మహిళల నాయకత్వం లో అభివృద్ధి ని సాధించడం అనేది ఏ కొన్ని కార్యక్రమాలకో పరిమితం అయినటువంటిది కాదు, అది దేశ ప్రజల అభివృద్ధి గాథ లో కీలకమైన స్థానాన్ని కలిగి ఉంది; అంతేకాకుండా, ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం కూడా చేస్తోంది అని ప్రధాన మంత్ర శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మహిళలు మరియు బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ మాధ్యం ద్వారా శేర్ చేస్తూ –
‘‘మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి సాధనకై మా ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ‘వికసిత్ భారత్’ ను ఆవిష్కరించే సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో దేశం లోని నారీ శక్తి యొక్క తోడ్పాటు ఎంతో విలువైంది గా ఉండబోతోంది. స్మృతి ఇరానీ గారు వ్రాసిన వ్యాసం లో ఇదే భావన ను వ్యక్తం చేశారు.’’ అని పేర్కొంది.
महिला नेतृत्व में विकास को लेकर हमारी सरकार प्रतिबद्ध है। 'विकसित भारत' के संकल्प में देश की नारीशक्ति का बहुमूल्य योगदान होने जा रहा है। @smritiirani जी ने अपने आलेख में इसी भावना को प्रकट किया है। https://t.co/bf1OpTYxzk
— PMO India (@PMOIndia) February 5, 2024