ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వామ పక్ష తీవ్రవాద ప్రాబల్య (ఎల్ డబ్ల్యూఈ) ప్రాంతాల లోని భద్రతా శిబిరాల వద్ద 2G మొబైల్ సేవలను 4G కి అప్ గ్రేడ్ చేయడం కోసం యూనివర్స ల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యు ఎస్ o ఎఫ్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
2. ఈ ప్రాజెక్ట్ 2,343 వామ పక్ష తీవ్రవాద (ఎల్ డబ్ల్యుఈ) ఫేజ్-1 సైట్లను 2జి నుండి 4 జి మొబైల్ సేవలకు 1,884.59 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో (పన్నులు , సుంకాలు మినహాయించి) అప్ గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐదేళ్ల పాటు ఆపరేషన్స్ ,మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ తన సొంత ఖర్చుతో మరో ఐదు సంవత్సరాల పాటు ఈ సైట్లను నిర్వహిస్తుంది. ఈ సైట్లు బిఎస్ఎన్ ఎల్ కు చెందినవి కాబట్టి ఈ పనిని బిఎస్ఎన్ఎల్ కే అప్పగిస్తారు.
3. 541.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధికి మించి పొడిగించబడిన కాలానికి బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎల్ డబ్ల్యుఇ ఫేజ్-1 2 జి సైట్ల ఆపరేషన్స్ ,మెయింటెనెన్స్ ఖర్చుకు నిధులు సమకూర్చడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 12 నెలల వరకు పొడిగింపు కేబినెట్ ఆమోదం పొందిన తేదీ నుంచి లేదా 4జీ సైట్లను ప్రారంభించే తేదీ నుంచి ఏది ముందు అయితే అప్పటి నుంచి ఉంటుంది.
4. ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయడంతో పాటు దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడానికి టెలికాం గేర్ విభాగంలో స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కు దేశీయ 4 జి టెలికాం పరికరాల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఎంచుకుంది. ఈ ప్రాజెక్టులో కూడా ఈ 4జి ఎక్విప్ మెంట్ ఉపయోగించబడుతుంది.
5. ఎల్ డబ్ల్యు ఈ ప్రాంతాల్లో అప్ గ్రేడేషన్ వల్ల మెరుగైన ఇంటర్నెట్ ,డేటా సేవలను అందిస్తుంది. ఇది హోం మంత్రిత్వ శాఖ ,రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాంతాల్లో మోహరించిన భద్రతా సిబ్బంది కమ్యూనికేషన్ అవసరాలను కూడా ఇది తీరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. అదనంగా, వివిధ ఇ- గవర్నెన్స్ సేవలు, బ్యాంకింగ్ సేవలు, టెలి-మెడిసిన్ డెలివరీ; మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైనవి ఈ ప్రాంతాల్లో సాధ్యమవుతాయి.
***
Today’s Cabinet decision will improve connectivity in areas affected by Left Wing Extremism and will ensure proper internet access. This will enhance our efforts to build an Aatmanirbhar Bharat. https://t.co/YuuPSm3wmr
— Narendra Modi (@narendramodi) April 27, 2022