Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వరిష్ఠ పెన్షన్ బీమా యోజన – 2017


వరిష్ఠ పెన్షన్ బీమా యోజన – 2017 (విపిబివై 2017)ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం తన పోస్ట్- ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. సమాజంలో అన్ని వర్గాలను ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావడం మరియు ఆయా వర్గాలన్నింటికి సాంఘిక భద్రతను కల్పించడానికి ప్రభుత్వం కంకణబద్ధురాలు కావడంలో ఈ విపిబివై కూడా ఒక భాగంగా ఉన్నది.

ఈ పథకాన్ని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయడం జరుగుతుంది. వృద్ధాప్యంలో సాంఘిక భద్రతను కల్పించడం మరియు 60 సంవత్సరాలు అంతకు మించి వయస్సు కలిగిన వారిని అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా వారి వడ్డీ రూపేణా ఆదాయం ముందుముందు క్షీణించకుండా వారి ప్రయోజనాలను కాపాడడం ఈ పథకం ఉద్దేశాలు. ఈ పథకం పది సంవత్సరాల పాటు ఏటా 8 శాతం ప్రతిఫలానికి పూచీ పడే ప్రాతిపదికన పింఛన్ ను అందజేస్తుంది. నెలవారీ / త్రైమాసిక / అర్థ సంవత్సర మరియు సాంవత్సరిక పింఛన్ ను ఎంచుకొనే ఐచ్ఛికం ఇందులో లభిస్తుంది. ఎల్ఐసి సంపాదించిపెట్టే ప్రతిఫలానికి మరియు 8 శాతం హామీతో కూడిన ప్రతిఫలానికి మధ్య వ్యత్యాసాన్ని భారత ప్రభుత్వం సబ్సిడీ రూపంలో వార్షిక ప్రాతిపదికన భరిస్తుంది.

విపిబివై-2017ని ఈ పథకం ప్రవేశపెట్టిన తేదీ నాటి నుండి ఒక సంవత్సర కాలం లోపల సబ్ స్క్రిప్షన్ కోసం తెరచి ఉంచేటట్లుగా ప్రతిపాదించారు.

***