వారణసీ లోని దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.
ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల నుండి నేరుగా సభాస్థలి కి తరలివచ్చిన ప్రధాన మంత్రి 55 అవుట్లెట్ ల ప్రారంభానికి గుర్తు గా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అవుట్ లెట్ లు ఆ ప్రాంతం లో హస్త కళల కు అంకితం చేసిన ఒక భవన సముదాయం అయినటువంటి హస్తకళా సంకుల్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ గా పని చేయనున్నాయి.
దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ లో యాంఫిథియేటర్ కు చేరుకొనే ముందు టెక్స్టైల్స్ మ్యూజియమ్ లో వివిధ గేలరీ ల గుండా ప్రధాన మంత్రి నడచి వచ్చారు.
ఇక్కడ రెండు పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఆ పుస్తకాల పేర్లు .. ఒకటోది- కాశీ: ద యూనివర్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్. కాగా, రెండోది- ఇండియన్ టెక్స్టైల్స్: హిస్టరీ , స్ల్పెండర్, గ్రాండ్ యర్.
ఆయన వారాణసీ లోని చౌకాఘాట్ లో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ఆఫీస్ కాంప్లెక్స్ ప్రారంభ సూచకం గా ఒక ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు.
**