Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ భారత్‌‌ను సాకారం చేసే కృషిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలకు కట్టుబడి ఉంటామని పౌరులు పునరుద్ఘాటించాలి: ప్రధానమంత్రి


‘వికసిత్ భారత్‌’ (అభివృద్ధి చెందిన భారత్‌) ను సాకారం చేసే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలకు కట్టుబడి పనిచేస్తామని  పునరుద్ఘాటించాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దేశపౌరులకు  ఈ రోజు పిలుపునిచ్చారు. రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఆధునిక భారతదేశ గొప్ప ఆలోచనపరులలోనూ, సంస్థలను ఏర్పాటు చేయడంలోనూ బాబాసాహెబ్ ఒకరని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ (@rajnathsingh) ఒక వ్యాసంలో రాశారు.  ప్రధాన సంస్థల ఏర్పాటులో డాక్టర్ అంబేద్కర్ పోషించిన పాత్రను ఆయన గుర్తు తెచ్చుకొన్నారు. అంతేకాకుండా ‘వికసిత్ భారత్‌’ను సాకారం చేసే దిశలో బాబాసాహెబ్ ఆదర్శాలకు కట్టుబడి ముందుకు దూసుకుపోతామంటూ పౌరులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలని కూడా కోరారు.’’