ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో వారణాసి నుండి వచ్చిన కార్పొరేటర్లను సత్కరించారు.
నగరాన్ని పర్యటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో సహకరించవలసిందిగా కార్పొరేటర్లకు ప్రధాన మంత్రి సూచించారు. వారందరు తమ తమ వార్డులలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి అంటూ ఆయన వారిలో స్ఫూర్తిని నింపారు.
వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వచ్చిన గ్రామ ప్రధాన్ లు మరియు కార్పొరేటర్లతో ప్రధాన మంత్రి గత అయిదు రోజులుగా జరుపుతూ వస్తున్న మాటామంతీ కార్యక్రమంలో ఈ కార్యక్రమం చివరిది.