Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వార‌ణాసిలోని బెనారస్ హిందూ యూనివ‌ర్సిటీ శ‌త‌ సంవ‌త్స‌ర స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

వార‌ణాసిలోని బెనారస్ హిందూ యూనివ‌ర్సిటీ శ‌త‌ సంవ‌త్స‌ర స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలోని బెనారస్ హిందూ యూనివ‌ర్సిటీ శ‌త‌ సంవ‌త్స‌ర స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు.

యూనివ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హామ‌న మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లిని ఘ‌టించారు. శ్రీ మాల‌వీయ‌ను ఒక దార్శ‌నికుడ‌ని ఆయ‌న‌ అభివ‌ర్ణించారు. దేశ నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన అంకిత భావం గ‌ల‌, విజ్ఞాన‌వంతులైన‌, విలువ‌ల‌తో కూడిన స‌మ‌ర్ధులైన ప్ర‌జ‌ల‌ను త‌యారు చేయాల‌ని శ్రీ మాల‌వీయ ఆకాంక్షించార‌న్నారు.

స్నాత‌కోత్స‌వాన్ని చ‌దువు పూర్తి అయిన ఘ‌ట్టంగా భావించ‌కూడ‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఒక వ్య‌క్తిలోప‌లి విద్యార్థిని ఎల్ల‌ప్ప‌టికీ స‌జీవంగా ఉంచుకోవాలి అని ఆయ‌న చెప్పారు.

విద్యార్థులు ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లో సైతం స‌మ దృష్టితో మెల‌గాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. దేశం, ప్ర‌పంచం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి త‌గిన న‌వ క‌ల్ప‌న‌ల‌ను విద్యార్థులు ఆవిష్క‌రించాలి అని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సికిల్ సెల్ అనీమియా, భూ తాపం, సౌర శ‌క్తిల‌ను ఉదాహ‌రించారు.

స‌మీప ప్రాంతాల‌లోని ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని పాఠ‌శాల‌ల విద్యార్థులు కూడా ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. వారిని ప్ర‌ధాన మంత్రి త‌న‌ ప్ర‌త్యేక అతిథులుగా ప్ర‌స్తావించారు. ఆ విద్యార్థుల‌తో ప‌త‌కాలు గెలిచిన వారు సంభాషించాల‌ని, ఇలా చేయ‌డం వ‌ల్ల వారు కూడా ఏదైనా సాధించాల‌న్న స్ఫూర్తిని అల‌వ‌ర‌చుకొంటార‌న్నారు.