Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించిన – ప్రధానమంత్రి


లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆమెను స్మరించుకున్నారు.   అయోధ్యలోని చౌక్‌ కు లతా దీదీ పేరు పెట్టనున్నట్లు శ్రీ మోదీ తెలియజేసారు.   ఇది గొప్ప భారతీయ దిగ్గజాలలో ఒకరికి తగిన నివాళి అని, ఆయన అన్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,   లతా దీదీ జయంతి సందర్భంగా ఆమె ని స్మరించుకుంటున్నాను.  ఆమె అమితమైన ఆప్యాయతను కురిపించిన అసంఖ్యాక సందర్భాలను నేను  రోజు గుర్తుచేసుకుంటున్నాను.  అయోధ్యలోని ఒక చౌక్‌ కిఈరోజు ఆమె పేరు పెట్టడం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఇది గొప్ప భారతీయ దిగ్గజాలలో ఒకరికి సముచితమైన నివాళి.” అని పేర్కొన్నారు. 

*****

DS/ST