకనిపిస్తోంది!.

కింద పడ్డా మళ్లీ లేచి నిలబడే తత్వానికి మీరు ప్రతీక అనే సంగతి నాకు తెలుసు.  సవాళ్ళకు ఎదురొడ్డి డీకొనడం మీ స్వభావంగా ఉంటూ వస్తోంది.

మరింత బలంగా తిరిగి రండి.  మేమంతా మీ కోసం ప్రార్థిస్తున్నాం.@Phogat_Vinesh’’

 

 

***

DS/ST