Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం మన వరిష్ఠ సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల ధైర్య సాహసాలకు, త్యాగాలకు మనమిచ్చే గౌరవం: ప్రధానమంత్రి


మన దేశ ప్రజల ప్రాణాలను రక్షించే కర్తవ్య పాలనలో మన త్రివిధ దళాల వరిష్ఠ ఉద్యోగులతో పాటు మాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకువారు చేసిన త్యాగాలకు గుర్తుగా మనం అందించిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ (ఓఆర్ఓపీపథకం నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఓఆర్ఓపీ పథకాన్ని ప్రారంభించి నేటికి పదేళ్ళు పూర్తి అయ్యాయిఈ పథకం కోసం చాలా కాలంగా ఉన్న డిమాండును నెరవేర్చడమే కాకుండామన వీరులకు దేశం అందిస్తున్న గౌరవంగా ఆయన పేర్కొన్నారుమన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడం కోసంవారి సంక్షేమం కోసం ప్రభుత్వం సాధ్యమైనంతగా కృషి చేస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఓఆర్ఓపీని అమల్లోకి తీసుకువచ్చింది ఈ రోజేదేశ ప్రజలను కాపాడడానికి జీవితాలను అంకితం చేసే మన సైన్యంలోని వరిష్ఠ ఉద్యోగులుమాజీ సైనిక సిబ్బంది ధైర్య సాహసాలకుత్యాగాలకు ఇది ఒక ప్రత్యేక గౌరవంఓఆర్ఓపీ అమలుచేయాలంటూ చాలా కాలంగా డిమాండు ఉందిఆ డిమాండును నెరవేర్చిమన వీరులకు మన దేశ ప్రజలు ఎంతటి కృతజ్ఞతా భావంతో ఉన్నదీ పునరుద్ఘాటించేందుకు తీసుకొన్న ఒక ముఖ్య నిర్ణయం– ఓఆర్ఓపీ.

గత పదేళ్ళలో లక్షల కొద్దీ పించనుదారులకుపించనుదారుల కుటుంబాలకూ లబ్ధి చేకూర్చడం ద్వారా ఈ పథకం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుందిఅంకెల్ని పక్కన పెడితేమన సాయుధ దళాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉన్నదీ ఓఆర్ఓపీ చాటిచెబుతున్నదిమన సాయుధ బలగాలను శక్తిమంతం చేయడానికీమరి మనకు సేవలను అందిస్తున్న వారి సంక్షేమాన్ని మరింతగా పెంచడానికి సాధ్యమయ్యే సకల ప్రయత్నాలను మేం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. #OneRankOnePension’’

 

 

***

MJPS/SR