Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వన్యమృగాల సంరక్షణలో ఎప్పటికీ అగ్రగామిగా భారత్: ప్రధానమంత్రి


భారత్‌లో వన్యప్రాణి వైవిధ్యం సమృద్ధిగా ఉందని, ఇక్కడి సంస్కృతి వన్యమృగాలను గౌరవిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘మనం మన వన్యప్రాణులను పరిరక్షించుకోవడంతోపాటు భూగ్రహం చాలా కాలం పాటు మనుగడలో ఉండేటట్లు మన వంతు తోడ్పాటును అందించడంలో అన్ని దేశాల కన్నా ముందు నిలుద్దాం’’ అని శ్రీ మోదీ అన్నారు. 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘వన్యప్రాణుల ప్రేమికులకు గొప్ప వార్త! భారత్‌లో వన్యప్రాణి వైవిధ్యం సమృద్ధిగా ఉండడంతోపాటు ఇక్కడి సంస్కృతి వన్యమృగాలను గౌరవిస్తూ వస్తోంది. మనం మన అటవీజంతువులను పరిరక్షించుకోవడంతోపాటు, భూగ్రహం చాలా కాలం పాటు మనుగడలో ఉండేటట్లుగా మన వంతు తోడ్పాటును అందించడంలో కూడా అన్ని దేశాల కన్నా ముందుందాం.’’