Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణ‌సీ లో ప్ర‌ధాన మంత్రి: మల్టి- మాడల్ టర్మినల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు; ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌థ‌కాల ను కూడా ప్రారంభించారు

వారాణ‌సీ లో ప్ర‌ధాన మంత్రి:  మల్టి- మాడల్ టర్మినల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు;  ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌థ‌కాల ను కూడా ప్రారంభించారు

వారాణ‌సీ లో ప్ర‌ధాన మంత్రి:  మల్టి- మాడల్ టర్మినల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు;  ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌థ‌కాల ను కూడా ప్రారంభించారు

వారాణ‌సీ లో ప్ర‌ధాన మంత్రి:  మల్టి- మాడల్ టర్మినల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు;  ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌థ‌కాల ను కూడా ప్రారంభించారు


ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు వారాణ‌సీ ని సంద‌ర్శించారు.

ఆయ‌న 2400 కోట్ల రూపాయ‌ల‌ కు పైగా విలువైన ప‌థ‌కాల‌ కు శంకు స్థాప‌న చేయ‌డం/ప్రారంభించ‌డం/ప్ర‌జ‌ల‌ కు అంకిత‌ం ఇవ్వ‌డం చేశారు.

గంగా న‌ది మీద నిర్మించిన మ‌ల్టి- మాడ‌ల్ ట‌ర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అంకితం చేశారు. అలాగే, మొద‌టి స‌ర‌కు ర‌వాణా కంటేన‌ర్ కు ఆహ్వానం ప‌లికారు. వారాణ‌సీ రింగు రోడ్డు ఒక‌టో ద‌శ ను ఆయ‌న ప్రారంభించారు. అంతేకాకుండా, ఎన్‌హెచ్‌- 56 లో భాగంగా ఉన్న బాబ‌త్‌పుర్- వారాణ‌సీ సెక్ష‌న్ ను నాలుగు దోవ‌ల ర‌హ‌దారి గా అభివృద్ధి ప‌ర‌చే ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు. వారాణ‌సీ లో వివిధ ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల కు ఆయ‌న శంకు స్థాప‌న చేయ‌డ‌మో లేదా ప్రారంభించ‌డ‌మో చేశారు.

ఈ సంద‌ర్భంగా ఉత్సాహం తో పెద్ద సంఖ్య లో త‌ర‌లివ‌చ్చిన స‌భికులను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. ఈ రోజు కాశీ కి, పూర్వాంచ‌ల్ కు, తూర్పు భార‌తావ‌ని కే కాకుండా యావ‌త్ భార‌త‌దేశానికి కూడాను ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు న చోటు చేసుకొన్న అభివృద్ధి ప‌నులు ద‌శాబ్దాల కింద‌టే పూర్తి అయి వుండవలసింది అని ఆయ‌న చెప్పారు. త‌దుప‌రి త‌రం మౌలిక స‌దుపాయాల కు సంబంధించినటువంటి దార్శనికత ర‌వాణా సాధ‌నాల ను ఏ విధంగా మార్చివేయగ‌ల‌దో వారాణ‌సీ తో పాటు యావ‌ద్దేశం ప్ర‌స్తుతం వీక్షిస్తోంది అని ఆయ‌న అన్నారు.

మొద‌టి అంత‌ర్ దేశీయ కంటేన‌ర్ నౌక వారాణ‌సీ కి చేరుకోవ‌డాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ తూర్పు ప్రాంతం ప్ర‌స్తుతం జ‌ల మార్గం ద్వారా బంగాళా ఖాతం తో సంధానం అయింద‌ని తెలిపారు.

నమామి గంగే కు సంబంధించిన ర‌హ‌దారులు, ఇంకా ప‌థ‌కాలు ఏవైతే ఈ రోజున ప్రారంభించ‌బ‌డ‌డం లేదా శంకు స్థాప‌న కు నోచుకోవ‌డం జ‌రిగిందో ఆయా ప‌థ‌కాల ను గురించి ఆయ‌న ఈ సంద‌ర్భం గా వివరించారు.

అంత‌ర్ దేశీయ జ‌ల మార్గం స‌మ‌యాన్ని, ధ‌నాన్ని ఆదా చేయ‌గ‌లుగుతుంద‌ని, ర‌హ‌దారుల పై ర‌ద్దీ ని త‌గ్గించ‌ గ‌లుగుతుంద‌ని, ఇంధ‌న వ్య‌యాన్ని కూడా త‌గ్గిస్తుంద‌ని, దీంతో పాటు వాహ‌నాలు వెదజల్లే కాలుష్యాన్ని కూడా న్యూనీక‌రిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

బాబ‌త్‌పుర్ విమానాశ్రయాన్ని వారాణ‌సీ తో క‌లిపే రోడ్డు.. ప్ర‌యాణానికి సౌక‌ర్య‌వంతం గా ఉండ‌టం తో బాటు యాత్రికుల‌ కు ఒక ఆక‌ర్ష‌ణ గా కూడా మారబోతోందని ఆయ‌న చెప్పారు.

గ‌డచిన నాలుగు సంవ‌త్స‌రాల లో ఆధునిక మౌలిక స‌దుపాయాలు శ‌ర వేగంగా రూపుదాల్చాయ‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు. మారుమూల ప్రాంతాల లో విమానాశ్ర‌యాలు, ఈశాన్య ప్రాంతాల లో రైలు మార్గాలు, గ్రామీణ ప్రాంత ర‌హ‌దారులు మ‌రియు రాజమార్గాలు.. ఇవ‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వ గుర్తింపు లో ఒక భాగం గా మారాయ‌ని ఆయ‌న చెప్పారు.

న‌మామీ గంగే లో భాగంగా 23,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల‌కు ఇంత‌వ‌ర‌కు ఆమోదం తెల‌ప‌డమైంద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. గంగా న‌ది తీరాల వెంబ‌డి దాదాపు అన్ని గ్రామాలు ప్ర‌స్తుతం బ‌హిరంగ మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జ‌న ర‌హితం గా అవ‌త‌రించాయని ఆయ‌న అన్నారు. గంగా న‌ది ని శుభ్రం చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త లో ఈ ప‌థ‌కాలు ఒక భాగం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.