ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారాణసీ లో వేరు వేరు అభివృద్ధి పథకాలకు ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోత్సవం/ కొన్ని అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి వారాణసీ లో ఈ రోజున 220 కోట్ల రూపాయల విలువైన 16 పథకాలను ప్రారంభించారు. 400 కోట్ల రూపాయల విలువైన 14 పథకాల పనులు ఇప్పటికే మొదలయ్యాయని ఆయన వెల్లడించారు.
ఈ రోజున ప్రారంభించిన పథకాల లో సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో, రామ్ నగర్ లోని లాల్ బహాదుర్ శాస్త్రి ఆసుపత్రి ఉన్నతీకరణ, మురుగునీటి పారుదలకు సంబంధించిన పనులు, గోవుల సంరక్షణ, గోవుల పరిరక్షణకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాలు, బహుళ ప్రయోజనార్థ విత్తన నిలవ కేంద్రం, 100 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన వ్యవసాయోత్పత్తుల గిడ్డంగి, ఐపిడిఎస్ రెండో దశ, సంపూర్ణానంద్ స్టేడియమ్ లో క్రీడాకారులకు ఒక భవన సముదాయం, వారాణసీ నగరంలో ఆర్షణీయమైన విద్యుద్దీపాల వ్యవస్థల తో పాటు, 105 ఆంగన్‌వాడీ కేంద్రాలు, మరో 102 గౌ ఆశ్రయ కేంద్రాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వారాణసీ నగర పరిసరాల అభివృద్ధి ప్రణాళిక లో పర్యటన సదుపాయాలు కూడా ఒక భాగంగా ఉన్నాయన్నారు. ఈ అభివృద్ధి గంగానది శుద్ధి, ఆరోగ్యసేవలు, రహదారులు, మౌలికసదుపాయాల కల్పన, పర్యటన, విద్యుత్తు, యువత, క్రీడలు, రైతు లోకం.. మొదలైన ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి ఏ విధంగా జోరు అందుకొన్నదీ సూచించే ఒక ఉదాహరణగా ఉందని ఆయన అన్నారు. ఈ రోజు గంగా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంటు పథకం పునర్ నవీకరణ పూర్తయిందని ఆయన ప్రకటించారు. స్నాన ఘట్టాలను సుందరీకరించడం, కాలుష్యాన్ని తగ్గించడం కోసం సిఎన్‌జి ని పరిచయం చేయడం, దశాశ్వమేథ్ ఘాట్ లో టూరిస్టు ప్లాజా వంటి మౌలిక సదుపాయాల సంబంధిత పనులు వారాణసీ లో చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు.
గంగానది కి సంబంధించిన ఈ ప్రయత్నాలు కాశీ తాలూకు ఒక సంకల్పమే కాకుండా, కాశీ కోసం నూతన అవకాశాల బాటను పరచడం కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడి స్నానఘట్టాల లో స్థితిగతులు క్రమంగా మెరుగు పడుతున్నాయన్నారు. గంగానది స్నాన ఘట్టాల శుద్ధి, సుందరీకరణ తో పాటే సారనాథ్ కూడా ఒక కొత్త రూపును సంతరించుకొంటోందన్నారు. ఈ రోజున ప్రారంభించిన లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ సారనాథ్ శోభను ఇనుమడింప చేయగలదని కూడా ఆయన అన్నారు.
ఈ రోజున కాశీ లో చాలా ప్రాంతాల లో వేలాడుతున్న విద్యుత్తు తీగల సమస్య కు స్వస్తి పలకడం జరుగుతోందని ప్రధాన మంత్రి ప్రకటించారు. భూగర్భం లో వైరులను వేసే పనిలో మరో దశ ఈ రోజున పూర్తి అయిందన్నారు. దీనితోడు, ఆర్షణీయమైన ఎల్ఇడి వీధి దీపాలు వీధుల పై వెలుగును విరజిమ్మడమే కాకుండా, కొత్త అందాలను తీసుకువస్తాయన్నారు.
వారాణసీ కి సంధానాన్ని కల్పించడం అనేది ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యంగా ఉంటూ వచ్చిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కాశీ ప్రజలు, అలాగే కాశీని చూడటానికి వచ్చే యాత్రికులు ట్రాఫిక్ జామ్ లలో వారి కాలాన్ని వృధా పోనీయకుండా చూడటానికే నూతన మౌలిక సదుపాయాల ను కల్పించడం జరుగుతోందని ఆయన నొక్కి చెప్పారు. నగరానికి బాబత్‌పుర్ ను కలిపే రహదారి కూడా వారాణసీ తాలూకు ఒక కొత్త గుర్తింపు చిహ్నంగా మారిందని ఆయన అభివర్ణించారు. వారాణసీ విమానాశ్రయంలో రెండు ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిల ప్రారంభం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. 6 సంవత్సరాల క్రితం నుంచే వారాణసీ విమానాశ్రయం ప్రతి రోజూ 12 విమాన సర్వీసుల రాకపోకలకు నిలయంగా ఉండగా, ప్రస్తుతం రోజుకు 48 విమాన సర్వీసులు రాకపోకలు జరుపుతున్నాయని ఆయన గుర్తు చేశారు. వారాణసీ లో నివసించే ప్రజల తో పాటు, వారాణసీ ని చూడటానికి వచ్చేవారి జీవనాన్ని సౌలభ్యం గా మార్చేందుకు అక్కడ ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని ఆయన చెప్పారు. వారాణసీ నగరం లో ప్రస్తుతం జరుగుతున్న రహదారి సంబంధిత మౌలిక సదుపాయాల పనులను ఒక్కటొక్కటిగా ఆయన ప్రస్తావించారు.
గడచిన 6 సంవత్సరాల కాలంలో వారాణసీ లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన పరంగా చూసినా కూడా అంతకుముందు ఎరుగని స్థాయిలో పనులు జరిగాయని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ఒక్క ఉత్తర్ ప్రదేశ్ కాకుండా, ఒక రకంగా చూస్తే యావత్తు పూర్వాంచల్ లో ఆరోగ్య సౌకర్యాలకు ఇది ఒక కేంద్రంగా మారుతోందన్నారు. రామ్ నగర్ లో గల లాల్ బాహాదుర్ శాస్త్రి ఆసుపత్రి ఆధునీకరణ తదితర ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన పనులను ఆయన ఈ సందర్భంలో ప్రస్తావించారు.
వారాణసీ లో ప్రస్తుతం సర్వతోముఖ అభివృద్ధి చోటు చేసుకొంటోందని, ఇది పూర్వాంచల్ సహా, భారతదేశం లోని యావత్తు ఈశాన్య ప్రాంతాలకు లాభదాయకంగా ఉందని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఇప్పుడు పూర్వాంచల్ ప్రజలు చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికైనా ఇటు ఢిల్లీకి గానీ, లేదా అటు ముంబయి గానీ వెళ్ళనక్కరలేదని ఆయన అన్నారు.
వారాణసీ , పూర్వాంచల్ రైతుల కోసం ఇక్కడ అంతర్జాతీయ వరి సంస్థ, మిల్క్ ప్రోసెసింగ్ ప్లాంటు, త్వరగా పాడయిపోయే వస్తు సామగ్రి రవాణా కేంద్రం నిర్మాణం మొదలైన అనేక సదుపాయాలను ఇక్కడ ఏర్పాటుచేయడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. రైతులు ఆ తరహా అనేక సదుపాయాల తో లబ్ధిని పొందుతున్నారని ఆయన అన్నారు. ఈ సంవత్సరం లో మొట్టమొదటిసారిగా వారాణసీ ప్రాంతం నుంచి ధాన్యం, కాయగూరలు, పండ్లు, విదేశాలకు ఎగుమతి అయినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. 100 మెట్రిక్ టన్నుల నిలవ సామర్ధ్యం కలిగిన ఒక గోదామును ఈ రోజున ప్రారంభించడమైందని, ఇది కాశీ లో రైతులకు నిలవ సదుపాయాల ను విస్తరింప చేస్తుందని ఆయన చెప్పారు. బహుళ ప్రయోజక విత్తన గిడ్డంగిని జన్‌సా లో ప్రారంభించడమైందని ఆయన అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్రచారోద్యమానికి గ్రామీణ పేదలు, రైతులు మూల స్తంభాలే కాకుండా, అతి ప్రధానమైన లబ్ధిదారులు కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలి వ్యావసాయక సంస్కరణలు రైతుల కు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి స్వనిధి యోజన లో భాగం గా వీధులలో తిరుగుతూ సరుకులను అమ్మే వ్యాపారస్తులు సులభంగా రుణాలను పొందుతూ ఉన్నారని, వారు మహమ్మారి అనంతర కాలంలో వారి కార్యకలాపాలను మళ్ళీ మొదలుపెట్టుకొనేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకురావడమైందని ఆయన చెప్పారు.
గ్రామాల లో నివసించే ప్రజలు వారి భూముల పైన, ఇళ్ళ పైన చట్టబద్ధమైన హక్కులను కల్పించడానికి ‘స్వామిత్వ యోజన’ ను ప్రారంభించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పథకం లో భాగంగా సంపత్తి కార్డుల జారీ అనంతరం వారి సంపత్తి వివాదాల పరిధి పల్లెల లోనే ఉండిపోదని ఆయన అన్నారు. గ్రామ ప్రాంతాల లో గల భూమి పైన, ఇంటి పైన ఒక రుణాన్ని తీసుకోవడం ఇకపై సులభతరం అవుతుందని కూడా ఆయన చెప్పారు.
ప్రజలకు ప్రధాన మంత్రి దీపావళి, గోవర్ధన పూజ, భాయీ దూజ్ ల సందర్భం లో శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరూ దీపావళి పండుగకు స్థానిక ఉత్పత్తులనే ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఇది స్థానిక గుర్తింపును పటిష్టం చేస్తుందని ఆయన అన్నారు.
***
Inaugurating various development works in Varanasi. https://t.co/dGJswQi68N
— Narendra Modi (@narendramodi) November 9, 2020
मां गंगा को लेकर ये प्रयास, ये प्रतिबद्धता काशी का संकल्प भी है, और काशी के लिए नई संभावनाओं का रास्ता भी है।
— PMO India (@PMOIndia) November 9, 2020
धीऱे-धीरे यहां के घाटों की तस्वीर बदल रही है।
गंगा घाटों की स्वच्छता और सुंदरीकरण के साथ-साथ सारनाथ भी नए रंगरूप में निखर रहा है: PM
काशी की एक बड़ी समस्या यहां लटकते बिजली के तारों के जाल की रही है।
— PMO India (@PMOIndia) November 9, 2020
आज काशी का बड़ा क्षेत्र बिजली के तारों के जाल से भी मुक्त हो रहा है।
तारों को अंडरग्राउंड करने का एक और चरण, आज पूरा हो चुका है: PM
बाबतपुर से शहर को कनेक्ट करने वाली सड़क भी अब बनारस की नई पहचान बनी है।
— PMO India (@PMOIndia) November 9, 2020
आज एयरपोर्ट पर 2 Passenger Boarding Bridge का लोकार्पण होने के बाद इन सुविधाओं का और विस्तार होगा।
6 वर्ष पहले जहां बनारस से हर दिन 12 फ्लाइट्स चलती थीं, आज इससे 4 गुणा फ्लाइट्स चलती हैं: PM
बीते 6 सालों से बनारस में Health Infrastructure पर भी अभूतपूर्व काम हुआ है।
— PMO India (@PMOIndia) November 9, 2020
आज काशी यूपी ही नहीं, बल्कि एक तरह से पूरे पूर्वांचल के लिए स्वास्थ्य सुविधाओं का हब बनता जा रहा है: PM
बनारस और पूर्वांचल के किसानों के लिए तो स्टोरेज से लेकर ट्रांसपोर्ट तक की अनेक सुविधाएं यहां तैयार की गई हैं।
— PMO India (@PMOIndia) November 9, 2020
International Rice Institute का Centre हो,
Milk Processing Plant हो,
Perishable Cargo Center का निर्माण हो,
ऐसी अनेक सुविधाओं से किसानों को बहुत लाभ हो रहा है: PM
गांव में रहने वाले लोगों को, गांव की जमीन, गांव के घर का, कानूनी अधिकार देने के लिए ‘स्वामित्व योजना’ शुरू की गई है।
— PMO India (@PMOIndia) November 9, 2020
गाँवों में घर मकान को लेकर जो विवाद होते थे, इस योजना से मिले प्रॉपर्टी कार्ड के बाद, उनकी गुंजाइश नहीं रह जाएगी: PM
आजकल, ‘लोकल के लिए वोकल’ के साथ ही, #Local4Diwali के मंत्र की गूंज चारो तरफ है।
— PMO India (@PMOIndia) November 9, 2020
हर एक व्यक्ति जब गर्व के साथ लोकल सामान खरीदेगा,
नए-नए लोगों तक ये बात पहुंचाएगा कि हमारे लोकल प्रोडक्ट कितने अच्छे हैं,
किस तरह हमारी पहचान हैं, तो ये बातें दूर-दूर तक जाएंगी: PM
मां गंगा की स्वच्छता से लेकर स्वास्थ्य सेवाओं तक,
— Narendra Modi (@narendramodi) November 9, 2020
रोड और इंफ्रास्ट्रक्चर से लेकर पर्यटन तक,
बिजली से लेकर युवाओं के लिए खेलकूद तक
और किसान से लेकर गांव-गरीब तक,
हर क्षेत्र में बनारस ने विकास की नई गति प्राप्त की है। pic.twitter.com/IQITes0Rfd
कनेक्टिविटी हमेशा से हमारी सरकार की सर्वोच्च प्राथमिकता रही है।
— Narendra Modi (@narendramodi) November 9, 2020
बनारस में तैयार हो रहा आधुनिक इंफ्रास्ट्रक्चर, यहां रहने वाले और यहां आने वाले, दोनों ही तरह के लोगों का जीवन आसान बना रहा है।
यही नहीं, यह क्षेत्र Waterways की Connectivity में भी एक मॉडल बन रहा है। pic.twitter.com/2OD4mArhBX
गांव-गरीब और किसान आत्मनिर्भर भारत अभियान के सबसे बड़े स्तंभ भी हैं और सबसे बड़े लाभार्थी भी।
— Narendra Modi (@narendramodi) November 9, 2020
हाल में जो कृषि सुधार हुए हैं, उनका लाभ बनारस और पूर्वांचल सहित उत्तर प्रदेश के किसानों को भी होने वाला है। बाजार से उनकी सीधी कनेक्टिविटी सुनिश्चित होने वाली है। pic.twitter.com/FhCm2yW2Ql