Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వర్చువల్ గ్లోబల్ వేక్సీన్ సమిట్ 2020 ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ఇంటర్ నేశనల్ వేక్సీన్ అలాయన్స్ ‘గావీ’ కి 15 మిలియన్ యుఎస్ డాలర్ నిధుల ను అందిస్తామని భారతదేశం ఈ రోజు న మాట ఇచ్చింది.

యుకె ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ ఏర్పాటు చేసిన వర్చువల్ గ్లోబల్ వేక్సీన్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. 50 కి పైగా దేశాల వ్యాపార దిగ్గజాలు, ఐక్య రాజ్య సమితి ప్రతినిధి సంస్థ లు, పౌర సమాజం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వాలలోని మంత్రులు, దేశాధినేత లు, దేశ నాయకులు ఈ శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, సవాళ్ల తో కూడిన ఈ కాలం లో భారతదేశం ప్రపంచం పట్ల బాసట సంఘీభావం తో వ్యవహరిస్తుంది అన్నారు.

ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భారతదేశ నాగరకత బోధిస్తోందని, మరి ప్రస్తుత ప్రపంచవ్యాప్త వ్యాధి కాలం లో భారతదేశం తన బోధన కు అనుగుణం గా నడుచుకొనేందుకు ప్రయత్నించిందని శ్రీ మోదీ అన్నారు. ఈ క్రమం లో భారతదేశం తన విస్తారమైనటువంటి జనాభా ను పరిరక్షించుకొంటూనే తన కు అందుబాటు లో ఉన్న ఔషధ నిల్వల ను 120 కి పైగా దేశాల తో పంచుకోవడం ద్వారాను, తన కు సమీపం లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలతో ఒక సమష్టి స్పందన వ్యూహాన్ని రచించి అమలుపరచడం ద్వారాను మరియు ఆయా దేశాలు కోరిన ప్రకారం వాటి కి నిర్దిష్ట సహాయాన్ని అందించడం ద్వారాను పాటుపడింది అని ప్రధాన మంత్రి అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి కొన్ని రకాలు గా గమనించినప్పుడు, ప్రపంచ సహకారం లో గల పరిమితుల ను బయటపెట్టింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారి గా మానవాళి ఒక స్పష్టమైన ఉమ్మడి శత్రువు ను ఎదుర్కొంటోంది అని కూడా ఆయన అన్నారు.

గావీ ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది ఒక ప్రపంచ స్థాయి సమాశ్రయం మాత్రమే కాదు, అంతర్జాతీయ సంఘీభావాని కి కూడా ఒక ప్రతీక అని, ఇతరుల కు సాయపడడం ద్వారా మనకు మనం సహాయం చేసుకోగలమని గుర్తు చేసిందన్నారు.

భారతదేశం విస్తారమైన జనాభా ను, పరిమితమైన రక్షణ సదుపాయాలను కలిగివుంది, ఈ దేశం టీకామందు యొక్క ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకొంది అని ఆయన చెప్పారు.

తన ప్రభుత్వం చేపట్టిన తొలి కార్యక్రమాల లో ‘మిషన్ ఇంద్రధనుస్’ ఒకటి అని, మారుమూల ప్రాంతాల లో నివనిస్తున్న వారి తో సహా దేశవ్యాప్తం గా పూర్తి స్థాయి లో బాలల కు మరియు గర్భిణుల కు టీకామందు ను ఇప్పించేందుకు పూచీపడాలని తన ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకొన్నట్లు ప్రధాన మంత్రి వివరించారు.
తత్సంబంధిత రక్షణ కవచాన్ని మరింత గా విస్తరించడం కోసం, భారతదేశం తన నేశనల్ ఇమ్యూనైజేశన్ ప్రోగ్రాము కు ఆరు కొత్త టీకామందుల ను జోడించింది అని కూడా ఆయన వెల్లడించారు.

భారతదేశం తన యావత్తు టీకామందు సరఫరా వ్యవస్థ ను డిజిటైజ్ చేసిందని, శీతలీకరణ వసతు ల సమగ్రత ను పర్యవేక్షించేందుకు ఇలెక్ట్రానిక్ వేక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను అభివృద్ధిపరచిందని ప్రధాన మంత్రి విపులీకరించారు. ఈ వినూత్న ఆవిష్కరణ లు వరుస లో ఆఖరు స్థానం లో ఉన్న వ్యక్తి వద్దకు కూడా సురక్షితమైనటువంటి మరియు శక్తియుతమైనటువంటి టీకామందులు తగిన పరిమాణాల లో సకాలం లో అందుబాటులోకి వచ్చేటట్టు పూచీపడతాయి అని ఆయన చెప్పారు.

ప్రపంచం లో టీకామందుల ఉత్పత్తి లో సైతం భారతదేశం అగ్రగామి దేశాల సరసన నిలుస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. అదే విధం గా, ప్రపంచ బాలల్లో 60 శాతం మంది కి వ్యాధినిరోధం లో తోడ్పాటు ను అందించగలిగే అదృష్టం కూడా భారతదేశాదే అని ప్రధాన మంత్రి అన్నారు.

గావీ యొక్క కృషి ని భారతదేశం ప్రశంసిస్తోందని, గావీ కి విశేష మహత్వాన్ని ఇస్తోందని, భారతదేశం ఇప్పటికే గావీ నుండి సహాయాన్ని పొందే అర్హత కు నోచుకొని కూడా గావీ కోసం ఒక దాత వలె మారిపోవడానికి కారణం ఇదే అని శ్రీ మోదీ అన్నారు.

గావీ కి భారతదేశం ఇస్తున్న మద్దతు ఒక్క ఆర్థికపరమైంది మాత్రమే కాదు, అంతర్జాతీయం గా టీకామందుల ధరలు దిగిరావడానికి భారతదేశం తాలూకు భారీ డిమాండు సైతం దోహదపడింది, గత అయిదు సంవత్సరాల లో గావీ కి 400 మిలియన్ డాలర్ లను ఆదా చేసింది అని ప్రధాన మంత్రి వివరించారు.

తక్కువ ధరల తో కూడిన నాణ్యమైన రోగచికిత్స సామగ్రి ని మరియు టీకామందుల ను ఉత్పత్తి చేసే సామర్థ్యం తనకు ఉందని భారతదేశం నిరూపించుకొంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అలాగే, వ్యాధినిరోధ సంబంధి కార్యక్రమాన్ని శరవేగం గా విస్తరింపచేయడం లో భారతదేశం తన స్వీయ అనుభవం తోను, విజ్ఞానశాస్త్ర పరిశోధన సంబంధిత ప్రతిభ తన వద్ద అధిక స్థాయి లో ఉన్న కారణం గాను ప్రపంచాని కి సంఘీభావాన్ని ప్రకటిస్తోంది అని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రపంచ స్థాయి లో జరుగుతున్న ఆరోగ్య రక్షణ కార్యకలాపాల కు తన వంతు తోడ్పాటు ను అందించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉండడం ఒక్కటే కాదు, ఇతరులతో కలసి పంచుకోవాలనే భావన తో మరియు ఇతరుల ను గురంచి పట్టించుకొంటూ ఉండాలన్న భావన తో అటువంటి తోడ్పాటు ను అందించాలన్న బలమైనటువంటి ఇచ్ఛాశక్తి కూడా భారతదేశానికి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

**