Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లక్షద్వీప్ లో తనకు కలిగిన అనుభూతుల ను వెల్లడించిన ప్రధానమంత్రి   

లక్షద్వీప్ లో తనకు కలిగిన అనుభూతుల ను వెల్లడించిన ప్రధానమంత్రి   

 


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో తనకు కలిగిన అనుభూతుల ను గురించి ఈ రోజు న వెల్లడి చేయడం తో పాటు గా లక్షద్వీప్ యొక్క ప్రజలు చేసిన అతిథి మర్యాదల కు గాను వారికి ధన్యవాదాల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి తన అభిప్రాయాల ను ఎక్స్ మాధ్యం లో ఈ కింది విధం గా శేర్ చేశారు :

‘‘ఇటీవల, లక్షద్వీప్ ప్రజల వద్ద కు వెళ్ళేటటువంటి అవకాశం నాకు దక్కింది. ఆ దీవుల యొక్క అబ్బురపరచేటటువంటి శోభ ను చూసి నేను ఇప్పటికీ ఇంకా తేరుకోలేకుండా ఉన్నాను. అక్కడి ప్రజల విస్మయకారి స్నేహశీలత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నది. అగత్తీ లో, బంగారామ్ లో, ఇంకా కవరత్తీ లో అక్కడి ప్రజల తో భేటీ అయ్యి వారి తో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. ఆ దీవుల ప్రజల ఆతిథ్యానికి గాను వారి కి నేను ధన్యవాదాలు పలుకుతున్నాను. లక్షద్వీప్ నుండి కొన్ని గగనతల దృశ్యాల ను, మరికొన్ని ఇతర దృశ్యాల ను ఇక్కడ పొందుపరుస్తున్నాను..’’