Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాషిమ్‌లో సుమారు రూ. 23,300 కోట్ల విలువైన వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారుఉదయం 11:15 గంటలకు వాషిమ్ లోని జగదాంబ మాత ఆలయానికి చేరుకుని, పోహరాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం వాషిమ్‌లోని సంత్ సేవాలాల్ మహారాజ్సంత్ రామ్‌రావ్ మహారాజ్ సమాధి వద్ద నివాళులర్పిస్తారుఆ తర్వాతఉదయం 11:30 గంటలకుబంజారాల వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారుమధ్యాహ్నం 12 గంటలకు దాదాపు రూ.23,300 కోట్ల విలువైన వ్యవసాయపశుసంవర్ధక రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారుసాయంత్రం గంటలకుథానేలో రూ. 32,800 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవంశంకుస్థాపన చేస్తారుఆ తర్వాత దాదాపు సాయంత్రం గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ కు వెళతారుముంబయి బీకేసీ నుండి ఆరే జేవీఎల్ఆర్ స్టేషన్ల మధ్య నడిచే మెట్రో రైలును ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రూజ్ వరకూ మెట్రోలో ప్రయాణించనున్నారు.

వాషిమ్‌లో పీఎం

రైతుల సాధికారత కోసం తన నిబద్ధతకు అనుగుణంగాపీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతలో భాగంగా ప్రధానమంత్రి సుమారు రూ. 20,000 కోట్లను దాదాపు 9.4 కోట్ల మంది రైతులకు పంపిణీ చేస్తారు. 18వ విడత విడుదలతోపీఎంకిసాన్ కింద రైతులకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ.3.45 లక్షల కోట్లునమో షెత్కారీ మహాసన్మాన్ నిధి యోజన 5వ విడత కింద ప్రధానమంత్రి సుమారు రూ. 2,000 కోట్లను సుమారు 9.4 కోట్ల మంది రైతులకు పంపిణీ చేస్తారు.

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్కింద రూ.1,920 కోట్ల విలువైన 7,500కు పైగా ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారుప్రధాన ప్రాజెక్టుల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లుప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లుగోదాములుసార్టింగ్గ్రేడింగ్ యూనిట్లుకోల్డ్ స్టోరేజీ నిర్మాణంపంట అనంతర యాజమాన్య పథకాలూ ఉన్నాయి.

దాదాపు రూ. 1,300 కోట్ల వార్షికాదాయం ఉన్న 9,200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పిఓప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు.

ఇంకాప్రధాన మంత్రి పశువుల కోసం యూనిఫైడ్ జీనోమిక్ చిప్‌నుస్వదేశీ లింగవిభజన చేసిన సెమన్ టెక్నాలజీని ప్రారంభిస్తారుఈ చొరవ రైతులకు సరసమైన ధరలో లింగపరంగా క్రమబద్ధీకరించిన వీర్య లభ్యతను పెంచడంఒక్కో మోతాదుకు దాదాపు రూ. 200 ఖర్చు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందిజన్యుసేవలను అందించేందుకు దేశీయ పశువుల కోసం యూనిఫైడ్ జీనోమిక్ చిప్గౌచిప్అలాగేగేదెల కోసం మహిష్‌ చిప్ వంటివి అభివృద్ధి చేశారుజన్యు ఎంపిక కారణంగా అధికనాణ్యత ఎద్దులను చిన్న వయస్సులోనే గుర్తించవచ్చు.

ఇంకాముఖ్యమంత్రి సౌర్ క్రిషి వాహిని యోజన – 2.0 కింద ఏర్పాటు చేసిన 19 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు సోలార్ పార్కులను జాతికి అంకితం చేస్తారుముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన పథకం లబ్ధిదారులను కూడా ఆయన సన్మానిస్తారు.

థానేలో పీఎం

ఈ ప్రాంతంలో పట్టణ చైతన్యాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రధానమంత్రి కీలకమైన మెట్రోరోడ్డు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేస్తారుదాదాపు రూ. 14,120 కోట్ల విలువైన ముంబయి మెట్రో లైన్-3లోని బీకేసీ నుండి ఆరే జీవీఎల్ఆర్ భాగాన్ని ప్రధాని ప్రారంభిస్తారుఈ విభాగంలో 10 స్టేషన్లు ఉంటాయివీటిలో భూగర్భంలో ఉంటాయిముంబయి మెట్రో లైన్ – 3 అనేది ముంబయి నగరంశివారు ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మెరుగుపరిచే కీలకమైన ప్రజా రవాణా పథకంపూర్తిగా పని చేస్తేలైన్-3 రోజుకు దాదాపు 12 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుందని అంచనా.

దాదాపు రూ.12,200 కోట్లతో నిర్మించనున్న థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 20 ఎలివేటెడ్, 2 భూగర్భ స్టేషన్లతో ప్రాజెక్ట్ మొత్తం పొడవు 29 కి.మీఈ ప్రతిష్ఠాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మహారాష్ట్రలోని ప్రధాన పారిశ్రామికవాణిజ్య కేంద్రమైన థానేలో పెరుగుతున్న రవాణా అవసరాలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.

దాదాపు రూ. 3,310 కోట్ల విలువైన ఛేదా నగర్ నుండి ఆనంద్ నగర్థానే వరకు ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే ఎక్స్‌టెన్షన్‌కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్ట్ దక్షిణ ముంబయి నుండి థానేకి ఎటువంటి ఇబ్బందీలేని అనుసంధానాన్ని అందిస్తుంది.

ఇంకాదాదాపు రూ. 2,550 కోట్ల విలువైన నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా (NAINA) ప్రాజెక్ట్ ఫేజ్-1కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారుఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన రహదారుల నిర్మాణంవంతెనలుఫ్లై ఓవర్లుఅండర్‌పాస్‌లుప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే సమీకృత మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

దాదాపు రూ.700 కోట్లతో నిర్మించనున్న థానే మున్సిపల్ కార్పొరేషన్‌కు నూతన భవనానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారుఆకాశహర్మ్యంలా నిర్మించనున్న ఈ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో అన్ని మునిసిపాలిటీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా థానే పౌరులకు అనేక ప్రయోజనాలను అందించినట్లవుతుంది.

 

***