Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లావో పిడిఆర్ లో జరుగుతున్న 21వ ఆసియాన్ -ఇండియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి

లావో పిడిఆర్ లో జరుగుతున్న 21వ ఆసియాన్ -ఇండియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి


21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశం ఈ రోజు లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగింది. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ తూర్పు దేశాలకు ప్రాధాన్యం ఇచ్చే విధానం) అమలుకు పదేళ్ళు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడానికి,  సహకారానికి భవిష్యత్తు దిశను రూపొందించడానికి ఆసియాన్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి పాల్గొనడం ఇది 11వ సారి.

2. ఆసియా దేశాల సమాఖ్య (ఆసియన్ ) ఐక్యత, ఆసియన్ కేంద్రీకరణ, ఇండో-పసిఫిక్ పై ఆసియన్ దృష్టి కోణానికి భారత్ మద్దతును ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు. 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా అభివర్ణించిన ఆయన, ఆసియా భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయడంలో భారత్-ఆసియాన్ సంబంధాలు కీలకమని పేర్కొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ పురోగతిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గత పదేళ్లలో భారత్-ఆసియాన్ వాణిజ్యం రెట్టింపు పెరిగి 130 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొన్నారు. ఆసియాన్ నేడు భారతదేశ అతిపెద్ద వాణిజ్య , పెట్టుబడి భాగస్వాములలో ఒకటిగా ఉందని, ఏడు ఆసియాన్ దేశాలతో నేరుగా విమాన సంబంధాలు  ఏర్పాటు అయ్యాయని, ఈ ప్రాంతంతో ఫిన్-టెక్ సహకారం ఆశాజనకంగా  ప్రారంభం అయిందని తెలిపారు. అలాగే, ఐదు ఆసియాన్ దేశాలలో భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడంలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఆసియన్-ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎ ఐ టి ఐ జి ఎ)సమీక్షను సకాలంలో పూర్తి చేయవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. తద్వారా ఆసియన్-భారతీయ సమాజం కోసం మరింత ఆర్థిక అవకాశాలను పొందవచ్చునని అన్నారు. నలంద విశ్వవిద్యాలయంలో ఆసియాన్ యువతకు అందిస్తున్న స్కాలర్ షిప్ ల ద్వారా భారత్-ఆసియాన్ విజ్ఞాన భాగస్వామ్యంలో పురోగతి గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు.

3.”సంబంధాలను,సవాళ్ళను.ఎదుర్కొనే దృఢత్వాన్ని పెంపొందించడం” అనే సదస్సు ఇతివృత్తానికి అనుగుణంగా, ప్రధాన మంత్రి 10 సూత్రాల ప్రణాళికను ప్రకటించారు, వీటిలో కింది అంశాలు ఉన్నాయి.

i) 2025 సంవత్సరాన్ని ఆసియాన్-ఇండియా పర్యాటక సంవత్సరం (ఇయర్ ఆఫ్ టూరిజం) గా జరుపుకోవడం-  ఇందుకు ఉమ్మడి కార్యకలాపాల కోసం భారత్ ఐదు మిలియన్ డాలర్లను అందిస్తుంది.

ii) యూత్ సమ్మిట్, స్టార్టప్ ఫెస్టివల్, హ్యాకథాన్, మ్యూజిక్ ఫెస్టివల్, ఆసియాన్-ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్స్ , ఢిల్లీ సంభాషణలతో సహా అనేక ప్రజా కేంద్రీకృత కార్యకలాపాల ద్వారా యాక్ట్ ఈస్ట్ పాలసీ దశాబ్దాన్ని జరుపుకోవడం.

iii) ఆసియాన్-ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆసియాన్-ఇండియా మహిళా శాస్త్రవేత్తల సదస్సును నిర్వహించడం.

iv) నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్ షిప్ ల సంఖ్యను రెట్టింపు చేయడం , భారతదేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఆసియాన్ విద్యార్థులకు కొత్త స్కాలర్ షిప్ లను అందించడం.

v) 2025 నాటికి వస్తు ఒప్పందంలో ఆసియన్-ఇండియా వాణిజ్య సమీక్షను పూర్తి చేయడం;

vi) విపత్తులను తట్టుకునే. సామర్ధ్యాన్ని పెంచడం- దీని కోసం భారతదేశం 5 మిలియన్ డాలర్లను అందుబాటులో ఉంచుతుంది.

vii) ఆరోగ్య నిర్వహణ సామర్ధ్యాన్ని పెంపొందించే దిశగా కొత్తగా ఆరోగ్య మంత్రుల వ్యవస్థను ప్రారంభించడం.

viii) డిజిటల్ సైబర్ సామర్ధ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఆసియాన్-ఇండియా సైబర్ పాలసీ సంభాషణల కోసం నియమిత యంత్రాంగాన్ని ప్రారంభించడం.

ix) గ్రీన్ హైడ్రోజన్ పై వర్క్ షాప్.

x) వాతావరణ పరిరక్షణ దిశగా ‘అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి’ ప్రచారంలో పాల్గొనాలని ఆసియాన్ నాయకులకు ఆహ్వానం

.4. ఆసియాన్-ఇండియా భాగస్వామ్యం ద్వారా పూర్తి సామర్థ్యాన్ని సాధించడంలో ఇరు పక్షాలకు మార్గనిర్దేశం చేసే కొత్త ఆసియాన్-ఇండియా కార్యాచరణ ప్రణాళిక (2026-2030) ను రూపొందించడానికి సమావేశంలో నాయకులు అంగీకరించారు. రెండు సంయుక్త ప్రకటనలను కూడా ఆమోదించారు:

i) భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ (ఎ ఇ పి ) మద్దతుతో ఇండో పసిఫిక్ పై ఆసియన్ దృష్టికోణం (ఎ ఒ ఐ పి ) నేపథ్యంలో ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ఆసియన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఆమోదించిన సంయుక్త ప్రకటన లో ఆసియన్ – భారత్ మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళడంలో భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ కృషిని నాయకులు గుర్తించారు.

ii) డిజిటల్ మార్పు పై ఆసియాన్-ఇండియా సంయుక్త ప్రకటన లో డిజిటల్ మార్పు రంగంలో భారతదేశ నాయకత్వాన్ని నాయకులు ప్రశంసించారు.  డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భారతదేశంతో భాగస్వామ్యాన్ని స్వాగతించారు.

5. 21వ ఆసియాన్ -ఇండియా శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు, సాదర ఆతిథ్యం ఇచ్చినందుకు లావోస్ ప్రధాన మంత్రికి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా కంట్రీ కో-ఆర్డినేటర్ గా నిర్మాణాత్మక పాత్ర పోషించిన సింగపూర్ ను కూడా ప్రధాన మంత్రి అభినందించారు. భారత దేశానికి కొత్త కంట్రీ కోఆర్డినేటర్ అయిన ఫిలిప్పీన్స్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని  తెలిపారు.

 

***