మొట్టమొదటి సారిగా విద్యుత్తు తో నడిచే రైలు ఇంజిను గా మార్చినటువంటి డీజల్ ఇంజిన్ కు ప్రారంభ సూచక జెండా ను చూపించారు
గురు రవిదాస్ జన్మ స్థలం అభివృద్ధి పథకాని కి శంకుస్థాపన చేశారు
ప్రభుత్వం అవినీతిపరుల ను దండిస్తూ, నిజాయతీ పరుల ను సత్కరిస్తోందన్న ప్రధాన మంత్రి శ్రీ మోదీ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో పర్యటించారు. గురు రవిదాస్ జయంతి వేడుకల కు గుర్తు గా గురు రవిదాస్ జన్మ స్థలం అభివృద్ధి పథకం పనుల కు శ్రీ మోదీ పునాది రాయి ని వేశారు.
తొలిసారి గా విద్యుత్తు లోకో మోటివ్ గా మార్చినటువంటి డీజల్ రైల్ ఇంజిన్ కు వారాణసీ లోని డీజల్ లోకోమోటివ్ వర్క్స్ లో ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండా ను చూపారు.
వారాణసీ లో తొలిసారి గా విద్యుత్తు లోకో మోటివ్ గా మార్చినటువంటి డీజల్ రైల్ ఇంజిన్ కు డీజల్ లోకోమోటివ్ వర్క్స్ లో ప్రారంభ సూచక జెండా ను చూపెడుతున్న ప్రధాన మంత్రి
100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించాలన్న భారతీయ రైల్వే ల యొక్క అభియాన్ కు అనుగుణం గా వారాణసీ లోని డీజల్ లోకోమోటివ్ వర్క్స్ ఒక డీజిల్ రైల్ ఇంజిన్ ను విద్యుత్తు తో నడిచే రైలు ఇంజిన్ వలె ఒక కొత్త ప్రోటో టైప్ ను అభివృద్ధి పరచింది. దీనిని ప్రయోగాత్మకం గా నడిపి చూసిన తరువాత, ప్రధాన మంత్రి ఆ రైలు ఇంజిను ను పరిశీలించి దాని పయనాని కి పచ్చ జెండా ను చూపెట్టారు. డిజల్ రైలు ఇంజిన్ లు అన్నింటినీ విద్యుత్తు తో నడిచే రైలు ఇంజిన్ లు గా మార్చి వాటి యొక్క సేవల ను వినియోగించుకోవాలని భారతీయ రైల్వే లు నిర్ణయం తీసుకొంది. రైలు బండి ని లాగడం లో ఖర్చయ్యే శక్తి ని ఆదా చేసుకోవడం తో పాటు కర్బన ఉద్గారాల ను తగ్గించుకొనే దిశ గా ఈ ప్రోజెక్టు ఒక ముందడుగు అని చెప్పుకోవాలి. డబ్ల్యుడిజి3ఎ డీజల్ రైలు ఇంజిన్ లు రెండింటి ని డీజల్ లోకోమోటివ్ వర్క్స్ కేవలం 69 రోజుల లో 10,000 అశ్విక శక్తి కలిగిన డబ్ల్యుఎజిసి3 జంట విద్యుత్తు ఇంజిన్ లుగా మార్చివేసింది. అచ్చం గా ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి తో చేపట్టిన ఈ పని భారతదేశం ఆర్&డి యొక్క నూతన ఆవిష్కరణ గా యావత్తు ప్రపంచం లో పరిగణన లోకి వచ్చింది.
శ్రీ గురు రవిదాస్ విగ్రహాని కి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాన మంత్రి
శ్రీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా గురు రవిదాస్ విగ్రహాని కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటించారు. ఆ తరువాత, సీర్ గోవర్ధన్ పుర్ లోని శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన మందిరం లో గురు రవిదాస్ జన్మ స్థలం అభివృద్ధి పథకం పనుల కు శ్రీ మోదీ శంకుస్థాపన చేశారు.
తక్కువ ఆదరణ కు మాత్రమే నోచుకొన్న వర్గాల వారి కి తోడ్పాటు ను ఇచ్చే విధం గా తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, “మేము పేదల కోసం కోటా ను తీసుకు వచ్చాము. తత్ఫలితంగా– తక్కువ ఆదరణ కు మాత్రమే నోచుకొన్న వర్గాలు– ఒక గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపగలుగుతాయి” అన్నారు. “ఈ ప్రభుత్వం అవినీతిపరుల ను శిక్షిస్తూనే నిజాయతీపరుల ను సత్కరిస్తోంద’’ని ఆయన చెప్పారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మార్మిక కవి (గురు శ్రీ రవిదాస్) గారి బోధన లు మనకు నిత్యం స్ఫూర్తి ని అందిస్తున్నాయన్నారు. కులం ప్రాతిపదిక న వివక్ష ఉన్న పక్షం లో, ప్రజలు ఒకరి తో మరొకరు జత పడ జాలరని, సమాజం లో ఎటువంటి సమానత్వాని కి చోటు ఉండదని కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సంత్ రవిదాస్ చూపిన బాట ను ప్రతి ఒక్కరు అనుసరించాలని, ఈ మార్గాన్ని అనుసరించినట్లయితే అవినీతిని మనం ఏరి పారవేయగలిగే వాళ్ళం అని ఆయన చెప్పారు. ఆ సాధువు యొక్క విగ్రహం తో ఒక గొప్ప ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ, ఈ ప్రోజెక్టు లో భాగం గా యాత్రికుల కోసం అన్ని సౌకర్యాల ను ఇక్కడ సమకూర్చడం జరుగుతుందని ప్రధాన మంత్రి వివరించారు.
In Varanasi, flagged off the first ever Diesel to Electric Converted Locomotive.
— Narendra Modi (@narendramodi) February 19, 2019
I congratulate the entire team that has worked on this historic accomplishment, which will enhance the efforts of the Railways towards electrification. pic.twitter.com/0VmNI6BReF