Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ మాన్య తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


లోక్ మాన్య తిలక్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. పుణె లో గత సంవత్సరం జరిగిన ఒక కార్యక్రమంలో లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని తాను స్వీకరించిన వేళ తాను ఇచ్చిన ఉపన్యాసాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పంచుకొన్నారు.

 

 

 

 

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

 

‘‘లోక్ మాన్య తిలక్ జయంతి సందర్భంగా ఆయనకు ఇదే శ్రద్ధాంజలి. స్వాతంత్య్రాన్ని సాధించుకోవడం కోసం భారతదేశం జరిపిన పోరాటంలో ఒక సమున్నత వ్యక్తిగా ఆయనను సదా స్మరించుకోవడం జరుగుతుంటుంది. ఆయన ఒక దార్శనికుడు, జాతీయవాద స్ఫూర్తిని రగిలించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేయడం తో పాటు విద్య, సేవ కూడా ముఖ్యమంటూ వాటి ప్రాముఖ్యాన్ని ఆయన చాటిచెప్పారు. పుణె లో కిందటి ఏడాది జరిగిన ఒక కార్యక్రమంలో లోక్ మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందుకొనే గౌరవం నాకు లభించింది; ఆ కార్యక్రమంలో నేను చేసిన ప్రసంగాన్ని ఈ క్రింద ఇచ్చిన లింకు లో పంచుకొంటున్నాను.’’