Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం


కొత్త టెర్మినల్ బిల్డింగ్, అప్రాన్ ఎక్స్‌టెన్షన్, రన్‌వే ఎక్స్‌టెన్షన్, పారలల్ టాక్సీ ట్రాక్ & అలైడ్‌ల నిర్మాణంతో సహా వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. 

ప్రస్తుతం ఉన్న 3.9 ఎంపీపీఏ నుండి సంవత్సరానికి 9.9 మిలియన్ల ప్రయాణికులకు (ఎంపీపీఏ) విమానాశ్రయం  నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అంచనా వేసిన ఆర్థిక వ్యయం రూ. 2,869.65 కోట్లు. 75,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త టెర్మినల్ బిల్డింగ్ 6 ఎంపీపీఏ సామర్థ్యం కోసం, 5000 పీక్ అవర్ ప్యాసింజర్స్ (పిహెచ్పి) కోసం రూపొందించారు. ఇది నగర విస్తారమైన సాంస్కృతిక వారసత్వం, సంగ్రహావలోకనం అందించడానికి రూపొందించారు.

ఈ ప్రతిపాదనలో, రన్‌వేని 4075మీ x 45మీ కొలతలకు పొడిగించడం, 20 విమానాలను పార్క్ చేయడానికి కొత్త ఆప్రాన్‌ను నిర్మించడం వంటివి ఉన్నాయి. ఇంధన ఆప్టిమైజేషన్, వేస్ట్ రీసైక్లింగ్, కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గింపు, సౌరశక్తి వినియోగం, సహజ పగటి వెలుతురు ఉండేలా చూడడం, ప్రణాళిక, అభివృద్ధి, కార్యాచరణ దశలు అంతటా ఇతర స్థిరమైన చర్యలతో పాటు పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించే ప్రాథమిక లక్ష్యంతో వారణాసి విమానాశ్రయాన్ని గ్రీన్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేస్తారు. 

***