Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణ‌సీ ని రేపు సంద‌ర్శించ‌నున్న‌ ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ నాడు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ ని సంద‌ర్శించ‌నున్నారు. అక్క‌డ అనేక అభివృద్ధి ప‌థ‌కాల ను ఆయ‌న ప్రారంభించనున్నారు.

వారాణ‌సీ లో గ‌ల డీజల్ లోకోమోటివ్ వ‌ర్క్స్ లో మొట్ట మొద‌టిసారి గా విద్యుత్తు రైలు ఇంజిన్ గా మార్చ‌బ‌డిన డీజిల్ ఇంజిన్ కు ప్ర‌ధాన మంత్రి ప్రారంభ సూచక పతాకాన్ని చూపనున్నారు. రైలు ఇంజిన్ ను ఆయ‌న ప‌రిశీలిస్తారు. ఈ సంద‌ర్భం గా ఏర్పాటు చేసిన ఒక ప్ర‌ద‌ర్శ‌న‌ ను ఆయ‌న సంద‌ర్శించనున్నారు.

రెండు డ‌బ్ల్యుడిజి 3ఎ డీజిల్ లోకో ల‌ను 10,000 అశ్విక శ‌క్తి క‌లిగివుండే ఒక జోడు ఇలెక్ట్రిక్ డ‌బ్ల్యుఎజిసి3ఎ లోకో గా డీజల్ లోకోమోటివ్ వ‌ర్క్స్ రూపుదిద్దింది. అచ్చం గా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం లో భాగం గా పూర్తి అయినటువంటి ఈ మార్పిడి పనులు యావ‌త్తు ప్ర‌పంచాని కి భార‌త‌దేశపు ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి (ఆర్&డి) సంబంధిత నూత‌న ఆవిష్క‌ర‌ణ కానుంది. రూపు మార్చుకున్న ఈ రైలు ఇంజిన్ లు త‌క్కువ స్థాయి లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల తో పాటు ఉత్త‌మ‌మైనటువంటి ప‌నితీరు ను క‌న‌బ‌ర‌చే రైలు ఇంజిన్ లు గా భార‌తీయ రైల్వే లకు పేరు సంపాదించిపెట్ట‌నున్నాయి.

సీర్ గోవ‌ర్ధన్ పుర్ లోని శ్రీ గురు ర‌విదాస్ జ‌న్మ‌స్థాన్ మందిరం లో గురు ర‌విదాస్ బ‌ర్త్ ప్లేస్ డివెల‌ప్‌మెంట్ ప్రోజెక్టు కు ప్ర‌ధాన మంత్రి పునాది రాయి ని వేయ‌నున్నారు. ఆయ‌న శ్రీ గురు ర‌విదాస్ విగ్ర‌హం వ‌ద్ద శ్ర‌ద్ధాంజ‌లి ని ఘటిస్తారు. అంతేకాకుండా జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు.

బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ లో భాగ‌ంగా నూతనంగా నిర్మించినటువంటి మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ కేన్స‌ర్ కేంద్రాన్ని ప్ర‌ధాన మంత్రి ప్రారంభించ‌నున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్, ఝార్‌ఖండ్‌, బిహార్‌, ఉత్తరాఖండ్ ల‌తో పాటు, నేపాల్ వంటి ఇరుగు పొరుగు దేశాల లోని రోగుల కు త‌క్కువ ఖ‌ర్చు లో స‌మ‌గ్ర‌మైన‌టువంటి కేన్స‌ర్ సంర‌క్ష‌ణ ను ఈ ఆసుప‌త్రి అందుబాటులోకి తీసుకు రానుంది.

హోమీ భాభా కేన్స‌ర్ హాస్ప‌ట‌ల్ లెహ‌ర్‌తారా ను కూడా ప్ర‌ధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ రెండు కేన్స‌ర్ ఆసుప‌త్రుల ప్రారంభం తో కేన్స‌ర్ సంబంధిత వ్యాధుల కు నాణ్య‌మైన చికిత్స, ఇంకా సంర‌క్ష‌ణ ల‌ను అందించ‌డం లో వారాణ‌సీ ఒక ముఖ్య‌మైన కేంద్రం కాగలదు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ తొలి నూత‌న భాభాట్రాన్ విత్ ప్రిసిఝన్ టెక్నాలజీ (మ‌ల్టీ లీఫ్ కోలిమేట‌ర్‌)ను దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేయ‌నున్నారు.

ఆయ‌న బిహెచ్‌యు లో పండిత్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ విగ్ర‌హాన్ని మ‌రియు వారాణ‌సీ ఘాట్ ల కుడ్య చిత్రాల ను ఆవిష్క‌రించ‌నున్నారు. బిహెచ్‌యు లోనే ‘పిఎం-జెఎవై ఆయుష్మాన్ భార‌త్’ ల‌బ్దిదారుల‌ తోనూ ఆయ‌న భేటీ కానున్నారు.

ఆ త‌రువాత వారాణ‌సీ మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల లో ఆరోగ్య రంగం తో పాటు ఇత‌ర రంగాల‌ కు కూడా ఊతాన్ని అందించ‌డం కోసం ఉద్దేశించిన ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌ ను ప్ర‌ధాన మంత్రి వారాణ‌సీ లో ఔఢే గ్రామం లో ప్రారంభించ‌నున్నారు. ఆయ‌న వివిధ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌ కు ధ్రువ‌ ప‌త్రాల‌ ను అంద‌జేస్తారు. అలాగే దివ్యాంగ జ‌నుల‌ కు స‌హాయ‌క ఉప‌క‌ర‌ణాల‌ ను కూడా ప్ర‌దానం చేస్తారు. త‌ద‌నంత‌రం జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తారు.