Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లో తులసీ మానస్ దేవాలయాన్ని, దుర్గా మాత దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి; రామాయణంపై తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు


చరిత్రాత్మకమైన తులసీ మానస్ దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పూట సందర్శించారు. ఈ సందర్భంగా ‘‘రామాయణం’’పై ఒక తపాలా బిళ్ల ను ఆయన విడుదల చేశారు.

ఈ ఘట్టం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టంచేస్తూ, రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన ఒక స్టాంపు తులసీ మానస్ దేవాలయం ఆవరణలో విడుదల అవుతున్నదంటే, ఆ స్టాంపులకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ తపాలా బిళ్లలు మన చరిత్రను పరిరక్షించుకొనేందుకు ఒక అద్భుతమైన మార్గం అని కూడా ఆయన చెప్పారు. భగవాన్ రాముని జీవితం మరియు ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఎలా ప్రేరణను అందిస్తున్నాయో ఆయన వివరించారు.

ఆ తరువాత దుర్గా మాత దేవాలయాన్ని మరియు దుర్గా కుండాన్ని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.