Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లో ప్రధాన మంత్రి

వారాణసీ లో ప్రధాన మంత్రి

వారాణసీ లో ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వారాణసీ ని సందర్శించారు.

బిహెచ్ యు లో మహాత్మ పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ కేన్సర్ సెంటర్ కు మరియు సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రధాన మంత్రి పునాదిరాయి వేశారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వైద్య శాస్త్రంలో సాంకేతిక విజ్ఞానం పోషిస్తున్న పాత్ర అంతకంతకు అధికం అవుతోందని, భారతదేశంలో ఉత్తమ వైద్య సదుపాయాల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని చెప్పారు.

భారతదేశంలోని ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు గుణాత్మకమైన, తక్కువ వ్యయమయ్యే ఆరోగ్య సంరక్షణ సేవలను సమకూర్చడం ప్రస్తుత తక్షణావసరమని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజల బలంపైన తనకు నమ్మకం ఉన్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశ ప్రజలు నిస్వార్థపరులు, వారి ఆశీర్వాదాలు ఆ ఈశ్వరుని ఆశీస్సుల వంటివి అని శ్రీ మోదీ అన్నారు.

ఆన్ లైన్ బ్యాంకింగ్ వైపునకు మరలవలసిందంటూ యువతీయువకులు ఆయన విజ్ఞప్తి చేశారు.

వారాణసీ లోని కబీర్ నగర్ ప్రాంతంలో ఐపిడిఎస్ మరియు హెచ్ఆర్ఐడిఎవై పథకాలలో భాగంగా భూగర్భ కేబుల్ లు వేసే పనులు, వారసత్వ కట్టడాలకు విద్యుత్తు దీపాల అలంకరణ పనులు ఎంతవరకు వచ్చాయో పరిశీలించడం కోసం ఆ ప్రాంతాన్ని ప్రధాన మంత్రి సందర్శించారు.

ఆ తరువాత డిఎల్ డబ్ల్యు గ్రౌండ్ లో ఇఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రధాన మంత్రి పునాదిరాయి వేశారు. అలాగే కొత్త ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ ను, క్రాఫ్ట్ స్ మ్యూజియం ను కూడా ఆయన ప్రారంభించారు.

***