Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వికసిత్భారత్ సంకల్ప్ యాత్ర’ యొక్క లబ్ధిదారుల తో డిసెంబరు 27 వతేదీ నాడు భేటీ కానున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 27 వ తేదీ న మధ్యాహ్నం పూట 12:30 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ యొక్క లబ్ధిదారుల తో మాట్లాడనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడా.

 

ఈ కార్యక్రమంలో దేశం లో అన్ని ప్రాంతాల నుండి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క వేల కొద్దీ లబ్ధిదారులు పాల్గొంటారు. కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభల సభ్యుల తో పాటు స్థానిక స్థాయి కి చెందిన ప్రతినిధులు కూడాను పాలుపంచుకోనున్నారు.

 

‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ 2023 నవంబరు 15 వ తేదీ న మొదలైనప్పటి నుండి ప్రధాన మంత్రి యావత్తు దేశం లో ఈ యాత్ర యొక్క లబ్ధిదారుల తో క్రమం తప్పక సమావేశమై, వారి తో మాట్లాడుతున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మూడు సారులు (నవంబరు 30 వ తేదీ న, డిసెంబరు లో 9 వ తేదీ న మరియు 16 వ తేదీ న) ఈ విధమైన సమావేశాలు జరిగాయి. దీనికి అదనం గా, ప్రధాన మంత్రి ఇటీవల వారాణసీ ని తాను సందర్శించిన కాలం లో వరుస గా రెండు రోజుల పాటు (డిసెంబరు 17వ తేదీన మరియు 18వ తేదీ న) వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ముఖాముఖి సంభాషించారు.

 

ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి పథకాల ను సమాజం లో ఆఖరి అంచె వరకు చేర్చాలన్న లక్ష్యం తో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ను దేశం అంతటా నిర్వహించడం జరుగుతున్నది. దీని ద్వారా, ఆ యా పథకాల ప్రయోజనాలు ఫలానా కాలం లోపల లక్షిత లబ్ధిదారులు అందరి కి అందేటట్టు చూడాలి అనేదే ధ్యేయం గా ఉంది.

 

***