Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లోని శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులం యొక్క శతాబ్ది సమారోహం లో ప్ర‌ధాన మంత్రి ప్రసంగం

 


నేను కాశీ ప్రజా ప్రతినిధి ని, మరి కాశీ గడ్డ మీద ఇంత పెద్ద సంఖ్య లో పూజనీయులైన సంన్న్యాసుల యొక్క ఆశీర్వచనాల ను స్వీకరించే అవకాశం నాకు దక్కింది. ఇది నా సౌభాగ్యం; అంతే కాక, కాశీ ప్రజా ప్రతినిధి గా నేను మీ అందరి కి మన:పూర్వకం గా స్వాగతం పలుకుతున్నాను.  సంస్కృతి మరియు సంస్కృతం యొక్క కలయిక లో మీ అందరి మధ్య కు తరలిరావడం నాకు ఒక విశేషాధికారమే.  బాబా విశ్వనాథ్ యొక్క నిలయం లో, గంగా మాత యొక్క ఒడి లో‘సంత్ వాణి’ ని తిలకించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.

ఈ కార్యక్రమాని కి మీరు రావాలంటూ పూజ్య జగద్గురు నాకు ఒక ఆహ్వానపూర్వక లేఖ ను వ్రాశారు.  కానీ ఆ లేఖ లో ఆ వేళ నా సమయాన్ని గురించినటువంటి, అలాగే దేశానికి చెందిన సమయాన్ని గురించినటువంటి ఆందోళనే అధికం గా తోచింది.  అయితే సాధువుల నుండి ఒక ఆదేశం వచ్చిందీ అంటే, సంత్ ల నుండి అందే సందేశం యొక్క మహోత్సవం కానివ్వండి, యువ భారతావని కి పురాతనమైన భారతదేశాన్ని కీర్తించే సందర్భం అవనివ్వండి, అటువంటప్పుడు కాలం దూరం అనేవి ఒక ఆటంకం కాజాలవు.

సాధు జనుల సత్సంగాన్ని, మరి జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోకూడదు.  మీరు సైతం దేశం లోని ప్రతి ఒక్క మూల నుండి మరి దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఇంత పెద్ద సంఖ్య లో ఇక్కడ కు విచ్చేశారు.  కర్నాటక నుండి ఎంతో మంది వచ్చారు; మహారాష్ట్ర నుండి ఎంతో మంది ఇక్కడ కు చేరుకొన్నారు; ఇంకా బాబా భోలే యొక్క నగరం నుండి అనేక మంది తరలివచ్చారు.

మీ అందరి కీ ఇదే స్వాగతం పలుకుతున్నాను; మరి మీకు ఇవే నా హృద‌య‌పూర్వక అభినందన లు కూడాను.
  
మిత్రులారా, తులసీదాస్ అనే వారు 

– ‘సంత్ సమాగమ్ హరి కథా తులసీ దుర్లభ్ దోవూ’ అని.

ఇదీ ఈ భూమి యొక్క ప్రత్యేకత.  అటువంటి పరిస్థితి లో, వీరశైవం వంటి సంత్ ల తాలూకు సంప్రదాయాల ను యువతరాల లో వ్యాపింపచేస్తున్న జగద్గురు విశ్వారాధ్య గురుకులం యొక్క శతాబ్ది సంవత్సర ముగింపు ఘట్టం ఒక గౌరవనీయమైన ఘడియ అని చెప్పాలి.  వీరశైవ సంప్రదాయానికి చెందిన మీ అందరి తో సంధానింపబడినందుకు నేను నిజంగా ఎంతో సంతోషదాయకమైన సంగతి.  ‘వీర్’ అనే మాట కు పలువురు పరాక్రమం తో లంకెపెట్టినప్పటికీ, వీరశైవ సంప్రదాయం అనేది ‘వీర్’ పదాన్ని ఒక ఆధ్యాత్మిక భావం తో నిర్వచించింది.  
 
విరోధ్ రహితం శైవం వీరశైవం విదుర్బుధా:

ఈ మాటల కు- ద్వేషం అనే భావన కంటే మిన్న గా ఎదిగిన వాడు ఒక వీరశైవుడు- అని అర్థం.  అంతటి మహా మానవీయ సందేశం ఈ పేరు తో ముడి పడి ఉంది.  అందుకనే వైరం నుండి, విరోధం నుండి మరియు క్రమరాహిత్యం నుండి సంఘాన్ని బయట పడవేయడం కోసం వీరశైవ సంప్రదాయాని కి ఒక బలమైన కోరిక తో పాటు ప్రబలమైన నాయకత్వం కూడా ఎల్లప్పటికీ ఉంటూ వచ్చాయి. 

మిత్రులారా,  ‘దేశం’ అనే మాట కు- ఎవరు గెలిచారు లేదా ఎవరు ఓడారు అనే అర్థం భారతదేశం లో ఎన్నడూ లేనేలేదు! ఇక్కడ దేశం అనేది అధికారం ద్వారా కాకుండా, సంస్కృతి వల్ల, విలువల వల్ల మరియు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క సామర్థ్యాల వల్ల నిర్మింపబడింది.  అటువంటి పరిస్థితి లో, భారతదేశం యొక్క యథార్థ గుర్తింపు ను భావి తరాని కి చేర్చే బాధ్యత మన అందరిదీ, గురువులదీ, సాధువుల దీ మరియు పండితులదీనూ.

మన దేవాలయాలు కావచ్చు, బాబా విశ్వనాథ్ సహా దేశం లోని 12 జ్యోతిర్ లింగాలు కావచ్చు, చార్ ధామ్ లేదా వీరశైవ సంప్రదాయానికి చెందినటువంటి 5 మహాపీఠాలు కావచ్చు.. ఇవి దివ్య వ్వవస్థ లు గా ఉన్నాయి.  ఈ ధామాలు అన్నీ నమ్మకానికి మరియు ఆధ్యాత్మికత కు మాత్రమే కేంద్రాలు అని కాక, ఇవి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ దిశ గా దారి ని చూపేటటువంటి స్ఫూర్తులు కూడాను.  అవి మనందరి ని- దేశ ప్రజల ను అందరి ని- దేశం లోని వివిధత్వాన్ని కూడాను జోడిస్తాయి.

మిత్రులారా, గురుకులం యొక్క శత సంవత్సర ఉత్సవం నూతన దశాబ్దం యొక్క ఆరంభం లో చోటు చేసుకోవడం యాదృచ్ఛికం.  ఈ దశాబ్దం జ్ఞానం పరం గా మరియు విజ్ఞానశాస్త్రాల పరం గా 21వ శతాబ్దం లో విశ్వ పటలం లో భారతదేశం యొక్క పాత్ర ను మరో మారు ప్రతిష్ఠాపితం చేసేది కానుంది.  అటువంటి స్థితి లో, భారతదేశం యొక్క ప్రాచీన జ్ఞాన గ్రంథాని కి మరియు తత్త్వదర్శన మహా సముద్రాని కి ఒక నవీనమైన 21వ శతాబ్దపు రూపు రేఖ లను సంతరించిన ‘శ్రీ సిద్ధాంత్ శిఖామణి’ గ్రంథాన్ని ప్రసాదిస్తున్నందుకు గాను మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.

ఈ తత్త్వదర్శనం- ఏదయితే భక్తి నుండి ముక్తి కి మార్గాన్ని చూపుతున్నదో- ఇది భావి తరాల కు చేరి తీరాలి.  ఈ యొక్క పావన గ్రంథాని కి ఒక ఏప్ ద్వారా డిజిటల్ మాధ్యమం లోకి చేర్చితే అప్పుడు అది యువతరం తో బంధాన్ని బలవత్తరం గా మార్చివేసి వారి యొక్క జీవనాల కు ప్రేరణ ను ఇవ్వగలుగుతుంది.  ఈ ఏప్ ద్వారా ఈ పుస్తకానికి సంబంధించిన ఒక క్విజ్ పోటీ ని ఏటా నిర్వహించి మరి ప్రతి రాష్ట్రం లో అగ్రగామి మూడు స్థానాల లో నిలచేటటువంటి విజేతల కు బహుమతి ఇవ్వవలసింది గా నేను మిమ్మల్ని కోరదలచాను.  ప్రతిదీ ఆన్ లైన్ ద్వారా జరపవచ్చును.

‘శ్రీ సిద్ధాంత్ శిఖామణి’ గ్రంథం శ్రీ జగద్గురు రేణుకాచార్య యొక్క పావన సందేశాన్ని దేశం లో మరియు ప్రపంచం లో ప్రతి ఒక్క మూల కు చేరవేయడం కోసం 19 భాషల లోకి అనువాదమయ్యింది.  ఇవాళ దానిని ఇక్కడ కూడా విడుదల చేయడం జరుగుతున్నది.  సాధువుల యొక్క జ్ఞానాన్ని ప్రజల లో వ్యాప్తి చేయడం మానవత్వానికి చేసే ఒక గొప్ప సేవ అవుతుంది.  మనం దీనిలో పురోగతి ని కొనసాగించేందుకు గాను ఏది అవసరపడ్డా దానిని చేస్తూ ఉండాలి.
 
మిత్రులారా,  విద్య ను మరియు సంస్కృతి ని ప్రజల వద్దకు తీసుకొనిపోవడం లో వీరశైవం తో అనుబంధం కలిగిన సాధువులు, లింగాయత్ సముదాయానికి చెందిన సాధువులు ఇంకా ఇతరులు ఒక చాలా పెద్దదైనటువంటి భూమిక ను నిర్వహించారు.  అజ్ఞానమనే చీకటి ని కర్నాటక సహా దేశం లోని అనేక ప్రాంతాల లోని మఠాల ద్వారా తొలగించడం జరుగుతోంది.  మానవ గరిమ కు నవీన పార్శ్వాల ను సంతరించడం జరుగుతోంది.  ఇది నిజంగా ప్రశంసాయోగ్యమైనటువంటి ప్రయాస.  జంగంబాడి మఠం కూడాను మానసికం గా వంచితులైన వర్గాల కు ఒక ప్రేరణ బీజం గా, బ్రతుకుదెరువు ను ఇచ్చే మార్గం గా ఉన్నది.  మీ కృషి గొప్ప గా మెచ్చుకోదగింది.  అంతేకాదు, సంస్కృతాన్ని, మరి అలాగే ఇతర భారతీయ భాషల ను జ్ఞాన సముపార్జన మాధ్యమం గా మలచడం ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని మీరు దీనిలో ఇమిడ్చి చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయే, అవి కూడా అబ్బురపరచేవే.  భారతదేశం లోని అన్ని భాషల ను- సంస్కృతం తో పాటు గా- పెద్ద ఎత్తు న వ్యాప్తి లోకి తీసుకువచ్చేటట్లుగాను, వాటి నుండి యువతీయువకులు లబ్ధి ని పొందేటట్లుగాను ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
  
ఇక్కడ, నేను ‘భారతీయ దర్శన్ కోశ్’ ఆవిష్కారం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించిన శ్రీ కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర్ శివాచార్య మహా స్వామి జి ని ప్రశంసించదలచుకొన్నాను.  ఆయన శ్రీ సిద్ధాంత్ శిఖామణి పై ఏకం గా పిహెచ్. డి. నే పూర్తి చేశారు.  వారు అందించిన వందలాది గ్రంథాలు యువతరాని కి మార్గదర్శకం గా ఉండి వారికి బోధన లు చేస్తున్నాయి.  మరి అవి దేశ ప్రజల కు కూడా మార్గదర్శనం చేస్తున్నాయి.

మిత్రులారా, దేశం కేవలం ప్రభుత్వం తో నిర్మాణం కాదు; పౌరుల లో ప్రతి ఒక్కరి సంస్కారం వల్ల దేశం నిర్మితమవుతుంది.  విధులు మరియు బాధ్యతలు అనేవి పౌరుల విలువల ను ఉన్నత స్థాయి న నిలుపుతాయి.  ఒక పౌరుని గా మన నడవడిక భారతదేశం యొక్క భవిష్యత్తు ను నిర్ధరిస్తుంది; అంతే కాదు, అది ఒక న్యూ ఇండియా యొక్క దిశ ను నిర్ణయిస్తుంది కూడా.  మన సనాతన సంప్రదాయం లో, ‘‘ధర్మం’’ అనే పదం విధి తో సమానమైనటువంటి అర్థాన్ని పుణికిపుచ్చుకొంది.  మరి వీరశైవ సాధువులు ధర్మం తో పాటుగానే విధుల ను కూడా శతాబ్దాల తరబడి బోధిస్తూ వచ్చారు.  జంగంబాడి మఠం ఈ విలువల ను నేర్పడం లో సదా నిమగ్నం అయింది.

ఈ మఠం ఎన్నో విద్యాసంస్థల కు భూమి ని విరాళం గా ఇవ్వడం తో పాటు వనరుల ను కూడా అందించింది. మఠాలు చూపిన దారి న నడచి మరి సాధువులు చూపిన మార్గాన్ని అనుసరించి మనం మన సంకల్పాల ను నెరవేర్చవలసివుంది.  అదే విధం గా దేశ నిర్మాణం లో మన సహకారాన్ని అందించవలసివుంది.  భగవాన్ బసవేశ్వరుడు ఏ విధం గా ఇతరుల పట్ల కృప కలిగి సేవ చేసేవారో మనం ఆ స్ఫూర్తి తో ముందుకు కదలవలసివుంది.  దేశం యొక్క సంకల్పాలతో మనలను మనం జోడించుకోవలసివుంది.

గత 5 సంవత్సరాల లో మాదిరిగానే, భారతదేశం లో సాధువులు, మఠాలు, గురుకులాలు, పాఠశాల లు మరియు కళాశాల లు పారిశుధ్యం యొక్క ప్రాముఖ్యం పట్ల చైతన్యాన్ని రేకెత్తించడం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించాయి.  కాశీ వలెనే దేశం లోని యువత స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను దేశం లోని ప్రతి ప్రాంతాని కి తీసుకుపోయినట్లే, మనం ఆ తరహా అనేక సంకల్పాల ను ముందుకు తీసుకుపోవలసివుంది.  అటువంటి ఒక కీలకమైన సంకల్పం ఏదంటే, అది భారతదేశం లో తయారు చేసిన వస్తువుల కు, మన హస్తకళ లకు, ఇంకా మన నేత కార్మికులు తయారు చేసిన వస్తువుల కు  ప్రాముఖ్యాన్ని ఇవ్వడం. మనం అందరమూ స్థానిక ఉత్పత్తుల ను మాత్రమే కొందాము అంటూ నేను ఎర్ర కోట మీది నుండి అభ్యర్థించాను.  భారతదేశం లో తయారు అయినటువంటి వస్తువుల ఉపయోగాన్ని గురించి మనంతట మనం మరియు మన చుట్టుప్రక్కల ఉండే ప్రజలు కూడా నొక్కిచెప్పడం జరగాలి.  ప్రస్తుతం, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులు భారతదేశం లో తయారవుతున్నాయి.  మనం దిగుమతి అయిన వస్తువులే ఉన్నతమైనవి అనేటటువంటి మనస్తత్వాన్ని మార్చుకొనితీరాలి.

అదే విధం గా, మీ అందరి యొక్క పాత్ర, దేశం యొక్క పాత్ర, దేశం లో జల్ జీవన్ మిశన్ కు సంబంధింనంత వరకు ముఖ్యం కానున్నాయి.  అది ఇల్లు కావచ్చు, లేదా వ్యవసాయ క్షేత్రం కావచ్చు, లేదా మరేదైనా ప్రదేశం కావచ్చు.. మనం జలాన్ని ఆదా చేయడం పైన మరియు జలాన్ని పునర్వినియోగించుకోవడం పైన శ్రద్ధ తీసుకొని తీరాలి.  భారతదేశం లో ప్రతి ఒక్కరి యొక్క తోడ్పాటు భారతదేశాన్ని దుర్భిక్షం బారి నుండి విముక్తం చేసి మరి సార్ద్రపరచగలుగుతుంది.

మిత్రులారా,  

దేశం లో అటువంటి భారీ ప్రచార ఉద్యమాల ను ఒక్క ప్రభుత్వాలే నడపజాలవు.  వాటి సాఫల్యానికి ప్రజల ప్రాతినిధ్యం చాలా ముఖ్యం.  గడచిన 5-6 సంవత్సరాల లో గంగా నది జలం యొక్క నాణ్యత లో ఇదివరకు ఎరుగనటువంటి మెరుగుదల ఉందీ అంటే, అందుకు ప్రజల యొక్క ప్రాతినిధ్యమే కారణం.  గంగా మాత పట్ల బాధ్యత ను పంచుకొనే భావన మరి గంగా నది పట్ల నమ్మకం తో కూడినటువంటి భావన ప్రస్తుతం అపూర్వమైనటువంటి స్థాయి కి చేరుకొన్నాయి.  ఇవాళ, గంగా జీ చుట్టుప్రక్కల పల్లెల లోను, పట్టణాల లోను మరి నగరాల లోను గంగా మాత పట్ల జవాబుదారుతనం అనేది ఇంతకు పూర్వం ఎన్నడూ వ్యక్తం కానంతటి స్థాయి లో వ్యక్తం అవుతున్నది.  ఈ విధియుక్త బాధ్యతా భావన యే గంగా మాత యొక్క స్వచ్ఛత కు మరియు నమామి గంగే మిశన్ కు గొప్ప గా తోడ్పడింది. నమామి గంగే మిశన్ లో భాగం గా 7 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల తాలూకు పనులు పూర్తి అయ్యాయి. మరొక 21 వేల కోట్ల రూపాయల విలువైనవవ ప్రాజెక్టుల తాలూకు పనులు పురోగతి లో ఉన్నాయి.  ప్రస్తుతం సాగుతున్న పథకాల పనుల ను కూడా పూర్తి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. 

ఈ ప్రయత్నాలు, మీ అందరి యొక్క సమర్దన తోను, గరిష్ఠ స్థాయి లో ప్రజా ప్రాతినిధ్యం తోను మరింత గా సఫలం కాగలవు.  గడచిన సంవత్సరం ప్రయాగ లో కుంభ మేళా కాలం లో మీ అంతట మీరే గమనించివుంటారు, ప్రతి ఒక్క ముని మరి అదే విధం గా ప్రతి ఒక్క భక్తుడు/భక్తురాలు గంగా నది యొక్క నిర్మలత విషయం లో సంతృప్తి ని వ్యక్తం చేయడాన్ని; వారు వారి యొక్క దీవెనల ను కురిపించడాన్ని.  ప్రజల ప్రాతినిధ్యం యొక్క ఫలితమే దేశ, విదేశాల లో ఈ విధమైనటువంటి అభినందన భావం వ్యక్తం కావడం. 

మిత్రులారా, 

వీరశైవ సాధువులు ప్రవచించినటువంటి మానవత్వం యొక్క విలువలు, మనందరి కి మరియు మన ప్రభుత్వాల కు ప్రేరణ ను అందిస్తూ వస్తున్నాయి.  ఈ యొక్క ప్రేరణ వల్ల, ఎవరూ ఇంతకు ముందు ఊహించి అయినా ఎరుగనటువంటి నిర్ణయాల ను దేశం లో ప్రస్తుతం తీసుకోవడం, మరి ఆ తరహా పాత సమస్యల కు పరిష్కారాన్ని సాధించడం జరుగుతూ ఉన్నాయి.  రామ మందిరం అంశం దశాబ్దాల తరబడి న్యాయస్థానాల లో పరిష్కారం కాకుండా మిగిలిపోయింది.  ఇప్పుడు అయోధ్య లో భవ్య రామాలయ నిర్మాణానికి మార్గం పూర్తి గా సుగమం అయిపోయింది.  రామ మందిర నిర్మాణం కోసం ‘శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర’ పేరు తో స్వతంత్ర ప్రతిపత్తి ని కలిగివుండేటటువంటి ఒక ట్రస్టు ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.  ఈ ట్రస్టు అయోధ్య లో భగవాన్ శ్రీ రాముని జన్మస్థలం లో భవ్యమైనటువంటి మరియు దివ్యమైనటువంటి శ్రీ రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. మరి అలాగే, అన్ని నిర్ణయాల ను ఈ ట్రస్టు తీసుకొంటుంది. కర్నాటక సహా అనేక స్థలాల కు చెందిన సాధువులు ఈ ట్రస్టు లో భాగం గా ఉంటారు.  ఈ పని పూజనీయులైనటువంటి సాధువుల యొక్క ఆశీస్సుల తో మొదలైంది. మరి ఇది సాధువుల యొక్క ఆశీర్వాదాల తోనే పూర్తి అవుతుంది. 

మిత్రులారా, ప్రభుత్వం అయోధ్య లో రామాలయానికి సంబంధించిన మరొక ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొంది. అయోధ్య చట్టం ద్వారా సేకరించిన యావత్తు 67 ఎకరాల భూమి ని నూతనం గా ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కు బదలాయించడం కూడా జరుగుతుంది.  అంతటి విశాలమైన ప్రదేశం లో, మందిరం యొక్క భవ్యత్వం మరియు దివ్యత్వం మరింత గా వృద్ధి చెందుతుంది.

ఆలోచించండి.. అయోధ్య లో ఒక ప్రక్క న రామ మందిర నిర్మాణం, మరి మరొక ప్రక్క న వారాణసీ లో కాశీ విశ్వనాథ్ ధామ్ .. భారతదేశం యొక్క చరిత్ర లో ఈ కాలం చరిత్రాత్మకమైనటువంటిది. 

మిత్రులారా,  మీ అందరి యొక్క దీవెనల తో, మీ సాధువులందరి యొక్క దీవెనల తో, ఈ రోజు న అనేక నూతన కార్యాలు దేశం లోను మరియు కాశీ లోను చోటుచేసుకొంటున్నాయి.  ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే, వారాణసీ లోనే నాకు మరొక రెండు కార్యక్రమాలు కూడా ఉన్నాయి.  వాటిలో భాగం గా కోట్లాది రూపాయల విలువైన ప్రణాళికల ను ప్రారంభం చేయడం మరి పునాదిరాళ్లు వేయడం జరుగుతుంది.  ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను కాశీ ని బలపరుస్తాయి; ‘న్యూ ఇండియా’ ను బలోపేతం చేస్తాయి.

రండి, గురుకులం యొక్క శత సంవత్సరం లోని ఈ ఆఖరు రోజు న మనం ఒక ప్రతిజ్ఞ ను స్వీకరిద్దాం; అది ఎటువంటి ప్రతిన అంటే, మనం ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించడం కోసం సాధ్యమైన ప్రతి ఒక్క తోడ్పాటు ను అందజేద్దాము అనేదే.  మనం దేశ హితాన్ని దృష్టి లో పెట్టుకొని ఉత్తమమైనటువంటి పౌరుల వలె మరియు కర్తవ్యపరాయణులైనటువంటి పౌరుల వలె యావత్తు సమాజాన్ని ముందుకు తీసుకు పోదాము.  ఈ సందర్భం లో నాకు కూడా పాలుపంచినందుకు గాను మీకు నేను మరో సారి ధన్యవాదాల ను తెలియజేస్తున్నాను.

https://youtu.be/eO94RYKLrAw

**