Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వినూత్న విధానాలతో, పునరుత్పాదక ఇంధన రంగ నాయకత్వంతో, ఇంకా ఇతర కార్యక్రమాలతో వాతావరణ పరిరక్షణ రంగంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాల్ని నెలకొల్పుతున్న భారత్: ప్రధానమంత్రి


భారతదేశం సరికొత్త విధానాలతోనూ, పునరుత్పాదక ఇంధన రంగంలో నాయకత్వం వహించడం ద్వారానూ, ఇంకా ఇతర కార్యక్రమాలను అమలుచేయడం ద్వారానూ వాతావరణ పరిరక్షణ రంగంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాల్ని నెలకొల్పుతోందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు అన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్..‘ఐఎస్ఏ), బయోఫ్యూయల్స్ అలయన్స్ వంటి కార్యక్రమాలు సుస్థిర ప్రాతిపదికను కలిగి ఉండే, సమృద్ధి యుక్త భవిష్యత్తుకు బాటవేస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పొందుపరుస్తూ ఇలా తెలిపింది:

 

‘‘భారతదేశం సరికొత్త విధానాలతోనూ, పునరుత్పాదక ఇంధన రంగంలో నాయకత్వం వహించడం ద్వారానూ, ఇంకా ఇతర కార్యక్రమాలను అమలుచేయడం ద్వారానూ వాతావరణ పరిరక్షణ రంగంలో ప్రపంచ శ్రేణి ప్రమాణాల్ని స్థాపిస్తోంది. ఐఎస్ఏ, మిషన్ ఎల్ఐఎఫ్ఈ (Mission LiFE), గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ వంటి కార్యక్రమాలు సుస్థిర ప్రాతిపదికను కలిగి ఉండే, సమ‌ృద్ధిభరితమైన భవిష్యత్తుకు బాటను పరుస్తున్నాయి’’.

 

***

 

 

***

MJPS/SR