Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాట్ ఫో సందర్శించిన ప్రధానమంత్రి

వాట్ ఫో సందర్శించిన ప్రధానమంత్రి


థాయిలాండ్ ప్రధాని పైతోంగ్‌తార్న్ శినావాత్రా వెంట రాగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాట్ ఫ్రా చేతుఫోన్ విమోన్ మంగ్‌ఖాలారామ్ రాజ్‌వా‌రామాహావిహాన్‌ను (‘వాట్ ఫో’గా ఇది ప్రసిద్ధికెక్కింది) సందర్శించారు.

విశ్రమించిన భంగిమలో దర్శనమిస్తున్న భగవాన్ బుద్ధుని ప్రతిమకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. బౌద్ధ భిక్షువులకు ప్రధాని ‘సంఘదానా’న్నిచ్చారు. అశోకుని సింహ స్తంభం ప్రతిరూపాన్ని బుద్ధుని మందిరానికి ప్రధానమంత్రి బహుమతిగా ఇచ్చారు. భారత్, థాయిలాండ్‌ల మధ్య గల బలమైన, చైతన్యభరిత నాగరికత సంబంధాలను ప్రధాని ఈ సందర్భంగా స్మరించుకొన్నారు.