Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్కార్యక్రమం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఆ కార్యక్రమం లో పాల్గొని సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు; వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చి, కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు.. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్కార్యక్రమం తో రాజస్థాన్ లో అన్ని నియోజకవర్గాల నుండి లక్షల సంఖ్య లో ప్రజలు పాలుపంచుకోవడాన్ని గమనించి, ఈ కార్యక్రమం లో వారు పాలుపంచుకొంటున్నందుకు గాను వారి కి ధన్యవాదాల ను తెలియ జేశారు. లబ్ధిదారులు అందరినీ ఒక చోటు కు తీసుకొని రావడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఎంతో చక్కగా వినియోగించుకొన్నందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి కి కూడా ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. రాజస్థాన్ యొక్క ప్రజల లోని సద్గుణాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ రాజస్థాన్ కు కొన్ని రోజుల క్రితం విచ్చేసినప్పుడు ప్రజలు ఆయన కు స్వాగతం పలికిన తీరు ను గుర్తు కు తీసుకు వచ్చారు. ఆనాటి సాదర ఆహ్వానం భారతదేశం లో పలు ప్రాంతాల లో మారుమ్రోగుతుండడం ఒక్కటే కాకుండా దాని ప్రతిధ్వనులు ఫ్రాన్స్ లో కూడా వినిపించాయన్నారు. రాజస్థాన్ లో విధాన సభ కు ఎన్నికలు జరిగిన కాలం లో ఈ రాష్ట్రాన్ని తాను సందర్శించిన సందర్భం లో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాల ను కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకున్నారు. మోదీ కీ గ్యారంటీ’ (‘మోదీ హామీ’) పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించడం తో డబల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడింది అని ఆయన అన్నారు. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు రంగాల లో 17,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టు లు ఈ రోజు న కార్యరూపం దాలుస్తున్నందుకు రాజస్థాన్ ప్రజల కు అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఈ ప్రాజెక్టు లు రాష్ట్రం లో లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాల ను అందిస్తాయన్నారు.

 

యహీ సమయ్ హై – సహీ సమయ్ హై’ (‘ఇదే సమయం – సరైన సమయం’) అంటూ ఎర్ర కోట యొక్క బురుజుల మీది నుండి ప్రధాన మంత్రి తాను ఇచ్చిన పిలుపు ను మళ్ళీ ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాలం ఒక బంగారు కాలం గా ఉంది అన్నారు. ఇప్పుడు భారతదేశం మునుపటి దశాబ్దాల యొక్క నిరుత్సాహాన్ని వీడి, పూర్ణ విశ్వాసం తో ముందుకు సాగిపోవచ్చు అని పేర్కొన్నారు. 2014 వ సంవత్సరాని కంటే పూర్వం కుంభకోణాలు, అభద్రత మరియు ఉగ్రవాదం తాలూకు చర్చ జరిగేదని, దీనికి భిన్నం గా ప్రస్తుతం వికసిత్ భారత్ మరియు వికసిత్ రాజస్థాన్తాలూకు లక్ష్యం పై మేం శ్రద్ధ తీసుకొంటున్నాం అని ఆయన అన్నారు. ‘‘ఈ రోజు న మనం పెద్ద సంకల్పాల ను తీసుకొంటున్నాం, పెద్ద కలల ను కంటున్నాం, మరి మనం వాటిని నెరవేర్చుకోవడం కోసం మనల ను మనం అంకితం చేసుకొంటున్నాం’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను వికసిత్ భారత్ ను గురించి ఎప్పుడైతే మాట్లాడానో అది కేవలం ఒక మాటో, ఒక ఉద్వేగమో కాదు, అది ప్రతి ఒక్క కుటుంబం యొక్క జీవనాన్ని సమృద్ధం చేయడం కోసం చేపట్టినటువంటి ఒక ప్రచార ఉద్యమం’’ అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ అనేది పేదరికాన్ని నిర్మూలించి, నాణ్యమైన ఉద్యోగాల ను కల్పించి మరి అలాగే దేశం లో ఆధునాతన సదుపాయాల ను నిర్మించడం కోసం చేపట్టిన ప్రచార ఉద్యమం అని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న తాను విదేశీ సందర్శన నుండి తిరిగి వచ్చినట్లు చెప్తూ, ఆ సందర్భం లో ప్రపంచ నాయకుల తో తాను జరిపిన సమావేశాల ను గురించి ప్రస్తావించారు. భారతదేశం పెద్దవైన కలల ను కనే స్థితి లో ఉందని, మరి ఆయా కలల ను పండించుకోగలదని ప్రపంచ నేత లు అంగీకరిస్తున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘వికసిత్ భారత్ యొక్క అభివృద్ధి కి ఒక వికసిత్ రాజస్థాన్ ను ఆవిష్కరించడం తప్పనిసరి’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. రైలు మార్గాలు, రహదారి మార్గాలు, విద్యుత్తు మరియు నీరు ల వంటి అత్యవసర రంగాల లో శరవేగం గా అభివృద్ధి చోటుచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా రంగాల అభివృద్ధి వల్ల రైతుల కు, పశు సంరక్షుల కు, పరిశ్రమల కు మరియు పర్యటన రంగాని కి తదితర రంగాల కు భారీ గా లబ్ధి కలుగుతుంది; అంతేకాకుండా, అదే జరిగిన నాడు రాష్ట్రాని కి క్రొత్త పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం లో యూనియన్ బడ్జెటు లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి గాను రికార్డు స్థాయిలో 11 లక్షల కోట్ల రూపాయల ను కేటాయించడమైందని, అది ఏ మునుపటి ప్రభుత్వం కేటాయించిన దానితో పోల్చి చూసినప్పటికీ ఆరు రెట్లు అధికం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వ్యయం సిమెంటు పరిశ్రమల కు, పింగాణి వస్తువుల పరిశ్రమల కు, ఇంకా రాళ్ళ పరిశ్రమల కు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.

 

రాజస్థాన్ లో గడచిన 10 సంవత్సరాల లో గ్రామీణ ప్రాంతాల రహదారులు, హైవేస్, ఇంకా ఎక్స్‌ప్రెస్ వేస్ లలో ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి పెట్టుబడి ని పెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం రాజస్థాను ను విశాలమైన హైవే స్ మాధ్యం ద్వారా గుజరాత్, మహారాష్ట్ర ల లోని కోస్తా తీర ప్రాంతాల మొదలుకొని పంజాబ్ వరకు సంధానించడం జరుగుతున్నది అని ఆయన అన్నారు. ఈ రోజు న చేపట్టుకొంటున్న ప్రాజెక్టు లు కోటా, ఉదయ్‌పుర్, టోంక్, సవాయీ మాధోపుర్, బూందీ, అజ్‌ మేర్, భీల్‌వాడా, మరియు చిత్తౌడ్‌ గఢ్ లలో కనెక్టివిటీ ని మెరుగు పరుస్తాయి. ఈ రహదారులు దిల్లీ కి, హరియాణా కు, గుజరాత్ కు మరియు మహారాష్ట్ర కు మెరుగైన కనెక్టివిటీ కి సైతం పూచీ పడతాయి.

 

నేటి కార్యక్రమాల లోని మరికొన్ని అంశాలు అయిన విద్యుతీకరణ ను గురించి రైలు మార్గాల కు కొత్త రూపు రేఖల ను సంతరించడం మరియు మరమ్మతు పనుల ను చేపట్టడం వంటి గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, బాందీకుయీ-ఆగ్ రా ఫోర్ట్ రైలు మార్గం డబ్లింగు తో మెహందీ‌పుర్ బాలాజీ మరియు ఆగ్ రా లను చేరుకోవడం సులభతరం అవుతుంది అని వివరించారు. అదే విధం గా మరిన్ని రైళ్ళు నడిపేందుకు వీలు ను ఖాతీపురా (జయ్ పుర్) స్టేశన్ కల్పిస్తుంది అని ఆయన అన్నారు.

 

పౌరులు వారి సొంత ఇళ్ళ లో సౌర విద్యుత్తు ను ఉత్పత్తి చేయడాని కి అనువుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టం చేస్తూ, అదే కాలం లో అదనపు విద్యుత్తును విక్రయించడం ద్వారా ఆదాయార్జన కు కూడా అవకాశం ఉంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పిఎమ్ సూర్య ఘర్ యోజన ( ఉచిత విద్యుత్తు పథకం) ను ప్రారంభించడాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటిస్తూ, దీని ద్వారా ప్రభుత్వం 300 యూనిట్ ల విద్యుత్తు ను ఉచితం గా అందించే ఏర్పాటు చేసింది అన్నారు. మొదటి దశ లో ఒక కోటి ఇళ్ళ మిద్దెల మీద సౌర ఫలకాల ను ఏర్పాటు చేయడం కోసం ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని, ఈ ప్రాజెక్టు కు దాదాపు గా 75,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ఆయన తెలియ జేశారు. దీని ద్వారా సమాజం లో మధ్య తరగతి ప్రజలు మరియు దిగువ మధ్య తరగతి ప్రజలు అత్యధిక ప్రయోజనాన్ని పొందనున్నారని ఆయన వివరించారు. బ్యాంకు లు సైతం సులభతర రుణ వితరణ కు ముందుకు వస్తాయి అని ఆయన చెప్పారు. ‘‘రాజస్థాన్ లో అయిదు లక్షల గృహాల లో సౌర ఫలకాల ను నెలకొల్పడాని కి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదవారు మరియు మధ్య తరగతి కుటుంబాల కు అయ్యే ఖర్చు ను తగ్గించడం లో డబల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క ప్రయాసల ను గురించి ఆయన నొక్కిచెప్పారు.