Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ శిప్స్   2023 లో 11 పతకాల నుగెలిచినందుకు భారతదేశం యొక్క జూనియర్ మరియు కేడెట్ విలువిద్య క్రీడాకారుల కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి


వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ శిప్స్- 2023 లో 11 పతకాల ను గెలిచినందుకు భారతదేశం యొక్క జూనియర్ మరియు కేడెట్ విలువిద్య క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ ట్వీట్ ను ప్రధాన మంత్రి రీట్వీట్ చేస్తూ –

‘‘వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్ శిప్స్ 2023 లో రాణించినందుకు గాను మన విలువిద్య క్రీడాకారుల ను చూస్తే గర్వం గా ఉంది. వారి కార్యసాధన లు, భారతదేశం లో విలువిద్య యొక్క భవిష్యత్తు కు శుభ సంకేతం గా ఉండడం తో పాటు వర్థమాన ఆర్చర్ లు ఎందరికో ప్రేరణ ను కూడా అందించగలవు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/TS