సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.
క్వాడ్‌ను మంచి కోసం ఒక ప్రపంచ (గ్లోబల్) శక్తిగా స్థాపించారు. ఈ సంవత్సరం, క్వాడ్ ముఖ్యంగా పసిఫిక్, ఆగ్నేయాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతం తో సహా ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని భాగస్వామ్య దేశాలకు లాభం చేకూర్చే అనేక ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇండో-పసిఫిక్ భాగస్వాముల ప్రాధాన్యాలను నెరవేర్చడానికి క్వాడ్ ఇంతకుముందెన్నడూ లేని విధంగా విస్తృతమైన పరిధి, స్థాయి లో పని చేస్తోంది. భాగస్వామ్య దేశాలు మహమ్మారులు, వ్యాధులను ఎదుర్కొనేలా సహాయపడేందుకు, ప్రకృతి విపత్తులకు స్పందించేందుకు, సముద్ర పరిధి పై అవగాహన ను, సముద్ర భద్రతను మెరుగుపరుచుకునేందుకు , అధిక ప్రమాణాలతో భౌతిక , డిజిటల్ మౌలిక వసతులను సమకూర్చుకునేందుకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుండి నడిపిస్తోంది. అలాగే, కీలక , నూతన ఆవిర్భావ సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టి ప్రయోజనం పొందేందుకు, వాతావరణ మార్పు ముప్పును ఎదుర్కొనేలా చర్యలు చేపట్టేందుకు, సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు చేయేందుకు , తదుపరి తరం సాంకేతిక నైపుణ్యవంతులను తీర్చిదిద్దేందుకు క్వాడ్ తన భాగస్వాములకు సహాయపడుతోంది.
ఇండో-పసిఫిక్ కోసం శాశ్వత భాగస్వాములు
గత నాలుగేళ్లలో క్వాడ్ నేతలు రెండుసార్లు వర్చువల్ గా సహా ఆరుసార్లు సమావేశమయ్యారు. క్వాడ్ విదేశాంగ మంత్రులు ఎనిమిది సార్లు సమావేశమయ్యారు, తాజాగా జూలైలో టోక్యోలో సమావేశమయ్యారు. పరస్పరం సంప్రదింపుల కోసం, భాగస్వామ్య ప్రాధాన్యతల పురోగతికి వీలుగా ఆలోచనలు పంచుకోవడానికి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భాగస్వామ్య దేశాలకు ప్రయోజనాలను అందించడానికి క్వాడ్ దేశాల ప్రతినిధులు అన్ని స్థాయిల్లో నిత్య క్రమంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని క్వాడ్ ప్రభుత్వాలు క్వాడ్ ను అన్ని స్థాయిలలో , వివిధ విభాగాలు , ఏజెన్సీలలో వ్యవస్థీకృతం చేశాయి. ఈ సహకార సంప్రదాయాన్ని పటిష్టం చేయడానికి, దీర్ఘకాలం పాటు మనగలిగేలా క్వాడ్ ను ఏర్పాటు చేయడానికి క్వాడ్ నేతలు ఈ నాడు కొత్త కార్యక్రమాలను ప్రకటించారు.
ప్రతి క్వాడ్ ప్రభుత్వం దీర్ఘకాల ప్రభావం ఉండేలా తమతమ బడ్జెట్ ప్రక్రియల ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ ప్రాధాన్యతలకు సమృద్ధిగా నిధులను సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాయి.
అంతర్-పార్లమెంటరీ మార్పిడిని, ఇతర భాగస్వాములకు క్వాడ్ సహచరులతో సంబంధాలను బలోపేతం చేయడానికి క్వాడ్ ప్రభుత్వాలు తమ తమ చట్టసభలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి, నిన్న, కాంగ్రెస్ సభ్యులు ద్విపక్ష, ద్విసభ్య కాంగ్రెషనల్ క్వాడ్ కూటమి (కాకస్) ఏర్పాటును ప్రకటించారు.
రానున్న నెలల్లో క్వాడ్ వాణిజ్య, పరిశ్రమల మంత్రులు తొలిసారి సమావేశం కానున్నారు.
ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, పరిశుభ్ర ఇంధనం (క్లీన్ ఎనర్జీ) , నాణ్యమైన మౌలిక సదుపాయాలతో సహా ఇండో-పసిఫిక్ లో నాలుగు దేశాలకు భవిష్యత్తు పెట్టుబడులను అన్వేషించడానికి సమావేశం కావాలని క్వాడ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఏజెన్సీల నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని క్వాడ్ నాయకులు స్వాగతించారు. ఎక్స్ పోర్ట్ ఫైనాన్స్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఫర్ ది పసిఫిక్, ఇండియా ఎక్స్ పోర్ట్ -ఇంపోర్ట్ బ్యాంక్, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, యు ఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డి ఎఫ్ సి ) అధిపతుల మధ్య 2022లో జరిగిన మునుపటి సమావేశం ఆధారంగా ఈ నిర్ణయం జరిగింది.
2025 క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా, 2025 క్వాడ్ నేతల సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనున్నాయి.
గ్లోబల్ హెల్త్ అండ్ హెల్త్ సెక్యూరిటీ
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆరోగ్య భద్రతకు మద్దతుగా సమన్వయం, సహకారాన్ని బలోపేతం చేయడానికి క్వాడ్ 2023లో క్వాడ్ ఆరోగ్య భద్రతా భాగస్వామ్యాన్ని (క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్టనర్ షిప్) ప్రకటించింది. క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్టనర్ షిప్ ఈ రోజు ప్రకటించిన కొత్త కార్యక్రమాలతో సహా అంటువ్యాధులు లేదా మహమ్మారి అవకాశం ఉన్న వ్యాధుల వ్యాప్తిని గుర్తించడానికి , ప్రతిస్పందించడానికి ఇండో-పసిఫిక్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో తన బాధ్యతలను నెరవేరుస్తోంది.
క్వాడ్ క్యాన్సర్ మూన్‌షాట్
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ వనరులతో క్వాడ్ చారిత్రాత్మక క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తోంది, ఇది మొదట గర్భాశయ క్యాన్సర్ పై దృష్టి సారించింది. మొత్తమ్మీద, ఈ రోజు ప్రకటించిన క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ రాబోయే దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని అంచనా.
మహమ్మారి సన్నద్ధత
మహమ్మారి నివారణ నిధికి నిరంతర మద్దతుతో సహా ఈ ప్రాంతం అంతటా ఆరోగ్య భద్రత , దృఢత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి క్వాడ్ దేశాలు కట్టుబడి ఉన్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని క్వాడ్ పునరుద్ఘాటించింది. 2024 లో, క్వాడ్ హెల్త్ సెక్యూరిటీ పార్టనర్షిప్ రెండవ మహమ్మారి సన్నద్ధత టేబుల్ టాప్ వ్యాయామం ద్వారా ప్రాంతీయ ప్రతిఘటన శక్తిని అభివృద్ధి చేసింది, క్వాడ్ వ్యాక్సిన్ భాగస్వామ్యం విజయంపై ఆధారపడి వ్యాధి వ్యాప్తి అవకాశాల నివారణ, ముందస్తు గుర్తింపు , ప్రతిస్పందనను పెంచడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అభివృద్ధి చేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం ప్రాంతీయ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇండో-పసిఫిక్ నుండి ఆరోగ్య నిపుణులకు శిక్షణ ఇవ్వడం క్వాడ్ సహకార ప్రయత్నాలలో ఒకటి.
మహమ్మారి సన్నద్ధతపై భారత్ ఒక వర్క్ షాప్ ను నిర్వహించి అత్యవసర ప్రజారోగ్య ప్రతిస్పందనలను వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయనుంది.
వ్యాధి వ్యాప్తికి ప్రతిస్పందనగా, దేశంలో లేదా ఈ ప్రాంతంలో మోహరించడానికి సిద్ధంగా ఉన్న ప్రజారోగ్య నిపుణుల సమూహాన్ని ఆస్ట్రేలియా పెంచుతోంది, రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియాలోని డార్విన్ లో మొదటి శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుంది.
క్వాడ్ భాగస్వాములతో సమన్వయంతో, అంటువ్యాధుల సవాళ్ళను నివారించడానికి, గుర్తించడానికి , ప్రతిస్పందించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పద్నాలుగు దేశాలతో భాగస్వామ్యం కోసం యునైటెడ్ స్టేట్స్ 84.5 మిలియన్ డాలర్లకు పైగా ప్రత్యేకించింది.
ఎంపాక్స్
ప్రస్తుత క్లేడ్ 1 ఎంపాక్స్ వ్యాప్తికి ప్రతిస్పందనగా, అలాగే కొనసాగుతున్న క్లేడ్ 2 ఎంపాక్స్ వ్యాప్తికి ప్రతిస్పందనగా, తక్కువ , మధ్య-ఆదాయ దేశాలలో తగిన వ్యాక్సిన్ తయారీని విస్తరించడంతో సహా సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యత-హామీ కలిగిన ఎంపాక్స్ వ్యాక్సిన్లకు సమాన లభ్యతను ప్రోత్సహించడానికి మన ప్రయత్నాలను సమన్వయం చేయాలని క్వాడ్ యోచిస్తోంది.
మానవతా సాయం, విపత్తు సాయం (హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్- హెచ్ ఎ డి ఆర్)
ఇరవయ్యేళ్ల క్రితం, క్వాడ్ 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ పై.స్పందించేందుకు ఒక్కటై ముందుకు వచ్చింది. ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించాయి. 2022లో, క్వాడ్ విదేశాంగ మంత్రులు ఇండో-పసిఫిక్‌లో హ్యూమన్ అండ్ డిసాస్టర్ రిస్పాన్స్ (హెచ్ ఎ డి ఆర్) కోసం క్వాడ్ భాగస్వామ్యానికి సంబంధించిన మార్గదర్శకాలపై సంతకాలు చేశారు. మే 2024 లో, పపువా న్యూ గినియాలో విషాదకరమైన కొండచరియలు విరిగిపడిన తరువాత, క్వాడ్ దేశాలు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ప్రతిస్పందనను సమన్వయం చేసుకున్నాయి. క్వాడ్ సంయుక్తంగా 5 మిలియన్ డాలర్లకు పైగా మానవతా సహాయాన్ని అందించింది. క్వాడ్ భాగస్వాములు పపువా న్యూ గినియా దీర్ఘకాలిక పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. క్వాడ్ హెచ్ ఎ డి ఆర్ సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భాగస్వాములకు వారి దీర్ఘకాలిక సుస్థిరత ప్రయత్నాలలో మద్దతు ఇస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సహాయక సామాగ్రిని సిద్ధంగా ఉంచడం సహా వేగంగా స్పందించడానికి సిద్ధంగా ఉండేలా క్వాడ్ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ ప్రయత్నం హిందూ మహాసముద్ర ప్రాంతం నుండి, ఆగ్నేయాసియా వరకు, పసిఫిక్ వరకు విస్తరించింది.
రాబోయే నెలల్లో, క్వాడ్ హెచ్ఎడిఆర్ నిపుణులు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో సంభవించే అవకాశం ఉన్న విపత్తులకు సిద్ధం చేయడానికి టేబుల్ టాప్ వ్యాయామం నిర్వహిస్తారు.
యాగి తుఫాను వినాశకరమైన పరిణామాల నేపథ్యంలో వియత్నాం ప్రజలకు మద్దతుగా క్వాడ్ భాగస్వాములు 4 మిలియన్ డాలర్లకు పైగా మానవతా సహాయం అందించడానికి కలిసి పనిచేస్తున్నారు.
సముద్ర భద్రత
క్వాడ్ భాగస్వాములు ఈ ప్రాంతంలోని భాగస్వామ్య దేశాలతో కలసి సముద్ర భద్రతను బలోపేతం చేయడం, సముద్ర పరిధి అవగాహనను మెరుగుపరచడం, స్వతంత్ర, ఓపెన్ ఇండో-పసిఫిక్‌ను కాపాడడంపై కలిసి పనిచేస్తున్నారు.
సముద్ర పరిధి (మారిటైమ్ డొమైన్) పై అవగాహన, సముద్ర వ్యవహారాలలో శిక్షణ (మారిటైమ్ ట్రైనింగ్) కోసం ఇండో-పసిఫిక్ భాగస్వామ్యం
టోక్యోలో జరిగిన 2022 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో సముద్ర పరిధి (మారిటైమ్ డొమైన్) పై అవగాహన కోసం ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాన్ని (ఇండో-పసిఫిక్ పార్ట నర్ షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ – ఐపీఎండీఏ) ను ప్రారంభించారు. ఈ చొరవ భాగస్వాములకు వాస్తవ కాల ఖర్చుతో కూడుకున్న అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ డేటాను అందిస్తుంది, ఇది వారి సముద్ర జలాల సమర్థ పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది; చట్టవిరుద్ధమైన, సమాచారం లేకుండా , నిబంధనలకు విరుద్ధంగా జరిగే చేపల వేటను నిరోధించడానికి , వాతావరణ మార్పులు , ప్రకృతి వైపరీత్యాలకు ప్రతిస్పందించడానికి , తమ చట్టాలను తమ జలాల పరిధిలో అమలు చేసేందుకు సహాయపడుతుంది.
ఈ ప్రకటన వెలువడినప్పటి నుండి, భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తరువాత, క్వాడ్ విజయవంతంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా- ఆగ్నేయాసియాలోని భాగస్వాములతో కలసి పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఫిషరీస్ ఏజెన్సీ ద్వారా, గురుగ్రాం లోని ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-హిందూ మహాసముద్ర ప్రాంతానికి విస్తరించింది. అలా చేయడం ద్వారా, క్వాడ్ రెండు డజన్ లకు పైగా దేశాలకు డార్క్ వెసెల్ మారిటైమ్ డొమైన్ అవగాహన డేటాను పొందడంలో సహాయపడింది, తద్వారా ఆ దేశాలు తమ ప్రత్యేక ఆర్థిక మండలాలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సహా ఇతర కార్యకలాపాలను మరింత మెరుగ్గా పర్యవేక్షించే వీలు కలిగింది.
ఈ రోజు ప్రకటించిన తదుపరి దశ అమలులో, క్వాడ్ రాబోయే సంవత్సరంలో క్వాడ్ కొత్త సాంకేతికత, డేటాను ఐపిఎండిఎ లో ప్రవేశపెట్టి, ఈ ప్రాంతానికి ఆధునిక సామర్థ్యాన్ని , సమాచారాన్ని అందించడం కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భాగస్వాములకు సముద్ర డొమైన్ అవగాహన పై స్పష్టమైన అవగాహన చిత్రం కోసం ఎలక్ట్రో-ఆప్టికల్ డేటా , అధునాతన విశ్లేషణ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించాలని క్వాడ్ భావిస్తోంది.
ఈరోజు క్వాడ్ ఒక కొత్త ప్రాంతీయ సముద్రాధారిత శిక్షణ కార్యక్రమం (మైత్రి ) ని ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భాగస్వామ్య దేశాలకు అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమం ద్వారా భాగస్వామ్య దేశాలు ఐ పి ఎం డి ఎ, ఇతర క్వాడ్ భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా అందించిన పరికరాలను పర్యవేక్షించడానికి, వారి జలాల రక్షణకు చట్టాలను అమలు చేయడానికి, అక్రమ ధోరణులను అడ్డుకోవడానికి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 2025 లో ప్రారంభ మైత్రి వర్క్ షాప్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలని క్వాడ్ దేశాలు ప్రతిపాదిస్తున్నాయి.
క్వాడ్ దేశాలు చట్టపరమైన, నిర్వహణ పరమైన సాంకేతిక పరమైన సముద్ర భద్రత , చట్టాల చట్ట అమలు పరిజ్ఞాన రంగాలలో సమగ్ర , సంపూర్ణ శిక్షణను సమన్వయం చేస్తున్నాయి. క్వాడ్ భాగస్వాములు ప్రాంతీయ సముద్ర చట్టాల అమలులో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పౌర సహకారాన్ని మెరుగుపరచడానికి నిబద్ధతను ప్రకటించారు.
ఇండో-పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్ వర్క్
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలపై పౌర ప్రతిస్పందనకు మరింత వేగంగా , సమర్థవంతంగా మద్దతు ఇవ్వడానికి నాలుగు దేశాల మధ్య భాగస్వామ్య విమాన రవాణా (ఎయిర్ లిఫ్ట్) సామర్థ్యాన్ని కొనసాగించడానికి , రవాణా పరంగా సమిష్టి బలాలను ఉపయోగించడానికి క్వాడ్ ఈ రోజు ఇండో-పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్ వర్క్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇండో-పసిఫిక్ భాగస్వాములతో ప్రస్తుతం ఉన్న ప్రయత్నాలకు ఈ చర్య మరింత తోడ్పడుతుంది.
తీర రక్షణ (కోస్ట్ గార్డ్) సహకారం
2025లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమగ్రతను మెరుగుపరచడానికి యుఎస్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి మొదటిసారిగా క్వాడ్-ఎట్-సీ షిప్ అబ్జర్వర్ మిషన్‌ను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రయత్నం ద్వారా, జపాన్ కోస్ట్ గార్డ్, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సభ్యులు ఇండో-పసిఫిక్‌లో పనిచేస్తున్న యుఎస్ కోస్ట్ గార్డ్ నౌకలో సమయం గడపనున్నారు. ఇండో-పసిఫిక్‌లో తదుపరి మిషన్ లను కొనసాగించాలని క్వాడ్ ఉద్దేశిస్తోంది.
నాణ్యమైన మౌలిక సదుపాయాలు
కనెక్టివిటీ పెంపు, ప్రాంతీయ సామర్థ్యాన్ని పెంపొందించడం , క్లిష్టమైన అవసరాలను తీర్చడానికి క్వాడ్ ఈ ప్రాంతానికి నాణ్యమైన, మన్నికైన మౌలిక సదుపాయాలను అందిస్తోంది.
ఈ సంవత్సరం, క్వాడ్ దేశాల ఎగుమతి పరపతి ఏజెన్సీలు (ఇసిఎలు) ఒక సహకార ఒప్పందంపై సంతకం చేసి అమలు చేస్తున్నాయి, ఇది సరఫరా యంత్రాంగం పటిష్టత, క్లిష్టమైన ,అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, ఇండో-పసిఫిక్ లోని ఇతర అధిక-నాణ్యత ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. క్వాడ్ ఈసిఏలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమాచారం పై కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం, ప్రాజెక్టుల కోసం అవసరమైన ఫైనాన్సింగ్‌ను అందించడం కోసం పని చేస్తున్నాయి. పరిశ్రమ నిపుణులు, ప్రాజెక్ట్ డెవలపర్లు, ఇతర ముఖ్యమైన మార్కెట్ వాటాదారులను కలిపే సామూహిక వ్యాపార ప్రోత్సాహ ప్రయత్నాలను పర్యవేక్షించనున్నాయి.
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి , అమలుకు సంబందించిన సంయుక్త నియమాలను క్వాడ్ విడుదల చేసింది, భాగస్వామ్య శ్రేయస్సు , సుస్థిర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది సమ్మిళిత, బహిరంగ , స్థిరమైన, న్యాయమైన, సురక్షితమైన, నమ్మదగిన, భద్రతగల డిజిటల్ భవిష్యత్తుకు క్వాడ్ నిబద్ధతను ప్రకటిస్తుంది.
విద్యుత్ రంగ సుస్థిరత్వాన్నిబలోపేతం చేయడంలో ఇండో-పసిఫిక్ ప్రాంత భాగస్వాములను శక్తివంతం చేయడానికి కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది.
భవిష్యత్తు భాగస్వామ్యం కోసం క్వాడ్ పోర్టులు
క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ పార్టనర్ షిప్- ఇండో పసిఫిక్ అంతటా స్థిరమైన , పటిష్టమైన నౌకాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాంతీయ భాగస్వాములతో కలసి క్వాడ్ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటుంది.
2025 లో మొట్టమొదటి ప్రాంతీయ నౌకాశ్రయాలు , రవాణా సమావేశాన్ని భారత దేశం లోని nముంబైలో నిర్వహించాలని క్వాడ్ భాగస్వాములు భావిస్తున్నారు.
ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా, క్వాడ్ భాగస్వాములు సమన్వయం, సమాచార మార్పిడి, ఈ ప్రాంతంలోని భాగస్వాములతో ఉత్తమ పద్ధతులను పంచుకోవడంద్వారా , ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా నాణ్యమైన నౌకాశ్రయ మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ , ప్రైవేట్ రంగ పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నారు.
క్వాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెలోషిప్
క్వాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెలోషిప్ ను క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సదస్సులో ప్రకటించారు, ఇది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి , మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణ , పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రాంతం అంతటా ప్రొఫెషనల్ నెట్ వర్క్ లను బలోపేతం చేస్తుంది. గత ఏడాదిలో, ఇది 2,200 మందికి పైగా నిపుణులకు విస్తరించింది క్వాడ్ భాగస్వాములు ఇప్పటికే 1,300 కంటే ఎక్కువ ఫెలోషిప్ లను అందించారు.
సముద్రగర్భ కేబుల్స్ , డిజిటల్ కనెక్టివిటీ
కేబుల్ అనుసంధానం, సుస్థిరత కోసం క్వాడ్ భాగస్వామ్యంతో, ఇండో-పసిఫిక్‌లో నాణ్యమైన సముద్ర గర్భ (అండర్ సీ) కేబుల్ నెట్‌వర్క్‌లకు క్వాడ్ భాగస్వాములు మద్దతు ఇస్తూ, వాటి సామర్థ్యం, దృఢత్వం , విశ్వసనీయత ను బలోపేతం చేస్తున్నారు. ఇవి ప్రపంచ భద్రత , శ్రేయస్సుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి.
ఈ ప్రయత్నాలకు మద్దతుగా, ఆస్ట్రేలియా గత జూలైలో కేబుల్ కనెక్టివిటీ అండ్ రెసిస్టెన్స్ సెంటర్ ను ప్రారంభించింది, ఇది ఈ ప్రాంతం అంతట నుంచి వచ్చిన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా వర్క్ షాప్ లను, విధాన , నియంత్రణ పరంగా సహాయాన్ని అందిస్తోంది.
,ప్రత్యేక ఏజెన్సీలు , అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇండో-పసిఫిక్‌లో కనెక్టివిటీ , స్థిరత్వాన్ని పెంచేందుకు జపాన్ సామర్థ్య పెంపు శిక్షణలను నిర్వహించింది. నౌరు, కిరిబాటిలో సముద్రగర్భ కేబుల్ కోసం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించాలని జపాన్ భావిస్తోంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 25 దేశాలకు చెందిన టెలికమ్యూనికేషన్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ లకు యునైటెడ్ స్టేట్స్ 1,300కు పైగా సామర్థ్య పెంపు శిక్షణలను నిర్వహించింది. కాంగ్రెస్ తో కలసి ఈ శిక్షణా కార్యక్రమాన్ని పొడిగించడానికి, విస్తరించడానికి అదనంగా $3.4 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని ఉద్దేశిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.
కేబుల్ ప్రాజెక్టులలో క్వాడ్ భాగస్వాముల పెట్టుబడులు 2025 చివరి నాటికి ప్రాధమిక టెలికమ్యూనికేషన్ కేబుల్ కనెక్టివిటీని సాధించడంలో అన్ని పసిఫిక్ ద్వీప దేశాలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి. గత క్వాడ్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం తరువాత క్వాడ్ భాగస్వాములు ఇతర అనుకూల భాగస్వాములతో కలిసి పసిఫిక్‌లో సముద్రగర్భ కేబుల్ నిర్మాణాలకు $140 మిలియన్లకు పైగా నిధులను ప్రకటించారు.
ఈ కొత్త సముద్ర గర్భ కేబుల్స్‌లో పెట్టుబడులకు తోడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్రగర్భ కేబుల్ నిర్వహణ, మరమ్మతు సామర్థ్యాల విస్తరణను పరిశీలించేందుకు భారత్ సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపట్టింది.
క్లిష్టమైన ,అభివృద్ధి చెందుతున్న సాంకేతికత
టెక్నాలజీ ఆవిష్కరణల ముందువరుసలో ఉండేందుకు క్వాడ్ సమన్వయంగా పనిచేస్తోంది. ఇండో-పసిఫిక్ అంతటా ప్రజల ప్రయోజనం కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించడానికి కట్టుబడి ఉంది. ఈ సాంకేతికతలను ఆర్థిక ప్రగతి, పారదర్శకత , కనెక్టివిటీని సులభతరం చేయడానికి ప్రవేశపెడుతోంది.
ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ (ఆర్ ఎ ఎన్ ) , 5జి
2023లో, క్వాడ్ భాగస్వాములు పసిఫిక్‌లోని పలౌలో, మొదటిసారిగా ఓపెన్ రాన్ (రేడియో యాక్సెస్ నెట్‌వర్క్) ప్రదేశాన్ని ప్రకటించారు, దీనిని సురక్షితమైన , స్థిరమైన , పరస్పర అనుసంధానంతో కూడిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించారు. అప్పటి నుండి, క్వాడ్ ఈ ప్రయత్నానికి సుమారు $20 మిలియన్లను కేటాయించింది. ఈ ప్రారంభానికి తోడుగా, నమ్మకమైన సాంకేతిక పరిష్కారాలను అందించడానికి ఓపెన్ రాన్ సహకారాన్ని విస్తరిస్తున్నట్టు క్వాడ్ ప్రకటించింది.
అమెరికా , జపాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతిపాదించినప్రారంభ $8 మిలియన్ల మద్దతు ఆధారంగా, ఫిలిప్పైన్స్‌లో జరుగుతున్న ఓపెన్ రాన్ ఫీల్డ్ ట్రయల్స్ , ఆసియా ఓపెన్ రాన్ అకాడమీ (ఎ ఒ ఆర్ ఎ )కి మద్దతును విస్తరించేందుకు క్వాడ్ ప్రణాళికలు రూపొందించింది.
ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఎ ఒ ఆర్ ఎ ను విస్తరించడానికి మద్దతుగా $7 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాలని అమెరికా యోచిస్తోంది, దక్షిణ ఆసియాలో భారతీయ సంస్థల భాగస్వామ్యంతో పెద్ద స్థాయిలో ఓపెన్ రాన్ వర్క్‌ఫోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా ఇందులో భాగం.
ఆగ్నేయాసియాలో అదనపు ఓపెన్ రాన్ ప్రాజెక్టులను అన్వేషించే అవకాశాన్ని క్వాడ్ భాగస్వాములు స్వాగతిస్తున్నారు.
దేశవ్యాప్త 5 జి మోహరింపు కోసం దేశం సంసిద్ధతను నిర్ధారించడానికి తువాలు టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్ తో కలిసి పనిచేయడాన్ని కూడా క్వాడ్ భాగస్వాములు అన్వేషించనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
2023 క్వాడ్ లీడర్స్ సదస్సులో ప్రకటించిన అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఎంపవరింగ్ నెక్స్ట్ జెన్ అగ్రికల్చర్ (ఎఐ- ఇ ఎన్ జి ఎ జి ఇ ) చొరవ ద్వారా, క్వాడ్ ప్రభుత్వాలు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, సెన్సింగ్ ను ఉపయోగించడానికి, వ్యవసాయ విధానాలను మార్చడానికి , ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా రైతులను శక్తివంతం చేయడానికి ప్రముఖ-ఎడ్జ్ సహకార పరిశోధనను ముమ్మరం చేస్తున్నాయి. సంయుక్త పరిశోధనల కోసం 7.5 మిలియన్ డాలర్ల నిధులను క్వాడ్ ప్రకటించింది. పరిశోధన సంఘాలను అనుసంధానించడానికి, భాగస్వామ్య పరిశోధన సూత్రాలను ముందుకు తీసుకెళ్లడానికి నాలుగు దేశాల సైన్స్ ఏజెన్సీల మధ్య సహకార ఒప్పందంపై ఇటీవల సంతకం చేయడాన్ని ప్రముఖంగా పేర్కొంది.
హిరోషిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్, జిపిఎఐ న్యూ ఢిల్లీ మినిస్టీరియల్ డిక్లరేషన్ 2023 , ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 78/625 ఫలితాలతో సహా సురక్షితమైన, సురక్షితమైన నమ్మదగిన కృత్రిమ మేధస్సు వ్యవస్థలను సాధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్ళవలసిన ప్రాముఖ్యతను క్వాడ్ గుర్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహణ వ్యవస్థల మధ్య పరస్పర సహకారంపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి క్వాడ్ ప్రయత్నిస్తోంది.
క్వాడ్ దేశాలు స్టాండర్డ్స్ సబ్ గ్రూప్ ద్వారా అంతర్జాతీయ ప్రామాణిక సహకారాన్ని ప్రోత్సహించడానికి ఏ ఐ , అడ్వాన్స్ డ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలపై రెండు ట్రాక్ 1.5 సంభాషణలను ప్రారంభించాయి.
క్వాడ్ దేశాలు, ప్రామాణికాల ఉపగ్రూప్ ద్వారా, ఏ ఐ అనుగుణ్యత అంచనా కోసం ఫ్రేమ్‌వర్క్‌లతో సహా అంతర్జాతీయ ప్రమాణీకరణ సహకారాన్ని ప్రోత్సహించేందుకు కృత్రిమ మేధ , ఆధునిక కమ్యూనికేషన్స్ టెక్నాలజీలపై రెండు ట్రాక్ 1.5 సంభాషణలను ప్రారంభించాయి,
బయోటెక్నాలజీ
క్వాడ్ భాగస్వాములు బయో ఎక్స్ ఫ్లోర్ చొరవ ను ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నారు – ఇది మొత్తం నాలుగు దేశాలలో జీవ పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి , విశ్లేషించడానికి కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించడానికి ప్రారంభ $2 మిలియన్ల నిధులతో కూడిన ఉమ్మడి ప్రయత్నం. వ్యాధిని నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి, ప్రతికూలతలను తట్టుకో గలి lగే పంటలను అభివృద్ధి చేయడానికి, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఇంకా ఎంతో సామర్ధ్యంతో కొత్త ఉత్పత్తులు , ఆవిష్కరణలను అందించడానికి జీవులలో కనిపించే వైవిధ్యమైన సామర్థ్యాలను కనుగొనడానికి , ఉపయోగించడానికి ఈ చొరవ సహాయపడుతుంది.
ఈ ప్రాజెక్ట్, క్వాడ్ , ప్రాంతం అంతటా బయోటెక్నాలజీలు , ఇతర క్రిటికల్ టెక్నాలజీలలో సుస్థిర, బాధ్యతాయుత, సురక్షిత , భద్రత గల సహకారాలను ప్రోత్సహించేందుకు రాబోయే క్వాడ్ పరిశోధన , అభివృద్ధి సహకారాల సూత్రాల పై కూడా ఆధారంగా ఉంటుంది.
సెమీకండక్టర్లు
సెమీకండక్టర్ సెమీకండక్టర్ సరఫరా శ్రేణుల వల్ల వచ్చే ప్రతికూలతలను (సప్లై చైన్ రిస్క్ ) పరిష్కరించేందుకు సహకారాన్ని సులభతరం చేయడానికి సెమీకండక్టర్ సప్లై చైన్స్ కంటింజెన్సీ నెట్ వర్క్ కోసం సహకార ఒప్పందాన్ని ఖరారు చేయడాన్ని క్వాడ్ నాయకులు స్వాగతించారు.
క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్
క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్‌వర్క్ (క్యు యు ఐ ఎన్) 2023 క్వాడ్ నాయకుల సదస్సులో ప్రారంభించిన ఒక లాభాపేక్ష లేని కార్యక్రమం. క్వాడ్ భాగస్వామ్య విలువలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, ప్రాంతీయ సుస్థిరత ను ప్రోత్సహించే ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి క్వాడ్ దేశాల నుండి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు , ప్రభుత్వ సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతం అంతటా కీలకమైన , అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులను వేగవంతం చేయడం క్విన్ లక్ష్యం. కీలకమైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో క్వాడ్ అంతటా పది ప్రధాన వ్యూహాత్మక పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఈ ఏడాది క్విన్ మద్దతు ఇచ్చింది.
టోక్యోలో స్టార్టప్ క్యాంపస్‌ను రూపొందించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేయడంతో సహా, కొత్త టెక్నాలజీల అభివృద్ధిని ప్రోత్సహించడానికి అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ల కోసం పెట్టుబడి భాగస్వామ్యాలను సులభతరం చేయడానికి క్విన్ అదనపు ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేసింది, దీనికి క్విన్ తో పాటు చిబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్.సెంటర్ మద్దతు కూడా ఉంది.
టోక్యో విశ్వవిద్యాలయం, ఈశాన్య విశ్వవిద్యాలయం, భాగస్వామ్యం తో టోక్యోలో కొత్త వెంచర్ యాక్సిలరేటర్‌ను స్థాపించడానికి కూడా క్విన్ పని చేస్తోంది. ఈ భాగస్వామ్యాలు సాంకేతిక పురోగతికి ఉత్తేజం ఇవ్వడమే గాక క్వాడ్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేస్తాయి, మరింత సమగ్రమైన , సుస్థిరంగా ఉండే ఇండో-పసిఫిక్ ప్రాంతానికి దోహదపడతాయి.
చివరిగా, క్విన్ ఒక క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అభివృద్ధి చేసింది, ఇది ఈ సంవత్సరం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రతి క్వాడ్ దేశం క్వాంటమ్ పర్యావరణ వ్యవస్థలు సమిష్టిగా మూలధనం , నైపుణ్యాన్ని పొందడానికి కలిసి పనిచేయగల మార్గాలను సూచించారు.
వాతావరణం – స్వచ్ఛ ఇంధనం
ప్రపంచానికి, ఇండో-పసిఫిక్కు , ముఖ్యంగా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ద్వీప దేశాలకు వాతావరణ మార్పుల అస్తిత్వ ముప్పును క్వాడ్ గుర్తించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి , స్వీకరించడానికి ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటోంది. వాతావరణ మార్పు ప్రభావాలు స్వచ్ఛమైన ఇంధన ఆవిష్కరణ , స్వీకరణను ప్రోత్సహిస్తాయి . ఇంకా స్థిరమైన అభివృద్ధికి తోడ్పడతాయి.
వాతావరణ అనుసరణ
తన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, క్లైమేట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇనిషియేటివ్ (సి ఐ ఎస్)ని విస్తరించాలని క్వాడ్ భావిస్తోంది. ఇది పసిఫిక్ ద్వీప దేశాల అధిక-నాణ్యత వాతావరణ సమాచారం, సేవల లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాతావరణ మార్పు , దాని ప్రభావాలకు సిద్ధం చేయడానికి , ప్రతిస్పందించడానికి భాగస్వాముల సామర్థ్యాన్ని పెంచుతుంది.
స్థానిక వాతావరణం , వాతావరణ సూచనలకు మద్దతు ఇవ్వడానికి 2025 లో పసిఫిక్ కు 3 డి-ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను అందించాలని అమెరికా యోచిస్తోంది . ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి , మోహరించడానికి ఒక ప్రాంతీయ కేంద్రాన్ని నిర్వహించే లక్ష్యంతో ఫిజీలోని నిపుణులకు శిక్షణ ఇస్తోంది.
2021 లో పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం నాయకుల మద్దతుతో పసిఫిక్ నేతృత్వంలోని వెదర్ రెడీ పసిఫిక్ అనే ఆవిష్కరణ ద్వారా ఆస్ట్రేలియా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది, ఇది పసిఫిక్ లో EWS4ALL ఐక్యరాజ్యసమితి చొరవ EWS4ALL ను ముందుకు నడిపిస్తుంది .
జపాన్ కూడా ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విపత్తు ప్రమాదాల తగ్గింపు, సంసిద్ధతను బలోపేతం చేయడం , సామర్థ్య పెంపు , పునరుత్పాదక శక్తి ని అందించడం ద్వారా స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం వంటి విధానాలను అమలు చేస్తూ, తన “పసిఫిక్ క్లైమేట్ రెసిస్టెన్స్ ఇనిషియేటివ్” కింద పసిఫిక్ ద్వీప దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోంది.
ఆకస్మిక వరదలను సమర్థంగా పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, సకాలంలో , ఖచ్చితమైన హెచ్చరికల కోసం, ఆకస్మిక వరదల నుండి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడానికి కిరిబాటి, సమోవా, సోలమన్ దీవులు, టోంగా , వనాటులోని నిపుణులకు శిక్షణ ఇవ్వాలని క్వాడ్ యోచిస్తోంది.
స్వచ్ఛ ఇంధనం
సామూహిక ఇంధన భద్రతను పెంపొందించడానికి, ఈ ప్రాంతం అంతటా కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి , ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ అంతటా స్థానిక కార్మికులు , సమూహాలకు ప్రయోజనం చేకూర్చే అధిక-నాణ్యత, వైవిధ్యమైన స్వచ్ఛమైన ఇంధన సరఫరా వ్యవస్థలను సృష్టించడానికి విధానాలు, ప్రోత్సాహకాలు, ప్రమాణాలు , పెట్టుబడులను సమీకరించడానికి సహకారాన్ని బలోపేతం చేయాలని క్వాడ్ దేశాలు భావిస్తున్నాయి.
అనుబంధ , భాగస్వామ్య స్వచ్ఛ ఇంధన సరఫరా వ్యవస్థలలో పరిపూరకరమైన , అధిక-ప్రామాణిక ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించాలన్న నిబద్ధతను అమలు చేయడానికి తగిన విధానం, నిధులతో క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తాయి. బ్యాటరీ సరఫరా గొలుసు అంతటా క్వాడ్ భాగస్వాములు పంచుకునే ప్రత్యేకమైన సామర్థ్యాలను మేము గమనించాము . మా పరిశ్రమలలో ఖనిజ ఉత్పత్తి, రీసైక్లింగ్ , బ్యాటరీ తయారీని బలోపేతం చేయడంపై దగ్గరగా దృష్టి పెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
క్వాడ్ నాయకులు గత సంవత్సరం ‘క్వాడ్ క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్‘ ను ప్రకటించారు, ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షితమైన , వైవిధ్యమైన క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్ ప్యానెల్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ , బ్యాటరీ సరఫరా గొలుసులను అభివృద్ధి చేసే , వైవిధ్యపరిచే ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా నవంబర్ లో క్వాడ్ క్లీన్ ఎనర్జీ సప్లై చైన్స్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇండో-పసిఫిక్ సమిష్టి ఇంధన భద్రత, ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడం లోనూ, నికర సున్నా భవిష్యత్తుకు మార్పు చెందడంలోనూ సురక్షితమైన, వైవిధ్యభరితమైన స్వచ్ఛమైన ఇంధన సరఫరా వ్యవస్థలు అంతర్భాగం.
ఫిజీ, కొమొరోస్, మడగాస్కర్, సీషెల్స్ లో కొత్త సోలార్ ప్రాజెక్టులపై 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత్ కట్టుబడి ఉంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో 122 మిలియన్ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు గ్రాంట్లు, రుణాలకు జపాన్ కట్టుబడి ఉంది.
భారతదేశంలో సొలార్ సెల్ తయారీ కేంద్రం నిర్మించడానికి టాటా పవర్ సోలార్‌కు $250 మిలియన్ల రుణాన్ని, సొలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి , నిర్వహించడానికి ఫస్ట్ సోలార్‌కు $500 మిలియన్ల రుణాన్ని అమెరికా డి ఎఫ్ సి ద్వారా అందించింది. అలాగే, సామర్థ్యాన్ని పెంచడానికి , సరఫరా శ్రేణులను విభజించడానికి సొలార్, గాలి, శీతలీకరణ, బ్యాటరీలు , కీలక ఖనిజాలకు ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించేందుకు అవకాశాలను అన్వేషించడం కొనసాగిస్తోంది.
విద్యుత్ గ్రిడ్ పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వాతావరణ ప్రభావిత సమాజాలను అనుమతించడానికి చౌకైన, అధిక-సామర్థ్యం, శీతలీకరణ వ్యవస్థల మోహరింపు, తయారీతో సహా ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి క్వాడ్ ఒక చొరవను ప్రకటించింది. ఇందుకోసం సాంకేతిక సహాయం కింద 1.25 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించాలని అమెరికా భావిస్తోంది.
సైబర్ భద్రత
క్వాడ్ దేశాలు , భాగస్వాములకు మరింత సుస్థిర , సు రక్షితమైన , సానుకూల సైబర్ భద్రతా వాతావరణాన్ని నిర్మించడానికి క్వాడ్ దేశాలు కలసి పని చేస్తున్నాయి.
భవిష్యత్ డిజిటల్ కనెక్టివిటీ, ప్రపంచ వాణిజ్యం, శ్రేయస్సు కోసం క్వాడ్ భాగస్వామ్య దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి, క్వాడ్ వాణిజ్య అండర్ సీ టెలికమ్యూనికేషన్స్ కేబుల్స్ ను రక్షించడానికి క్వాడ్ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేసి / విడుదల చేసింది.
సాఫ్ట్‌వేర్ తయారీదారులు, పరిశ్రమ వాణిజ్య సమూహాలు, పరిశోధన కేంద్రాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని , క్వాడ్ 2023 సెక్యూర్ సాఫ్ట్‌వేర్ జాయింట్ సూత్రాలలో ఆమోదించిన సురక్షిత సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రమాణాలు , సర్టిఫికేషన్‌ను అమలు చేయడంపై క్వాడ్ నిబద్ధతను విస్తరించేందుకు క్వాడ్ దేశాలు కృషి చేస్తున్నాయి.
క్వాడ్ భాగస్వాములు, ప్రభుత్వ నెట్‌వర్క్‌ల కోసం సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కొనుగోలు, అంతిమ వినియోగం మరింత సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రమాణాలను సమన్వయించేందుకు పనిచేస్తారు, అలాగే, సరఫరా శ్రేణులు, డిజిటల్ ఆర్థికతలు, సమాజాల సైబర్ స్థిరత్వం సామూహికంగా మెరుగవుతాయని నిర్ధారిస్తారు.
ఈ సమయంలో, ప్రతి క్వాడ్ దేశం బాధ్యతాయుతమైన సైబర్ పర్యావరణ వ్యవస్థలు, ప్రజా వనరులు, సైబర్ సెక్యూరిటీ అవగాహనను ప్రోత్సహించే వార్షిక క్వాడ్ సైబర్ ఛాలెంజ్ ను జరుపుకునేందుకు కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళికలు వేసింది. ఈ సంవత్సరపు సైబర్ ఛాలెంజ్ ప్రచారాలు, ఈ వేగంగా పెరుగుతున్న రంగంలో మహిళలు సహా గ్లోబల్ సైబర్ భద్రతా నిపుణుల సంఖ్యను , వైవిధ్యాన్ని పెంచేందుకు కెరీర్ ను నిర్ణయించే కార్యక్రమాలను నిర్వహించడం పై దృష్టి సారిస్తాయి. గత సంవత్సరపు క్వాడ్ సైబర్ ఛాలెంజ్ లో ఇండో-పసిఫిక్ ప్రాంతం నుంచి 85,000 కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు.
క్వాడ్ సైబర్ బూట్ క్యాంప్ , ఫిలిప్పీన్స్ లో సైబర్ సామర్థ్య నిర్మాణంపై అంతర్జాతీయ సదస్సు వంటి సామర్థ్యాన్ని పెంపొందించే ప్రాజెక్టులు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైబర్ భద్రత , శ్రామిక శక్తి అభివృద్ధిని పెంపొందించడానికి ముఖ్యమైన చొరవలు.
జాతీయ భద్రతకు , కీలకమైన మౌలిక సదుపాయాల వ్యవస్థల రక్షణకు ఉన్న ముప్పు ను గుర్తించడానికి, తగ్గించడానికి క్వాడ్ ఉమ్మడి ప్రయత్నాలను చేపడుతోంది. భాగస్వామ్య ప్రాధాన్యతలను ప్రభావితం చేసే ముఖ్యమైన సైబర్ భద్రతా సంఘటనలపై సైబర్ ముప్పు సమాచారాన్ని పంచుకోవడానికి విధాన పరమైన ప్రతిస్పందనలతో సహా మరింత సన్నిహితంగా సమన్వయం చేస్తుంది.
dushpracharaaniki కౌంటర్ ఇన్‌ఫర్మేషన్
మీడియా స్వేచ్ఛకు మద్దతివ్వడం ద్వారా మరియు అంతర్జాతీయ సమాజంలో విశ్వాసాన్ని దెబ్బతీసే మరియు అసమ్మతిని కలిగించే తప్పుడు సమాచారంతో సహా విదేశీ సమాచార తారుమారు మరియు జోక్యాన్ని పరిష్కరించడం ద్వారా క్వాడ్ తన కౌంటర్ ఇన్‌ఫర్మేషన్ వర్కింగ్ గ్రూప్‌తో సహా స్థితిస్థాపకమైన సమాచార వాతావరణాన్ని పెంపొందించడానికి కలిసి పనిచేస్తోంది.
తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం
మీడియా స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడం ద్వారా, అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని బలహీన పరచి, విబేధాలు సృష్టించే తప్పుడు సమాచారంతో సహా విదేశీ సమాచారాన్ని తారుమారు చేయడాన్ని , జోక్యాన్ని పరిష్కరించడం ద్వారా క్వాడ్ తన కౌంటర్ డిస్ ఇన్ఫర్మేషన్ వర్కింగ్ గ్రూప్ ద్వారా వాస్తవ సమాచార వాతావరణాన్ని పెంపొందించడానికి కలిసి పనిచేస్తోంది,
ప్రజల మధ్య సంబంధాలు
క్వాడ్ దేశాలు తమ ప్రజల మధ్య శాశ్వత సంబంధాలను నిర్మిస్తున్నాయి. క్వాడ్ దేశాల వాటాదారులు సైబర్ భద్రత, కీలక , అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల కోసం కార్మిక శక్తి అభివృద్ధి, స్టెమ్ లో మహిళలు, ప్రభుత్వ పారదర్శకత , బాధ్యత, తప్పు దోవ పట్టించడాన్ని నివారించడం, ప్రాంతీయ సముద్ర వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సందర్శకుల నాయకత్వ కార్యక్రమం (ఐవిఎల్.పి )లోనూ, ఇతర పరస్పర మార్పిడీ కార్యక్రమాల లోనూ పాల్గొన్నారు.
క్వాడ్ ఫెలోషిప్
క్వాడ్ ఫెలోషిప్ అమలుకు నాయకత్వం వహిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తో కలిసి, క్వాడ్ ప్రభుత్వాలు క్వాడ్ ఫెలోస్ రెండవ బృందాన్ని స్వాగతించాయి. ఆసియాన్ దేశాలకు చెందిన విద్యార్థులను మొదటిసారిగా చేర్చే కార్యక్రమాన్ని విస్తరించాయి. క్వాడ్ ఫెలోలు జపాన్ లో చదువుకునేందుకు వీలు కల్పించే కార్యక్రమానికి జపాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. గూగుల్, ప్రాట్ ఫౌండేషన్ , వెస్ట్రన్ డిజిటల్ తో సహా ఫెలోల తదుపరి బృందానికి ప్రైవేట్ రంగ భాగస్వాముల ఉదార మద్దతును క్వాడ్ స్వాగతించింది.
అంతర్జాతీయ విద్యా సంస్థ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ) ఆధ్వర్యంలో అక్టోబర్ లో వాషింగ్టన్ డీసీలో జరిగే క్వాడ్ ఫెలోషిప్ సమ్మిట్ కోసం క్వాడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రజల మధ్య అదనపు కార్యక్రమాలు
భారత ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థలో 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ను అభ్యసించడానికి ఇండో-పసిఫిక్ కు చెందిన విద్యార్థులకు 500,000 డాలర్ల విలువైన యాభై క్వాడ్ స్కాలర్షిప్ లను అందించడానికి భారతదేశం కొత్త చొరవను ప్రకటించింది.
అంతరిక్షం
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అంతరిక్ష సంబంధిత అనువర్తనాలు, సాంకేతిక పరిజ్ఞానాల ముఖ్యమైన సహకారాన్ని క్వాడ్ గుర్తించింది. వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి , తీవ్రమైన వాతావరణ సంఘటనల ప్రభావాలను మెరుగ్గా నిర్వహించడానికి ఇండో-పసిఫిక్ అంతటా ఉన్న దేశాలకు సహాయపడటానికి ఎర్త్ అబ్జర్వేషన్ డేటా , ఇతర అంతరిక్ష సంబంధిత అనువర్తనాలను అందించడం కొనసాగించాలని నాలుగు దేశాలు యోచిస్తున్నాయి.
మారిషస్ కోసం అంతరిక్ష ఆధారిత వెబ్ పోర్టల్ ను భారతదేశం ఏర్పాటు చేయడాన్ని క్వాడ్ స్వాగతించింది.ఇది తీవ్ర విపరీత వాతావరణ సంఘటనలు, వాతావరణ ప్రభావం పై అంతరిక్ష ఆధారిత పర్యవేక్షణ కోసం ఓపెన్ సైన్స్ భావనకు మద్దతు ఇచ్చేందుకు ఈ పోర్టల్ ను ఏర్పాటు చేశారు.
అంతరిక్ష పరిస్థితుల అవగాహన చొరవ
అంతరిక్ష పరిస్థితుల అవగాహన (ఎస్ ఎస్ ఎ)లో తమ నైపుణ్యాలు అనుభవాలను పంచుకోవాలని క్వాడ్ భాగస్వాములు ఉద్దేశిస్తున్నారు, ఇది అంతరిక్ష పరిసరాల దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. బాహ్య అంతరిక్షంలో శకలాలు ఢీ కొనడాన్ని నివారించడానికి, అవశేషాల తొలగింపునకు సహాయపడటంతో సహా సహకారం, పౌర రంగంలో అంతరిక్ష ట్రాఫిక్ సమన్వయ సామర్థ్యాలను వినియోగించుకోవడంపై దృష్టి సారించడం ఎస్ ఎస్ ఎ లక్ష్యంగా ఉంది,
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా..
క్వాడ్ 2023లో తన మొదటి కౌంటర్ టెర్రరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించింది ఉగ్రవాద బెదిరింపులు, కార్యకలాపాలను నిరోధించడానికి కలిసి పని చేసే మార్గాల గురించి చర్చించడానికి ఈ వర్కింగ్ గ్రూప్ ఏటా సమావేశమవుతోంది. క్వాడ్ కౌంటర్ టెర్రరిజం వర్కింగ్ గ్రూప్ (సిటిడబ్ల్యుజి)! ప్రస్తుతం మానవరహిత వైమానిక వ్యవస్థలు (సి-యుఎఎస్), రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ పరికరాలు (సిబిఆర్ఎన్) ,ఇంటర్నెట్ ను ఉగ్రవాద ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టింది. క్వాడ్ సిటిడబ్ల్యుజి దేశాలు సహకరించుకోదగిన ఉగ్రవాద నిరోధక నూతన పద్ధతులపై చర్చిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఉత్తమ పద్ధతులపై సాంకేతిక వర్క్ షాప్ లను నిర్వహిస్తోంది. క్వాడ్ నెలకొల్పిన ఉగ్రవాద వ్యతిరేక నైపుణ్యంతో క్వాడ్ లో లేని సభ్యులను కలుపుకునే మార్గాలను అన్వేషిస్తోంది.
*****
Glad to have met Quad Leaders during today’s Summit in Wilmington, Delaware. The discussions were fruitful, focusing on how Quad can keep working to further global good. We will keep working together in key sectors like healthcare, technology, climate change and capacity… pic.twitter.com/xVRlg9RYaF
— Narendra Modi (@narendramodi) September 22, 2024
PM @narendramodi participated in the Quad Leaders' Summit alongside @POTUS @JoeBiden of the USA, PM @kishida230 of Japan and PM @AlboMP of Australia.
— PMO India (@PMOIndia) September 22, 2024
During the Summit, the Prime Minister reaffirmed India's strong commitment to Quad in ensuring a free, open and inclusive… pic.twitter.com/TyOti2Rbc9