Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాతావరణ హిత న్యాయానిదే అంతిమ విజయం : పారిస్ ఒప్పందంపైన ప్రధాని ప్రకటన


ప్రపంచ నేతలందరి జ్ఞానానికి నిదర్శనమే పారిస్ ఒప్పందమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

వాతావరణ మార్పులపై తాజాగా ముగిసిన పారిస్ సమావేశంలో వాతావరణ హిత న్యాయానిదే అంతిమ విజయమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులను తగ్గించడానికిగాను కాప్-21లో లో జరిగిన సుదీర్ఘ చర్చలు, తదనుగుణంగా చేసుకున్న పారిస్ ఒప్పందం ప్రపంచ నేతలందరి జ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రధాని అన్నారు. పారిస్ ఒప్పందపైన ప్రధాని పలు ట్వీట్లు చేసి, తన హృదయానుభూతులను ప్రజలతో పంచుకున్నారు. ఈ ఒప్పందంలో విజేతలు, పరాజితులు అంటూ ఎవరూ లేరని ఆయన అన్నారు.
“వాతావరణ మార్పులను తగ్గించడానికిగాను జరిగిన సీఓపీ 21 చర్చలు, పారిస్ ఒప్పందం ప్రపంచ నేతల సమష్టి జ్ఞానానికి నిదర్శనం. వాతావరణ మార్పు అనేది ఒక సవాల్ లా నిలిచింది. అయితే, ఈ సవాలును ఎదుర్కోవడానికి ప్రతి దేశం ముందుకొచ్చి ఒక పరిష్కారం కనుగొనడానికిగాను శ్రమించిందని పారిస్ ఒప్పందం చాటిచెబుతోంది. పారిస్ ఒప్పందం తుది రూపం ఎవ్వరినీ విజేతలుగానో, లేక పరాజితులు గానో చూపడం లేదు. చివరకు వాతావరణ హిత న్యాయానిదే పైచేయి అయింది. పచ్చదనంతో నిండిన భవిష్యత్ కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నామ”ని ప్రధాని ట్విటర్ లో పేర్కొన్నారు.