ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వరల్డ్ రేడియో డే’ నాడు రేడియో ప్రియులందరితో పాటు రేడియో పరిశ్రమలో పనిచేస్తున్న వారికి కూడా తన అభినందనలు తెలియజేశారు.
“వరల్డ్ రేడియో డే సందర్భంగా అభినందనలు. రేడియో పరిశ్రమలో పనిచేస్తూ ఈ మాధ్యమాన్ని క్రియాశీలంగాను, చైతన్యశీలంగాను ఉంచడానికి ప్రయత్నిస్తున్న వారితో పాటు రేడియో ప్రేమికులందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.
పరస్పర భావ ప్రసారానికి, నేర్చుకొనేందుకు రేడియో ఒక అద్భుతమైన సాధనం. నా వరకు చూస్తే, నేను నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం నన్ను భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో జోడించింది.
narendramodi.in/mann-ki-baat కు లాగాన్ అయ్యి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ఎపిసోడ్ లు అన్నింటినీ ఆలకించవచ్చు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Greetings on World Radio Day. I congratulate all radio lovers and those who work in the radio industry & keep the medium active & vibrant.
— Narendra Modi (@narendramodi) February 13, 2017
Radio is a wonderful way to interact, learn & communicate. My own #MannKiBaat experience has connected me with people across India.
— Narendra Modi (@narendramodi) February 13, 2017
All #MannKiBaat episodes can be heard here. https://t.co/9c68fg4PLT
— Narendra Modi (@narendramodi) February 13, 2017