ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరియు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కు ఈ రోజు న బెంగళూరు లోని కెఎస్ఆర్ రైల్ వే స్టేశన్ లో పచ్చజెండా ను చూపించి, ఆ రైళ్ళ ను ప్రారంభించారు.
ప్రధాన మంత్రి క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ (కెఎస్ఆర్) రైల్ వే స్టేశన్ లో 7వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు చేరుకొని, చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి సిగ్నల్ ను చూపెట్టారు. ఇది దేశం లో అయిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కానుంది. అంతేకాకుండా, ఇది దక్షిణ భారతదేశం లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా కానుంది. ఇది పారిశ్రామిక కేంద్రం అయినటువంటి చెన్నై కి, టెక్ మరియు స్టార్ట్-అప్ కేంద్రం అయినటువంటి బెంగళూరు కు, ఇంకా ప్రముఖ పర్యటక నగరం అయినటువంటి మైసూరు కు మధ్య సంధానాన్ని పెంపొందింప చేయనుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సంధానించడం తో పాటు వాణిజ్యపరమైన కార్యకలాపాల కు ఊతం గా కూడా నిలవనుంది. ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ సైతం ఇది వృద్ధి చెందింపచేయనుంది. బెంగళూరు లో ఈ రైలు కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
The Chennai-Mysuru Vande Bharat Express will boost connectivity as well as commercial activities. It will also enhance ‘Ease of Living.’ Glad to have flagged off this train from Bengaluru. pic.twitter.com/zsuO9ihw29
— Narendra Modi (@narendramodi) November 11, 2022
ಚೆನ್ನೈ-ಮೈಸೂರು ವಂದೇ ಭಾರತ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಸಂಪರ್ಕ ಸೌಲಭ್ಯದ ಜತೆಗೆ ವಾಣಿಜ್ಯ ಚಟುವಟಿಕೆಗಳನ್ನೂ ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ. ಅದು ಜೀವನವನ್ನು ಹೆಚ್ಚು ಸುಗಮಗೊಳಿಸುತ್ತದೆ. ಈ ರೈಲಿನ ಸಂಚಾರಕ್ಕೆ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹಸಿರು ನಿಶಾನೆ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ಸಂತಸವಾಗಿದೆ. pic.twitter.com/GtAxs6E846
— Narendra Modi (@narendramodi) November 11, 2022
దీనికి తరువాయి గా ప్రధాన మంత్రి 8వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు చేరుకొన్నారు. ఆయన భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చని సిగ్నల్ ను ఇచ్చారు. కర్నాటక నుండి యాత్రికుల ను కాశీ కి పంపించడం కోసం కర్నాటక ప్రభుత్వం మరియు రైల్ వే ల మంత్రిత్వ శాఖ కలసికట్టు గా భారత్ గౌరవ్ పథకం లో భాగం గా ఈ రైలు ను తీసుకు వచ్చాయి. ఈ తరహా రైలు ను తీసుకు వచ్చినటువంటి మొదటి రాష్ట్రం కర్నాటక యే. యాత్రికులు కాశీ ని, అయోధ్య ను మరియు ప్రయాగ్ రాజ్ ను సందర్శించడం కోసం సౌకర్యవంతమైన బస ను, ఇంకా మార్గదర్శనాన్ని వారికి అందించడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలు ను అందిస్తున్న ఒకటో రాష్ట్రం గా కర్నాటక ముందుకు వచ్చినందుకు కర్నాటక ను నేను అభినందించ దలచుకొన్నాను. ఈ రైలు కాశీ ని మరియు కర్నాటక ను సన్నిహితం చేయడం తో పాటు గా యాత్రికులు మరియు పర్యటకులు కాశీ ని, అయోధ్య ను, ఇంకా ప్రయాగ్ రాజ్ ను సౌలభ్యవంతం గా సందర్శించ గలుగుతారు.’’ అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి వెంట కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లతో పాటు కేంద్ర మంత్రులు శ్రీయుతులు అశ్వనీ వైష్ణవ్ మరియు ప్రహ్లాద్ జోశి లు ఉన్నారు.
I would like to compliment Karnataka for being the first state to take up the Bharat Gaurav Kashi Yatra train. This train makes brings Kashi and Karnataka closer. Pilgrims and tourists will be able to visit Kashi, Ayodhya and Prayagraj with ease. pic.twitter.com/7fBlEW091Q
— Narendra Modi (@narendramodi) November 11, 2022
ಭಾರತ್ ಗೌರವ್ ಕಾಶಿ ಯಾತ್ರಾ ರೈಲು ಸಂಚಾರ ಸೌಲಭ್ಯವನ್ನು ಪಡೆದ ಮೊದಲ ರಾಜ್ಯವಾದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಅಭಿನಂದನೆಗಳು. ಈ ರೈಲು ಕಾಶಿಯನ್ನು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿಸುತ್ತದೆ. ಯಾತ್ರಿಗಳು ಮತ್ತು ಪ್ರವಾಸಿಗರು ಕಾಶಿ, ಅಯೋಧ್ಯಾ ಹಾಗು ಪ್ರಯಾಗ್ ರಾಜ್ ಗೆ ಭೇಟಿ ನೀಡುವುದು ಸುಲಭವಾಗುತ್ತದೆ. pic.twitter.com/oTymcVgXTs
— Narendra Modi (@narendramodi) November 11, 2022
పూర్వరంగం
· వందే భారత్ ఎక్స్ ప్రెస్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 లో ప్రయాణికుల కు అనేక ఉన్నతమైన సౌకర్యాలతో పాటు విమానం లో లభ్యం అయ్యేటటువంటి సదుపాయాలు సైతం అందుబాటు లో ఉంటాయి. దేశీయం గా రూపొందించిన అటువంటి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం అయిన ‘కవచ్’ సహా అత్యాధునిక సురక్ష సంబంధి పరికరాల ను ఈ రైలు కు జోడించడమైంది. వందే భారత్ 2.0 లో మరిన్ని అదనపు సౌకర్యాల ను జతపరచడమైంది. ఉదాహరణ కు తీసుకొంటే, ఈ రైలు కు కేవలం 52 సెకన్ లలో గంట కు 100 కిలోమీటర్ వేగాన్ని అందుకోగలగడం మరియు గంట కు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందిపుచ్చుకోగలగడం వంటి మెరుగైన లక్షణాల ను సంతరించడమైంది. ఇదివరకటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ 430 టన్నుల వర్శన్ తో పోల్చి చూసినప్పుడు సరికొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ బరువు 392 టన్నులు గా మాత్రమే ఉంటుంది. దీనిలో వై- ఫై కంటెంట్ ఆన్- డిమాండ్ సౌకర్యం సైతం లభిస్తుంది. మునుపటి వర్శన్ లోని 24 అంగుళాల తెర లతో పోలిస్తే ఈ రైలు లోని ప్రతి ఒక్క రైలు పెట్టె లో 32 అంగుళాల తెర లు ప్రయాణికులకు సమాచారం తో పాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పర్యావరణ పరం గా చూసినప్పుడు సైతం ప్రయాణికుల కు అనుకూలం గా ఉంటుంది. ఎలాగంటే దీని లోని ఏసీ లు శక్తి ని 15 శాతం అధికం గా ఆదా చేయగలుగుతాయి. దీని లోని ట్రాక్శన్ మోటారు కు ధూళి రహిత స్వచ్ఛ శీత గాలి ని వెలువరించే సదుపాయం కల్పించడం తో ఈ రైలు లో ప్రయాణించడం మరింత సుఖప్రదం గా ఉంటుంది. ఇదివరకటి వందే భారత్ రైలు లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారికి మాత్రమే అందించిన సైడ్ రిక్లైనర్ సీట్ సౌకర్యాన్ని ఇప్పుడు అన్ని క్లాసుల కు అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రైలు పెట్టెల కు 180 డిగ్రీ లు వంపు తిరిగే సీట్ ల సౌకర్యాన్ని కూడా కల్పించడమైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క కొత్త రూపు రేఖల లో భాగం గా గాలి ని శుభ్రపరచడం కోసం రూఫ్ మౌంటెడ్ పేకేజ్ యూనిటు (ఆర్ఎమ్ పియు) లో ఒక ఫోటో కేటలిటిక్ అల్ట్రా వాయ్ లెట్ ఎయర్ ప్యూరిఫికేశన్ సిస్టమ్ ను నెలకొల్పడమైంది. ఈ వ్యవస్థ ను చండీగఢ్ లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ఆర్గనైజేశన్ (సిఐఎస్ఒ) సిఫారసు చేసిన ప్రకారం రూపుదిద్దడమైంది. దీనిని ఆర్ఎమ్ పియు యొక్క రెండు చివరల లోను అమర్చడమైంది. వీచే గాలి లో మరియు తిరిగి బయటకు పోయే గాలి లో రోగకారక క్రిములు, కీటకాలు, సూక్ష్మ జీవులు, వైరస్ లు వంటి వాటి ని వడగట్టి, స్వచ్ఛమైన వాయువు ను అందించేటట్టు ఈ ఏర్పాటు ను చేయడమైంది.
· భారత్ గౌరవ్ రైళ్ళు
భారతీయ రైల్ వే లు ఇతివృత్తం ప్రధానం గా ఉండేటటువంటి భారత్ గౌరవ్ రైలు కార్యకలాపాల ను 2021వ సంవత్సరం నవంబర్ నెల లో మొదలుపెట్టింది. భారతదేశం యొక్క ఘనమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని మరియు వైభవోపేతమైనటువంటి చారిత్రిక ప్రదేశాల ను భారత్ గౌరవ్ రైళ్ళ మాధ్యమం ద్వారా భారతదేశ ప్రజల కు, అలాగే ప్రపంచాని కి కళ్ళ కు కట్టాలి అనేదే ఈ ఇతివృత్తం యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ఈ పథకం పర్యటన రంగం లోని వృత్తి నిపుణుల కీలకమైన బలాల ను ఆలంబన గా చేసుకొని, భారతదేశ పర్యటన రంగం లోని విస్తృత అవకాశాల ను సద్వినియోగ పరచుకోవడం కోసం ఇతివృత్తం ఆధారిత రైళ్ల ను నడపాలి అన్నది కూడా ఈ పథకం యొక్క ఉద్దేశ్యాల లో ఒకటి గా ఉంది.
*****
PM @narendramodi flagged off the new Vande Bharat Express between Mysuru and Chennai. It will make commuting for citizens convenient and comfortable. pic.twitter.com/p6U7wv9RKq
— PMO India (@PMOIndia) November 11, 2022
Connecting Kashi and Karnataka!
— PMO India (@PMOIndia) November 11, 2022
PM @narendramodi flagged off Bharat Gaurav Kashi Yatra train. This will ensure comfortable travel experience for the pilgrims as well as boost tourism. pic.twitter.com/sRd7JIULv7
ಚೆನ್ನೈ-ಮೈಸೂರು ವಂದೇ ಭಾರತ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಸಂಪರ್ಕ ಸೌಲಭ್ಯದ ಜತೆಗೆ ವಾಣಿಜ್ಯ ಚಟುವಟಿಕೆಗಳನ್ನೂ ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ. ಅದು ಜೀವನವನ್ನು ಹೆಚ್ಚು ಸುಗಮಗೊಳಿಸುತ್ತದೆ. ಈ ರೈಲಿನ ಸಂಚಾರಕ್ಕೆ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಹಸಿರು ನಿಶಾನೆ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ಸಂತಸವಾಗಿದೆ. pic.twitter.com/GtAxs6E846
— Narendra Modi (@narendramodi) November 11, 2022
The Chennai-Mysuru Vande Bharat Express will boost connectivity as well as commercial activities. It will also enhance ‘Ease of Living.’ Glad to have flagged off this train from Bengaluru. pic.twitter.com/zsuO9ihw29
— Narendra Modi (@narendramodi) November 11, 2022
ಭಾರತ್ ಗೌರವ್ ಕಾಶಿ ಯಾತ್ರಾ ರೈಲು ಸಂಚಾರ ಸೌಲಭ್ಯವನ್ನು ಪಡೆದ ಮೊದಲ ರಾಜ್ಯವಾದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಅಭಿನಂದನೆಗಳು. ಈ ರೈಲು ಕಾಶಿಯನ್ನು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿಸುತ್ತದೆ. ಯಾತ್ರಿಗಳು ಮತ್ತು ಪ್ರವಾಸಿಗರು ಕಾಶಿ, ಅಯೋಧ್ಯಾ ಹಾಗು ಪ್ರಯಾಗ್ ರಾಜ್ ಗೆ ಭೇಟಿ ನೀಡುವುದು ಸುಲಭವಾಗುತ್ತದೆ. pic.twitter.com/oTymcVgXTs
— Narendra Modi (@narendramodi) November 11, 2022