Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారణాసిలో సామాజిక్ అధికారిత శిబిరంలో సహాయక పరికరాలను అందజేసిన ప్రధాని; మహామాన ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా

వారణాసిలో సామాజిక్ అధికారిత శిబిరంలో సహాయక పరికరాలను అందజేసిన ప్రధాని;
మహామాన ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా

వారణాసిలో సామాజిక్ అధికారిత శిబిరంలో సహాయక పరికరాలను అందజేసిన ప్రధాని;
మహామాన ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో సామాజిక్ అధికారిత శిబిరంలో పాల్గొని, సహాయక పరికరాలను అందజేశారు. ప్రధాని కుట్టు మిషన్లు, బ్రెయిలీ కిట్లు, వినికిడి పరికరాలు, స్మార్ట్ కేన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు పంపిణీ చేశారు. వీటిని అందుకున్నవారిలో వితంతు మహిళలు, భిన్నమైన సామర్ధ్యాలు కలిగిన వారు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందు ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆయన తన ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల సేవకు అంకితమై పనిచేస్తుందని చెప్పారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించిన దాదాపు 1800 వందల శిబిరాల్లో వారణాసి లోని ఈ శిబిరం కూడా ఒకటని చెప్పారు. ఈ సంఖ్య ఇదివరకటి ప్రభుత్వాల హయాంలో నమోదైన సంఖ్య కన్నా ఎంతో ఎక్కువని తెలిపారు. సహాయ పరికరాల పంపిణీ క్రార్యక్రమంలో దళారుల ప్రమేయాన్ని ఈ శిబిరాలు చాలావరకు తొలగించాయని ప్రధాని అన్నారు. మధ్యవర్తుల పాత్రను తోసిరాజని, పరిపాలనను కట్టుదిట్టం చేసినందుకు తాను అనేక వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోవలసి వచ్చిందంటూ, ఇవేవీ సమాజంలోని పేద, బడుగు వర్గాలకు సేవలందించే బాట నుంచి తనను తప్పించజాలవని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

విభిన్నమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని గురించి దైనందిన జీవితంలో ‘వికలాంగులు’ అనే మాటకు బదులు “దివ్యాంగులు” అనే మాటను ఉపయోగించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. మనుషుల శారీరిక వైకల్యాల కన్నా వారిలోని అసాధారణ శక్తి సామర్ధ్యాల పై దృష్టిని కేంద్రీకరించాలని ప్రధాని అన్నారు.

విభిన్నమైన సామర్ధ్యాలు కలిగిన వారికి సహాయపడటానికి తమ ప్రభుత్వం ‘సుగమ్య భారత్’ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు.

ఆధునిక ప్రయాణ సదుపాయాలతో మహామాన ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టినందుకు రైల్వే శాఖను ప్రధాని అభినందించారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలుకు పచ్చ జెండా ఊపి, ప్రారంభించారు.

ఈ కార్య్రమంలో పాల్గొనటానికి బయలుదేరి వస్తున్న కొంతమంది ఒక బస్సు ప్రమాదంలో చిక్కుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారని, మంత్రులు, అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళారని ప్రధాని చెప్పారు. కొద్దిపాటి గాయాలతో బయపడి సభాస్థలికి చేరుకున్న కొందరిని ప్రధాని కలసి పరామర్శించారు.

***