Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయ్ దివస్ సందర్భంగా ధీర సైనికులకు ప్రధానమంత్రి అభినందనలు


విజయ్ దివస్ సందర్భంగా ధీర జవానులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ఆయన పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఈరోజు విజయ్ దివస్ సందర్భంగా, మనం 1971లో భారతదేశానికి చరిత్రాత్మక విజయం లభించడంలో తమ తోడ్పాటును అందించిన ధీర సైనికుల నిరతినీ, ధైర్య సాహసాలనీ గౌరవించుకొందాం. వారి  నిస్వార్థ అంకితభావం, చెక్కుచెదరని సంకల్పం మన దేశాన్ని రక్షించడంతోపాటు మన దేశ పేరు ప్రతిష్ఠలను నిలబెట్టాయి. వారు కనబర్చిన పరాక్రమానికీ, వారు చాటిన అచంచల స్ఫూర్తినీ స్మరించుకునే అసాధారణ రోజు ఈ రోజు. వారు చేసిన త్యాగాలు భావి తరాలకు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూ ఉంటాయి. అంతేకాదు, వారి త్యాగాలకు మన దేశ చరిత్రలో సుస్థిర స్థానం కూడా ఉంటుంది’’.